ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India: జనాభా విస్ఫోటం మానవ వనరులుగా పరిగణించాలా?

ABN, Publish Date - Sep 27 , 2025 | 01:25 PM

దశాబ్దం క్రితం వరకు పేదరికం, నిరుద్యోగం, ఆహార సంక్షోభం వగైరా సమస్యలకు దారితీస్తోందనే సాకుతో జనాభా పెరుగుదల (జనాభావిస్ఫోటం)పై ఆందోళనలుండేవి. ఇటీవల అంతకంతకు పెరుగుతున్న జనాభాను మానవవనరులుగా పరిగణించే సానుకూల భావన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇద్దరు వద్దు... ఒక బిడ్డే ముద్దు అనే నినాదాలకు చెల్లుచీటీ రాస్తూ ఆ మధ్య ప్రధాన మంత్రి నరేంద్రమోదీ , ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునివ్వడం తెలిసిందే.

దశాబ్దం క్రితం వరకు పేదరికం, నిరుద్యోగం, ఆహార సంక్షోభం వగైరా సమస్యలకు దారితీస్తోందనే సాకుతో జనాభా పెరుగుదల (జనాభావిస్ఫోటం)పై ఆందోళనలుండేవి. ఇటీవల అంతకంతకు పెరుగుతున్న జనాభాను మానవవనరులుగా పరిగణించే సానుకూల భావన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇద్దరు వద్దు... ఒక బిడ్డే ముద్దు అనే నినాదాలకు చెల్లుచీటీ రాస్తూ ఆ మధ్య ప్రధాన మంత్రి నరేంద్రమోదీ , ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునివ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనాభా విస్పోటం అనేది ప్రతికూలత కన్నా ఎక్కువగా అనుకూలతను వ్యాప్తిచేస్తోంది.

జనాభా పెంపు పిలుపు రాజకీయ కలకలం?

జనాభా పెరుగుదలపై వివిధ రాజకీయ నేతల అభిప్రాయాలు కొంతకాలంగా చర్చనీయాంశంగా మారాయి. యువశక్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశం కొంతవరకు సరైందే అయినా వనరులు, మౌలిక సదుపాయాలు లేకుండా జనాభా పెరుగుదల అనారోగ్యకరమని అంగీకరించాల్సిందే. విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు సమర్థవంతంగా లేని పరిస్థితిలో, అధిక జనాభా సామాజిక అసమానతలను, వనరులపై ఒత్తిడిని మరింత పెంచుతుంది. అయితే, రాజకీయ పయోజనాలకోసం జనాభా పెంచాలనే పిలుపులు చాలా సార్లు వినిపిస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో పారదర్శక, సమగ్రజనాభా విధానాలను అమలు చేయడం అత్యంత అవసరం.

మాల్థస్ జనాభా సిద్ధాంతం పునర్మూల్యాకనం అవసరమా?

జనాభాపై మొదటిగా శాస్త్రీయ పరిశోధన చేసినవాడు థామస్ రాబర్ట్ మాల్థస్ అనేబ్రిటిష్ ఆర్థికవేత్త. ఆయన 1798లో 'జనాభా సూత్రంపై ఒక వ్యాసం' అనేతన రచనలో జనాభా తరచూ చాలా వేగంగా పెరుగుతుందని, ఆహారధాన్యాల ఉత్పత్తి మాత్రం అందుకు తగిన నిష్పత్తిలో పెరగదని ప్రతిపాదించాడు. మానవ జనాభా రేఖాగణిత రేటుతో అంటే 1, 2, 4, 8 నిష్పత్తిలో అమాంతం పెరుగుతుంటే ఆహార సరఫరా మాత్రం అంకగణిత రేటుతో 1, 2, 3, 4... లెక్కన పెరుగుతుందని సిద్ధాంతరీకరించాడు. కరవు కాటకాలు, వరదలు, యుద్ధాలు వగైరా ప్రకృతి విపత్తులు ఆహార కొరతకు దారితీస్తాయని, ఆ ప్రకృతి వైపరీత్యాలే జనాభాను నియంత్రిస్తాయని సూత్రీకరించాడు. అయితే నానాటికీ కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతికతతో ఆహారోత్పత్తి గణనీయ పెరుగుదల నమోదు చేస్తున్న నేపథ్యంలో జనాభా విస్ఫోటం దుష్పరిణామాలకు దారితీస్తుందనేది అశాస్త్రీయ వాదనగా చెప్పవచ్చు.

