Home » Economy
దశాబ్దం క్రితం వరకు పేదరికం, నిరుద్యోగం, ఆహార సంక్షోభం వగైరా సమస్యలకు దారితీస్తోందనే సాకుతో జనాభా పెరుగుదల (జనాభావిస్ఫోటం)పై ఆందోళనలుండేవి. ఇటీవల అంతకంతకు పెరుగుతున్న జనాభాను మానవవనరులుగా పరిగణించే సానుకూల భావన ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇద్దరు వద్దు... ఒక బిడ్డే ముద్దు అనే నినాదాలకు చెల్లుచీటీ రాస్తూ ఆ మధ్య ప్రధాన మంత్రి నరేంద్రమోదీ , ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ పిలుపునివ్వడం తెలిసిందే.
గణేష్ చతుర్థి అంటే కేవలం భక్తి, సంతోషాల పండుగ మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఓ అద్భుతమైన ఉత్సవమని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) తెలిపింది. ఈ పండుగ ద్వారా ఈ ఏడాది వేల కోట్ల వ్యాపారం జరిగినట్లు చెప్పింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల ఆదాయం 6 నుంచి 7 శాతం పెరగబోతోందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తాజా రిపోర్ట్ చెబుతోంది. ఇందుకు కారణం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST)రేట్ల తగ్గింపు. దీంతోపాటు ఈ నివేదికలో కీలక విషయాలను ప్రస్తావించింది. అవేంటో ఇక్కడ చూద్దాం.
భారత ఆర్థిక వ్యవస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో క్యూ1 అంచనాల ను మించి 7.8% వృద్ధి రేటును నమోదు చేసింది. తొలి త్రైమాసికానికి ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించిన అంచనా 6.5% కన్నా ఇది చాలా అధికం..
భారత ఆర్థిక వ్యవస్థ గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. 2038 నాటికి మన భారత్, కొనుగోలు శక్తి సమానత్వం (PPP) పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందట. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉందని, ఫోరెక్స్ నిల్వలు చాలా పటిష్టంగా ఉన్నాయని ప్రధాని చెప్పారు. అంతేకాకుండా ప్రతి నెలా లక్షలాది మంది దేశీయ పెట్టుబడిదారులు వందల కోట్ల రూపాయలు ఎస్ఐపీ ద్వారా మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారని మోదీ తెలియజేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న విధానాలు దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా వాణిజ్య సుంకాల విషయంలో ఆయన తీసుకున్న విధానాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. తాజాగా, ప్రఖ్యాత ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీవ్ హ్యాంకే ట్రంప్ నిర్ణయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నారనే సాకుతో ట్రంప్ అమెరికాపై 50 శాతం సుంకం విధించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న అగ్రరాజ్యానికి ప్రతీకార సుంకాలతోనే బదులు ఇవ్వాలని సూచించారు.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను బ్రిటన్‌లో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి తిప్పికొట్టారు. ఏ దేశం కోసం మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానమిచ్చారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం..జూలై 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా....