PM Modi: త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. ప్రధాని మోదీ
ABN , Publish Date - Aug 23 , 2025 | 09:45 PM
కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉందని, ఫోరెక్స్ నిల్వలు చాలా పటిష్టంగా ఉన్నాయని ప్రధాని చెప్పారు. అంతేకాకుండా ప్రతి నెలా లక్షలాది మంది దేశీయ పెట్టుబడిదారులు వందల కోట్ల రూపాయలు ఎస్ఐపీ ద్వారా మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారని మోదీ తెలియజేశారు.
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలు కురిపించారు. గత పదేళ్లుగా స్థూల ఆర్థిక స్థిరత్వం (Macroeconomic stability) వల్లే ఈ విజయం సాధ్యమైందని అన్నారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుందని తెలిపారు.
'ఈరోజు ప్రపంచంలోనే అతివేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. త్వరలోనే మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది. ప్రపంచ వృద్ధిలో ఇండియా వృద్ధి 20 శాతానికి త్వరలోనే చేరనుందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ సాధిస్తున్న ఈ వృద్ధి వెనుక గత శతాబ్ద కాలంగా ఇండియా స్థూల ఆర్థిక స్థిరత్వంతో ఉండటమే కారణం' అని ప్రధాని ఢిల్లీలో శనివారంనాడు జరిగిన ది ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో పేర్కొన్నారు.
భారతదేశ ద్రవ్యలోటు 4.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నామని, కోవిడ్ వంటి సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా ఈ పరిణామం చూస్తు్న్నామని అన్నారు. ఈరోజు మన కంపెనీలు క్యాపిటల్ మార్కెట్ నుంచి రికార్డు స్థాయిలో నిధులు రైజింగ్ చేస్తు్న్నాయని అన్నారు. మన బ్యాంకులు గతంలో కంటే చాలా పటిష్టంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉందని, వడ్డీరేట్లు తగ్గాయని మోదీ అన్నారు.
కరెంట్ ఖాతా లోటు అదుపులో ఉందని, ఫోరెక్స్ నిల్వలు చాలా పటిష్టంగా ఉన్నాయని ప్రధాని చెప్పారు. అంతేకాకుండా ప్రతి నెలా లక్షలాది మంది దేశీయ పెట్టుబడిదారులు వందల కోట్ల రూపాయలు ఎస్ఐపీ ద్వారా మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారని మోదీ తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
బిల్లు నుంచి తనను మినహాయించేందుకు ఒప్పుకోని మోదీ
అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్
For More National News And Telugu News