పంటల విరామం జనాభాకీ వర్తింపచేయాలా?

పాపులేషన్ హాలుడే భావన అనేది నిర్దిష్ట కాలానికి జనాభా పెరుగుదలపై ఆంక్షలు విధించడాన్ని సూచిస్తుంది. ఇది పంటకు ఇచ్చే విరామం లాంటిది. భూసారం పెంచేందుకు పంటల విరామం పాటించడం ఆనవాయితీ. దీన్ని క్రాప్ హాలిడే అంటారు. ముక్కారు పంటలు పండేచోట కూడా నేలను కొంతకాలం ఖాళీగా ఉంచి విరామం ఇవ్వడం వల్ల భూమిలో పోషకాల సమతుల్యత సర్దుబాటు అవుతుందనేది శాస్త్రవేత్తల మాట. సహజవనరుల ఆదాకు చైనా లాంటిదేశాలు జనాభా విరామాన్ని అధికారికంగా అమలు చేసేక్రమంలో దశాబ్దం గడిచేసరికి సంతానోత్పత్తి రేటు దారుణంగా క్షీణించింది. అయితే మన దేశంలో కుటుంబ నియంతణ్ర కేరళ, తమిళనాడు

రాష్ట్రాలలో పభుత్వపరంగా కాకుండా ప్రజల స్వామ్యంతో విజయవంతమయింది. చిన్న కుటుంబాల సిద్ధాంతం విజయవంతం కావడం, మహిళల విద్య, ఆరోగ్య పరిరక్షణలో పెట్టుబడి వల్ల సాధ్యమైంది. దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే అది జనాభా నియంతణ్ర సాధ్యపడుతుంది. చిన్న కుటుంబాలకు పన్ను లాభాలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం ఈ విధానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

పెరిగే జనాభాతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా?

జనాభా పెరుగుదల శ్రామిక వర్గంపై భారాన్ని పెంచుతుంది. జనాభాలో వేగవంతమైన పెరుగుదలకు, వైద్య సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన పురోగతి కొంతవరకు కారణం, దీనివల్ల ప్రజలు ఎక్కువకాలం జీవించగలుగుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్దాయం పెరిగింది. శిశు మరణాల రేటు తగ్గింది. మశూచి వంటి కొన్ని ప్రాణాంతక వ్యాధులు కనుమరుగయ్యాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవ జనాభా మరణాల సంఖ్య పెరుగుతుంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతికత, మెరుగైన వైద్యసేవలు, శుభ్రత కారణంగా మరణాల రేటు తగ్గడంతో జనాభా విస్ఫోటం తనదైన ప్రభావం చూపుతోంది. జనాభా విస్పోటం సహజ వనరులైన నేల, నీరు, ఇంధనం వగైరాలపై ఒత్తిడి కలిగించి వాటి కొరతకు దారితీస్తుంది. ఇక అధిక జనాభా వల్ల పర్యావరణానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు. సమాజంపై కూడా దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందనడానికి పెచ్చరిల్లే నిరుద్యోగం, పేదరికం, నివాసాల లేమి, ఆహార సంక్షోభం, విద్య వైద్య వనరుల్లో కోత ఆపై పట్టణాలు, నగరాలు కిక్కిరిసిపోవడం...ఇలా అన్ని సమస్యలకీఅధిక జనాభా పధాన కారణమవుతుంది.

ఈ సమస్యలు భారత్ వంటి దేశాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాలపై జనాభా పెరుగుదల భారంగా పరిగణిస్తుంది. జనాభా విస్పోటం అదుపులోకి రావాలంటే సమగ్రకార్యాచరణ ప్రణాళిక అవసరమవుతుంది. మహిళల్లో విద్యా, అవగాహన పెంచడం, కుటుంబ నియంతణ్ర ప్రోత్సహించడం, మెరుగైన వైద్య సేవలందించడం, పభావవంతంగా ప్రభుత్వ విధానాలు అమలు చేయడం కీలక చర్యలుగా చెప్పవచ్చు. ఒకటి మాత్రం నిజం.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పభుత్వాలు ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే స్థిరమైన జనాభా నియంతణ్ర విధానాలు అమలవ్వాలి. అది మాత్రమే సమతుల్య అభివృద్ధిని ఇవ్వగలదు. భవిష్యత్ తరాల కోసం పకృతిని, వనరులను కాపాడడం అనేది అత్యవసరం.

