Lucky Zodiac Signs: సూపర్.. ఈ రాశులకు రాజయోగం.. ఎన్ని రోజులంటే..
ABN, Publish Date - Nov 08 , 2025 | 04:02 PM
కొన్ని రాశులకు రాజయోగం పట్టనుంది. ఇది కొన్ని రోజులపాటు ఉండనుంది. ఈ యోగంతో ఈ రాశుల వారు ఉన్నత స్థాయిని అందుకుంటారు.
జాతకంలో ఎన్ని దోషాలున్నా.. తొమ్మిదో స్థానాధిపతి బలంగా ఉంటే రాజయోగం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం కొన్ని రాశులకు ఆ రాజయోగం పట్టనుంది. ఆ జాబితాలో ఆరు రాశులు.. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, తుల, మకరం ఉన్నాయి. ఈ రాశుల వారిని అదృష్ట దేవత అనేక విధాలుగా కరుణించనుంది. దీంతో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాభం, వాహన యోగం కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. ఈ రాశుల వారిని మరో నెల రోజుల పాటు అదృష్ట దేవత అన్ని విధాల కరుణించబోతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది.
మేషం..
ఈ రాశి వారికి భాగ్యాధిపతి గురువు. ప్రస్తుతం ఆయన చతుర్థ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు. అందువల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, వృత్తి, వ్యాపారాలు బిజీ బిజీగా సాగుతాయి. అలాగే ఈ సమయంలో ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. వీరికి లక్ష్మీకటాక్షం బాగా ఉంది. గృహ, వాహన యోగాలు అనుకూలిస్తాయి. జీవనశైలి మారుతోంది. అలాగే వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.
వృషభం..
ఈ రాశికి భాగ్య స్థానాధిపతి శనీ. ఆయన లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అందువల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వ్యక్తిగత జీవితంలో పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో దశ తిరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తండ్రి నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
కర్కాటకం..
ఈ రాశికి భాగ్యధిపతి గురువు. ప్రస్తుతం ఈ రాశిలో ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నారు. అందువల్ల రాజయోగం పడుతుంది. ఉద్యోగులకే కాదు.. నిరుద్యోగులకు సైతం విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పిత్రార్జితం అందుకుంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది.
సింహం..
ఈ రాశికి భాగ్యస్థానాధిపతి కుజుడు. ప్రస్తుతం ఆయన చతుర్థ స్థానంలో సొంత రాశి వృశ్చికంలో సంచరిస్తున్నాడు. అందువల్ల గృహ, వాహన యోగం పడుతుంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. గతంలో అనుకున్న కోరికలు నెరవేరతాయి. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది.
తుల..
ఈ రాశికి భాగ్యాధిపతి బుధుడు. ధన స్థానంలో ఆయన సంచరిస్తున్నాడు. అందువల్ల ఈ రాశి వారికి మరో రెండు నెలల పాటు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇది ఈ రాశి వారికి ఊహించని అదృష్టాన్ని కలిగిస్తుంది. ఆ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఊహించనంతగా మెరుగు పడుతుంది. ఇంకా చెప్పాలంటే పట్టిందల్లా బంగారమవుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కనక వర్షం కురుస్తుంది.
మకరం..
ఈ రాశి వారికి భాగ్య స్థానాధిపతి బుధుడు. ప్రస్తుతం ఆయన లాభ స్థానంలో సంచారిస్తున్నారు. అందువల్ల మరో రెండు నెలల పాటు వీరు ఆర్థికంగా ఉన్నత స్థితిలో కొనసాగుతారు. ఆదాయ వృద్థితోపాటు అధికార యోగం సైతం కలుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా మటుమాయం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో విదేశీయానం చేసే అవకాశం ఉంది. ఆదాయం సైతం అంచనాలకు మించి అందుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More Devotional News And Telugu News
Updated Date - Nov 08 , 2025 | 04:04 PM