ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Devotional: ఆ రాశి వారు ఈ వారం రుణవిముక్తులవుతారు..

ABN, Publish Date - Dec 21 , 2025 | 07:45 AM

ఆ రాశి వారు ఈ వారం రుణవిముక్తులవుతారు.. అని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే.. గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగు వేయడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే.. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయని, పెద్దలు ఆశీస్సులందిస్తారని తెలుపుతున్నారు.

అనుగ్రహం

21 - 27 డిసెంబర్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగు వేయండి. సంప్రదింపులు వాయిదా పడతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఓర్పుతో యత్నాలు సాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. గృహంలో మార్పుచేర్పులు అనివార్యం. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు. పందాలు, జూదాల జోలికిపోవద్దు.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టించినా ఫలితం శూన్యం. మీ కష్టం వేరొక రికి కలిసివస్తుంది. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ నుంచి విషయ ేసకరణకు కొందరు యత్ని స్తారు. ఆరోగ్యం మందగిస్తుంది.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

సర్వత్రా అనుకూలం. పరిస్థి తులు చక్కబడతాయి. రుణవిముక్తులవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. కొందరి రాక చికాకుపరుస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆత్మీయులతో కాల క్షేపం చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడ తాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు.

కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

వ్యవహార పరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. లావాదేవీలు మీ సమక్షంలో సాగుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పరిచ యాలు బలపడతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మిమ్ములను తప్పు దారి పట్టించేందుకు కొందరు యత్నిస్తారు. ప్రలోభాలకు లొంగ వద్దు. ఒక సంఘటన పట్టుదల రేకెత్తిస్తుంది. మొండిగా ముందుకు సాగుతారు.

సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దలు ఆశీస్సులందిస్తారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టు వదిలేయండి. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బల పడతాయి. అపరిచితులతో జాగ్రత్త.

కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

ఆశలొదిలేసుకున్న ధనం అం దుతుంది. అవసరాలు నెరవేరుతాయి. కొత్త పనులు చేపడతారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. ఎదుటివారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు. అవతలివారి స్తోమతను స్వయంగా తెలుసుకోండి. పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు. ప్రయాణంలో అపరిచితులతో జాగ్రత్త.

తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

కార్యసాధనకు ఓర్పు ప్రధా నం. ఆశావహదృక్పథంతో మెలగండి. ఎవరినీ నిందించవద్దు. మీ పొరపాట్లు సరిదిద్దుకోండి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆత్మీయు లతో కాలక్షేపం చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు, బాధ్యతలుస్వయంగా చూసుకోండి. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

ప్రతికూలతలు అధికం. కార్య సాధనకు మరింత శ్రమించాలి. తలచింది ఒకటైతే మరొకటి జరుగుతుంది. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. చిన్న విష యానికే ఆందోళన చెందుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆశావహదృక్పథంతో శ్రమించండి. ఏ విష యాన్నీ సమస్యగా భావించవద్దు. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. ఆర్బాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

లావాదేవీల్లో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాలుతగవు. కొంతమొత్తం ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఒక సమా చారం ఆలోచింపచేస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.పుణ్యకార్యంలో పాల్గొంటారు.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

కొత్తయత్నాలకు శ్రీకారం చుడ తారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుం టుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

అనుకున్న కార్యం సఫలమవు తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి ధనం అందు తుంది. బంధుమిత్రులతో సంభాషిస్తుంటారు. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. మీ అల క్ష్యం ఇబ్బందులకు దారిస్తుంది. సన్నిహితుల సాయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు.

మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

నిర్విరామంగా శ్రమిస్తారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పెట్టుబడులపై దృష్టిపెడతారు. ప్రైవేట్‌ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. అవతలి వారి స్థితిగతులను స్వయంగా తెలుసుకోండి. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలపై ఆధారపడవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు

చిరిగిన జీన్స్‌.. స్లీవ్‌లెస్ పై నిషేధం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2025 | 07:45 AM