డెడ్ ఎకానమీ వ్యాఖ్యలు అవాస్తవమా ?

శ్వేతసౌధం అధిపతి డొనాల్డ్ ట్రంప్.. ఆ మధ్య శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత, రష్యా ఆర్థిక వ్యవస్థలను ఉద్దేశించి "డెడ్ ఎకానమీ" ( నిర్వీర్య ఆర్థిక వ్యవస్థలు) అంటూ వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పదేపదే చెబుతున్నారు. జర్మనీ, జపాన్ ఆర్థిక వ్యవస్థలతో నువ్వా నేనా అంటూ భారత ఆర్ధికవ్యవస్థ పోటీపడుతున్న నేపథ్యంలో ట్రంప్ అక్కసు వెనక కారణాలేమైనా అధిక జనాభా తాలూకు దుష్ప్రభావాలు, సవాళ్లు అంచనా వేయాలి. జనాభాలో చైనాను అధిగమించి ప్రపంచంలో అతిపెద్ద జనసంఖ్య కలిగిన దేశంగా మారిన భారతదేశం ఏ రకంగా చూసినా డెడ్ ఎకానమీ అనిపించుకోదు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగిన సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టిపెడితే జనవనరుల ద్వారా అద్భుతాలు చేసేవీలుంది. సాంకేతికత ద్వారా ఉపాధిరంగం రూపురేఖలు మార్చవచ్చు.

భారత్ నిర్జీవ ఆర్థిక వ్యవస్థ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు నిరాధారమని, పూర్తిగా అవాస్తవమని, మన ఆర్థికవ్యవస్థ ట్రంప్ చెప్పిన విధంగా బలహీనంగా లేదని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా ట్రంప్ తీరును తప్పుపట్టారు. ట్రంప్ వ్యాఖ్యలు అసమంజసమని మరో పతిపక్ష ఎంపీ శశిథరూర్ తిప్పికొడుతూ భారత ఆర్థిక వ్యవస్థ చైనా మాదిరిగా పూర్తిగా ఎగుమతులపై ఆధారపడలేదని, దేశీయంగా బలమైన మార్కెట్ ఉన్న దేశం ఎప్పటికీ నిర్జీవం కాదని స్పష్టంచేశారు. ప్రపంచంలో ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉందని తెలుసుకునేందుకు కావాల్సినంత సమాచారం, లెక్కలు అందుబాటులో ఉన్నాయని మరో విపక్ష నేత ప్రియాంకా చతుర్వేది బదులిచ్చారు. ఏమైనా వాణిజ్య చర్చల్లో బేరసారాల కోసం ట్రంప్ ఇలా దురభిప్రాయం వ్యక్తం చేసి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అగ్రరాజ్యాలతో వాణిజ్య ఒప్పందానికి ముందు భారత ఆర్థిక, రక్షణ, విదేశాంగ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని ప్రజల ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా అడుగులు వేయాలి. భారత పజల్ర ఆకాంక్షలు, విజయాలు మేర భారత ప్రభుత్వం ముందుకెళ్లాలి. భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉందని నిరూపించుకోవాలి. జనాభా పెరుగుదల లాంటివి పతికూల అంశాలు కాకుండా జాగ్రత్తపడాలి. అంతెందుకు కేవలం 9 ఏళ్లలోనే భారత యూపీఐ భదత్ర, విశ్వాసం కలిగిస్తూ, శరవేగంగా విస్తరిస్తూ ‘విసా’ పేమెంట్ క్రెడిట్ కార్డును దాటేసి ప్రపంచంలో నంబర్ ఒన్ పేమెంట్ సిస్టమ్‌గా మారింది. టీదుకాణం నుంచి మాల్స్ వరకు రోజూ 650 మిలియన్ లావాదేవీలు నేడు జరుగుతున్నాయంటే అంతటి కొనుగోలు శక్తి కలిగిన భారత్ ఏ రకంగానూ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు డెడ్ ఎకానమీ కాదు, కాబోదు. అమెరికాలోని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పిగ్లోబల్ భారత్ క్రెడిట్ రేటింగ్ పెంచడం ద్వారా ఆర్థిక స్థిరత్వంపై నమ్మకాన్ని ఉంచింది. భారత్ యువ జనాభా,

