Hyderabad: శరవేగంగా ఖైరతాబాద్ గణపతి పనులు
ABN, Publish Date - Aug 15 , 2025 | 10:55 AM
గణపతి ఉత్సవాలకు మరో 15 రోజులు మాత్రమే ఉండడంతో ఖైరతాబాద్ భారీ గణపతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గణపతి ఫినిషింగ్ పనులు జరుగుతుండగా అవి పూర్తి కాగానే ఆర్టిస్టులు రంగులద్దే పనులు ప్రారంభించనున్నారు.
ఖైరతాబాద్(హైదరాబాద్): గణపతి ఉత్సవాలకు మరో 15 రోజులు మాత్రమే ఉండడంతో ఖైరతాబాద్(Khairatabad) భారీ గణపతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గణపతి ఫినిషింగ్ పనులు జరుగుతుండగా అవి పూర్తి కాగానే ఆర్టిస్టులు రంగులద్దే పనులు ప్రారంభించనున్నారు. ఈసారి ఖైరతాబాద్ గణపయ్య శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తుల కుదర్శనమివ్వనున్నాడు.
69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా రూపుదిద్దుకుంటున్నాడు. గణపయ్యకు ఇరువైపులా ఉండేలా పూరి జగన్నాథుడు సుభద్ర, బలరాముడి సహా లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి, ఖైరతాబాద్ గ్రామ దేవతగా పిలువబడే గజ్జెలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దుతున్నారు. అయితే, ఇప్పటికే పెద్ద ఎత్తున సందర్శకులు వస్తూ సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంగణం ఓ మంచి సెల్ఫీస్పాట్‌గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!
Read Latest Telangana News and National News
Updated Date - Aug 15 , 2025 | 10:55 AM