Karthika Pournami: కార్తీక పౌర్ణమి నుంచి ఈ రాశులకు గజకేసరి యోగం..
ABN, Publish Date - Nov 03 , 2025 | 07:29 PM
కార్తీక పౌర్ణమి వేళ.. కొన్ని రాశులకు గజకేసరి యోగం ఏర్పడుంది. దీంతో ఈ రాశుల వారికి కష్టాలు తీరి.. సుఖ సంతోషాలతో ఉంటారు.
ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీన వచ్చింది. ఈ రోజు చంద్రుడు, ఉచ్చ స్థితిలో గురువు ఉండడం వల్ల కొన్ని రాశులకు రాజ యోగం పట్టనుంది. అది కూడా అలా ఇలా కాదు. ఆ యా రాశుల వారికి గజకేసరి యోగం పట్టనుంది. ఆ జాబితాలో .. మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులకు శుభ దశ, ధన యోగం కలగనుంది. దీంతో ఈ రాశుల వారికి పలు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా.. ఈ కార్తీక పౌర్ణమి వేళ.. శివార్చనతో మరింత శుభ యోగం వీరికి కలగనుందని పండితులు చెబుతున్నారు.
మేషం..
ఈ రాశిలో పౌర్ణమి ఏర్పడడంతోపాటు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న గురువుతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని వల్ల ఈ రోజు వీరు శివార్చన చేయడం వల్ల మరింత శుభయోగాన్ని అందుకోనున్నారు. వీరు మనస్సులోని కోరికలు చాలా వరకు ఈ వేళ.. నెరవేరతాయి. ఉన్నత పదవులు అందుకుంటారు. ఏ రంగంలో ఉన్నా.. రాజయోగం, ధన యోగం కలుగుతుంది. జఠిల సమస్యల నుంచి సైతం వీరు విముక్తి పొందుతారు.
మిథునం..
ఈ రాశి వారికి లాభ స్థానంలో పూర్ణ చంద్రుడి సంచారం చేస్తున్నాడు. గురువుతో గజకేసరి ఏర్పడడం వల్ల పౌర్ణమి వేళ.. శివార్చనతోపాటు మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల ధన, ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. అతి త్వరలో సొంత ఇంటి కలతోపాటు విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆశలు సైతం వీరికి నెరవేరనున్నాయి. అన్ని మార్గాల్లో ఆదాయం వస్తుంది. రాదనుకున్న సొమ్ము సైతం పూర్తిగా చేతికి అందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయట పడి ఊపిరి పీల్చుకుంటారు.
కర్కాటకం..
కార్తీక పౌర్ణమి వేళ.. రాశ్యాధిపతి చంద్రుడు దశమంలో బలపడుతున్నాడు. దీంతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ రాశి వారు పరమ శివునితోపాటు గణపతిని పూజించడం వల్ల ఉద్యోగంలో ఉన్నత స్థితిని అందుకుంటారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆదాయానికి లోటు మాత్రం ఉండదు. వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందుతారు.
తులా రాశి..
పౌర్ణమి వేళ సప్తమ స్థానంలో చంద్రుడికి బలం పెరుగుతుంది. అలాగే దశమ స్థానంలో ఉన్న గురువుతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. అందువల్ల ఈ రాశి వారు పరమేశ్వరుడిని పూజించడంతోపాటు కుబేర స్తోత్రాన్ని కూడా పఠించడం వల్ల మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి మహాభాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు వీరికి బాగా కలిసి వస్తాయి.
మకర రాశి..
ఈ పౌర్ణమి వేళ.. ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో చంద్రుడికి బలం పెరుగుతుంది. ఉచ్చ స్థానంలో గురువు కారణంగా.. గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారు శివార్చనతోపాటు విష్ణు సహస్ర నామాలు పఠించడం వల్ల మంచి జరుగుతుంది. దీని వల్ల ఈ రాశి వారికి కళ్యాణ యోగం, సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో అత్యంత సంపన్నులు అవుతారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం.. వివాహం కావడం జరుగుతుంది.
మీనరాశి..
ఈ రాశికి ధన స్థానంలో చంద్రుడు బలోపేతమవుతున్నాడు. ఈ రాశ్యధిపతి గురువుతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. అందువల్ల ఈ రాశి వారు మహాశివునికి అభిషేకంతోపాటు శ్రీసుబ్రహ్మణ్యాష్టకం పఠించడం చాలా మంచిది. ఈ రాశి వారికి అపర కుబేర యోగంతోపాటు సత్సంతాన యోగం కలుగుతుంది. ఆదాయం అంచనాలను మించుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు సైతం వీరికి దూరంగా జరుగుతాయి.
గమనిక: ఈ కథనంలో తెలిపిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం అవగాహన కోసమే. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధం లేదు.
ఈ వార్తలు కూడ చదవండి..
కార్తీక పౌర్ణమి.. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
ఈ వస్తువులను దానం చేస్తే.. అమ్మవారి అనుగ్రహం..
For More Devotional News And Telugu News
Updated Date - Nov 03 , 2025 | 07:32 PM