పెరుగుతున్న సాంకేతిక నైపుణ్యం, పెద్ద సంఖ్యలో స్టార్ట్-అప్ ల ఏర్పాటు ... ఇవన్నీ భారత్ ఎట్టి పరిస్థితుల్లో డెడ్ ఎకానమీ కాదని స్పష్టం చేస్తాయి. భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతానికి ఎగబాకింది. భారత ఆర్థిక వ్యవస్థను గ్రీస్ దేశంతో పోల్చడం తరచుగా కనిపిస్తోంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పరంగా భారతదేశం 2047 నాటికి గ్రీస్తో సమానమయ్యే పక్షంలో మనదేశ వృద్ధిరేటు సాలీనా 7.5 శాతానికి పెరగాలి.

కానీ భారతదేశ వాస్తవ జీడీపీని 4 నుంచీ 5 శాతానికే గణాంకాలు పరిమితం చేస్తున్నాయి. విద్యావేత్త అశోక్ మోదీ సహా పలువురు స్వతంత్ర ఆర్థిక వేత్తలు ఈ వృద్ధి గణాంకాల కచ్చితత్వం, విశ్వసనీయతపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 2015 నాటి మన గణాంక విధానం అసమగ్రత కారణంగా భారతదేశ జీడీపీ వృద్ధి

గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు పైకి కనిపిస్తోందనేది ఆయన వాదన. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ తయారు చేసిన బేస్ ఇయర్ సర్దుబాటు ప్రక్రియ సేవలను లెక్కించే పద్ధతులను సవరించాయి. తత్ఫలితంగా ఆర్థికవృద్ధి అంచనాలు పెరిగిపోయాయి. ఏమైనా అధిక జనాభా, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రుణభారం, నిరుద్యోగం

మొదలైన అనేక అంశాలు దేశాల ఆర్థిక వ్యవస్థలను "డెడ్ ఎకానమీ" దిశగా నెడుతున్నాయి. ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కుకున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా నానాటికీ దిగజారడం వల్ల ఆ చారితక్ర వాస్తవాన్ని కప్పిపుచ్చడానికే ట్రంప్ భారత్, రష్యాలపై విరుచుకుపడుతున్నాడు.

ఆ మాటకొస్తే అమెరికా డెడ్ ఎకానమి ?!

అతిపెద్దవి నిమయ దేశంగా ఉన్న అమెరికా ఆర్థిక సంక్షోభం కోరల్లో ఉంది. దేశ అధ్యక్షుడు స్థానికత అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్ విసురుతోంది. అమెరికా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన దేశమే అయినా దాని ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి నమోదు చెందడం లేదు. అమెరికాలో ద్రవ్యోల్బణ నియంతణ్ర పేరుతో కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చాలా కాలంగా వడ్డీ రేట్లు పెంచుతూ పోతోంది. ఫలితంగా గృహరంగాన్ని మాంద్యం చీకట్లు ఆవరించాయి. విద్యార్థులు రుణభారంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమెరికా పభుత్వ రుణభారం 35 ట్రిలియన్ డాలర్లు మించిపోయింది. అదే సమయంలో భారతదేశంలో తయారీ రంగం, మౌలిక సదుపాయాలు

వేగం అందుకున్నాయి. భారతదేశంలో వృద్ధి ఉన్నప్పటికీ, అది అందరికీ సమానంగా లభించక పోవడం వేరే అంశం. మొత్తంమీద భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగానే ఉంది. ట్రంప్ చెప్పినదానికి, వాస్తవానికి పొంతన లేనేలేదు.

జనాభా విస్ఫోటంతో ఆర్థిక వ్యవస్థ డీలా పడుతుందా?

అధిక జనాభా పెరుగుదల తప్పనిసరిగా ఆర్థిక వృద్ధికి దారితీయదు. పపంచంలోని కొన్ని పేద దేశాలలో అధిక జనాభా ఉంది. శ్రమ శక్తిలో చురుకుగా పాల్గొనే కార్మికుల విద్య, నైపుణ్యాలు ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. జనాభా గణాంకాలు ఆర్థిక వృద్ధి భవితవ్యాన్ని నిర్ణయించవు, కానీ అవి ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యానికి కీలకం కావచ్చు. అభివృద్ధి చెందిన దేశాలలో తగ్గుతున్న జనన రేటుతో పాటు వృద్ధాప్య జనాభా భవిష్యత్తులో ఆర్థిక వృద్ధిలో తగ్గుదలను సూచిస్తుంది. విద్య, నైపుణ్యాలు, ఉత్పాదకత పెరుగుదల వగైరా చర్యలు జనాభా మార్పుల పభావాన్ని తగ్గించగలవు. సాంకేతిక పురోగతి ఉత్పాదకత పెంపుదలకు ఒక మూలం. జనాభా ఆర్థికవృద్ధి రేటులో కీలక పాత్ర పోషిస్తుంది. జనాభా అనేది శమ్ర సరఫరా, ఉత్పాదకతలను ప్రభావితం చేస్తుంది, దీనిని డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. శ్రామిక శక్తి భాగస్వామ్యం, జనన రేట్లు, శ్రామిక శక్తిలో ఉన్నవారి వయోభేదాలు, వారి నైపుణ్యాలు అనేవి దేశ ఆర్థిక శ్రేయస్సుపై ప్రభావం చూపుతాయి. సాంకేతిక ఆవిష్కరణ కూడా కీలక భూమిక వహిస్తుంది. అధిక జనాభా వల్ల ఆర్థిక వృద్ధి మందగించి, నిరుద్యోగం పెరిగి, వనరులపై విపరీతమైన ఒత్తిడి పెరిగి, పర్యావరణ కాలుష్యం ఏర్పడి, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి మౌలిక సదుపాయాలపైభారం పడిఆర్థిక వ్యవస్థ "డెడ్ ఎకానమీ"గా మారే అవకాశం ఉంది.

అధిక యువ జనాభా భారత ఆర్థిక వ్యవస్థకు వరం

జనాభాలో యువజన సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాలు బాగా లబ్ధి పొందుతాయి. పపంచంలో అధిక యువ జనాభా కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి, 2024లో దాదాపు 65 శాతం భారతీయ జనాభా 35 ఏళ్లలోపు వారే. ప్రపంచ వ్యాప్తంగా పనిచేసే వయస్సు కలిగిన కార్మిక జనాభా తగ్గుతుండగా, పనిచేయని జనాభా పెరుగుతోంది. శ్రామికశక్తి జనాభా తగ్గుతున్నప్పటికీ, సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి కారణంగా యూరప్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందింది. జపాన్, కొరియాలో వృద్ధుల జనాభా ఆందోళన కలిగిస్తోంది. సామాజిక భదత్ర, వైద్య సేవలు సవాలుగా మారాయి. అమెరికా, యూరోపియన్ శ్రామిక-వయస్సు జనాభా గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. 2040 నాటికి యువ జనాభా కనీస స్థాయికి చేరుకుని శ్రామిక సంక్షోభం తలెత్తుతుందని అంచనా. తక్కువ శ్రామికశక్తి జనాభా కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి భవిష్యత్తులో తగ్గేఅవకాశాన్ని సూచిస్తుంది. సాంకేతిక పురోగతి ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తున్నాయి. ఆర్థిక వృద్ధిని నిలబెట్టుకోవాలంటే, జనన రేటు పెద్దమొత్తంలో పెరగాలి లేదా ఉత్పాదకత పెరుగుతూనేఉండాలని చాలా మంది భావిస్తున్నారు. సాంకేతిక ఆవిష్కరణల కారణంగా ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశంఉన్నప్పటికీ, సంబంధిత నైపుణ్యాలలో శిక్షణ పొందిన వారికి లబ్ధి చేకూరుతుంది.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరణ లక్ష్యం

భారతదేశం 2047లో తన స్వాతంత్య్ర శత వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న సందర్భంలో, "వికసిత భారత్" లక్ష్యం దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేవలం లక్ష్యం మాత్రమే కాదు, ఇది ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు ప్రజల ఆశయాల్లో భాగం అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సంకల్పాన్ని ప్రాతించారు. అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందేందుకు భారతదేశం పౌర ఆదాయం, మౌలిక వసతులు, విద్యా, ఆరోగ్య సేవలు, లైంగిక సమానత్వం, పర్యావరణ స్థిరత్వం, సమర్థ ప్రభుత్వ వ్యవస్థలు సాధించాల్సి ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో భారత్ డిజిటల్ వేదికలు, అంతరిక్ష పరిశోధన, ఆర్థిక వ్యవస్థలో డిజిటలీకరణ, ఉత్పాదన రంగాల్లో పురోగతి సాధించినా, వ్యక్తిగత ఆదాయం, అక్షరాస్యత రేటు, ఆరోగ్య సేవలు వగైరా అంశాల్లో ఇంకా వెనకబడి ఉంది.

భారత ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాలు:

భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం, ఇంధన స్వాతంత్య్రం కలిగి ఉండడం డిజిటల్ రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించడం, ఉత్పత్తి, సేవల రంగాల్లో అంతర్జాతీయ పోటీతత్వం ప్రదర్శించండం. అయితే, ఈ లక్ష్యాలను నిజంగా అభివృద్ధిగా మార్చాలంటే, ఎన్నో విషయాల్లో పురోగతి చెందాలి.

1. విద్య, నైపుణ్య అభివృద్ధి, జాతీయ విద్యావిధానం 2020 కింద విద్యను జ్ఞానాధారిత, పరిశోధన ఆధారితంగా తీర్చిదిద్దాలి.

2. ఆరోగ్య సదుపాయాలు వైద్యవ్యయాన్ని తగ్గించి, ప్రజారోగ్యాన్ని రంగాన్ని బలోపేతం చేయాలి.

3.న్యాయ, పరిపాలనా సంస్కరణలు సత్వరమే అమల్లోకి రావాలి.

4. సమగ్ర అభివృద్ధి చట్టంలో దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలు అందరూ భాగస్వామ్యం కావాలి.

5. పర్యావరణ స్థిరత్వం సాధించేందుకు గ్రీన్ ఎనర్జీ, సుస్థిర వ్యవసాయ విధానాల్లో పెట్టుబడుల ప్రవాహం సాధించాలి.

భారతదేశ జనాభాలో యువత 65 శాతం పైగా ఉన్నందున ఆ మేరకు విధివిధానాలు, కార్యాచరణ ఉండాలి. అలా సమష్టిగా పనిచేసేదృక్పథం ఉంటే, 2047 నాటికి భారత్ నిజమైన అభివృద్ధి చెందిన, సమానతా ప్రతినిధిగా నిలుస్తుంది.

భారతదేశ సుస్థిర అభివృద్ధిలో కీలకమైన అంశాలు

ఏ దేశ అభివృద్ధి అయినా సుదీర్ఘ ప్రస్థానం కలిగి ఉంటుంది. దేశ శాశ్వత అభివృద్ధికి మూడు ప్రధాన మూల స్తంభాలు విద్య, ఆరోగ్యం, న్యాయవ్యవస్థ అని మనం మరిచిపోకూడదు. ఈ మూడింటి ప్రగతి అనేది సామాజిక శ్రేయస్సుకు, ఆర్థిక బలానికి, సమగ్ర వికాసానికి దోహదపడుతుంది.

ఉన్నత విద్య, ఆరోగ్యం, న్యాయ వ్యవస్థ

జాతీయ విద్యా విధానం భారతదేశ విద్యావ్యవస్థలో మైలురాయిగా నిలిచింది. ఇది సమగ్ర, సమకాలీన విద్యను అందించడంతో పాటు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి దోహదపడుతుంది. అయితే, నగరాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో విద్య ప్రమాణాలు, నైపుణ్యాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. మరో వైపు ఆరోగ్యరంగంలో ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు ఇంకా అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకోలేకపోవడంతో పేదలకు న్యాయం జరగడం లేదు. అత్యధిక వ్యక్తిగత ఖర్చుల కారణంగా ఆరోగ్య సేవలు అందించడంలో అసమర్థత కనిపిస్తోంది. దీర్ఘకాలిక ఆర్థిక భారం ప్రజలపై ప్రభావం చూపుతోంది. అనారోగ్యంతో జీవితం వెళ్లిబుచ్చడం ఈ దేశంలో అనివార్యంగా ఉంటూ వస్తోంది. పెండింగ్ కేసులు న్యాయవ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. సామాజిక న్యాయం, సత్వర న్యాయం అందని ద్రాక్షగా మారాయి. ప్రజలకు రానురాను న్యాయవ్యవస్థపై నమ్మకం సడలిపోతోంది. అందువల్ల, వేగవంతమైన, పారదర్శక న్యాయవ్యవస్థ ఎంతైనా అవసరం.

మహిళల విద్య, ఉపాధిపై దృష్టి

మహిళా సాధికారత దేశ అభివృద్ధికి ప్రధాన శక్తి. మనదేశంలో మహిళలు శ్రామికశక్తిలో భాగస్వాములు కావడం చాలా తక్కువగా 25 శాతానికే పరిమితమైంది. ఇది ప్రపంచ సగటు కన్నా తక్కువ. మహిళలకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు అందించడం వల్ల, వారు ఆర్థిక స్వావలంబనతో పాటు సమాజంలో సామాన స్థాయికి వెళ్లగలుగుతారు. "బేటీబచావో, బేటీపడావో" వంటి పథకాల ఉద్దేశం గొప్పదైనా అవి సమర్ధవంతంగా అమలు కావడం లేదు. మహిళలకు భదత్ర, సమాన వేతనం, పని సౌకర్యాలు లభించకపోవడం ఉపాధి అవకాశాలను తగ్గిస్తుంది. వీటిని పరిష్కరించినప్పుడు మాత్రమే మహిళల కృషి దేశ ఆర్ధికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.

అధిక వడ్డీరేట్లు...అప్పుల భారం

ద్రవ్యోల్బణం నియంతణ్ర కోసం వడ్డీ రేట్ల పెరుగుదల అవసరం అయినప్పటికీ, ఇది పేదలు, మధ్యతరగతి కుటుంబాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అధిక వడ్డీ రేట్ల వల్ల అప్పులు తిరిగి చెల్లించడం కష్టమవుతుంది, తద్వారా వ్యాపారాలు, వినియోగం తగ్గుముఖం పట్టి ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ఈ పరిస్థితికి పరిష్కారం సూక్ష్మ రుణాల ప్రోత్సాహకాలు. సులభమైన బ్యాంకింగ్, ఆపై సమర్థ ఆర్థిక విధానాల రూపకల్పన.

మూలధన సదుపాయం కొరత పెట్టుబడుల నష్టానికి సంకేతం

2025లో భారతదేశం నుండి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కి వెళ్లడం, భారతీయులు విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్న విషయం ఆర్థిక వాతావరణంపై అపనమ్మకం బట్టబయలు చేస్తుంది. పన్ను విధానాల్లో అస్థిరత, నియంత్రణలో అశద్ర్ధ, వ్యాపార సౌకర్యాలలో లోపాలు దీని కారణమవుతున్నాయి. పెట్టుబడులు మరలించేందుకు పారదర్శక, స్థిరమైన విధానాలు, వాణిజ్య సౌకర్యాలు అవసరం.

నిర్మాణాత్మక సంస్కరణల అవసరం

భారతదేశం సుస్థిర అభివృద్ధి సాధించడానికి నిర్మాణాత్మక సంస్కరణలు ఎంతైనా అవసరం. కూలీల చట్టాల సరళీకరణ, భూసంస్కరణలు, బ్యాంకింగ్ రంగంలో నాన్- పెర్ఫార్మింగ్ అసెట్స్ క్లీన్-అప్, పచ్చదనం, డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు అనే సంస్కరణలు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. ఈ మార్పులతో మాత్రమే భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ నాయకత్వ స్థానాన్ని సొంతం చేసుకొనే మార్గం సుగమం అవుతుంది.

సారాంశం..

భారతదేశ అభివృద్ధికి సర్వోన్నతమైన విద్య, ఆరోగ్య, న్యాయ వ్యవస్థలు, సమగ్ర జనాభా నియంతణ్ర, మహిళల సాధికారత, ఆర్థికభారం తగ్గింపు, పెట్టుబడుల ఆకర్షణ, నిర్మాణాత్మక సంస్కరణలు తప్పనిసరి. ఈ అంశాల్లో సమన్వయం సాధిస్తూ సమర్థపాలన సాగినపుడే దేశం సుస్థిర అభివృద్ధి సాధించి, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి ఎగబాకుతుంది.

నిమ్మగడ్డ లలిత ప్రసాద్

బ్రహ్మయ్య అండ్ కో

విజయవాడ

+91 92464 71122

Updated Date - Sep 27 , 2025 | 01:59 PM