Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:49 PM
ప్రతి పౌర్ణమి వేళ.. గిరి ప్రదక్షణ కోసం తమిళనాడులోని అరుణాచలానికి దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. అయితే కార్తీక మాసం అంటేనే మహాశివుడికి అత్యంత ప్రీతికరం. ఈ మాసంలో అది కూడా కార్తీక పౌర్ణమికి అరుణాచలానికి భక్తులు భారీగా తరలి వెళ్తారు.
హైదరాబాద్, నవంబర్ 02: ప్రతి పౌర్ణమి వేళ.. గిరి ప్రదక్షణ కోసం తమిళనాడులోని అరుణాచలానికి దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. అయితే కార్తీక మాసం అంటేనే మహాశివుడికి అత్యంత ప్రీతికరం. ఈ మాసంలో అది కూడా కార్తీక పౌర్ణమికి అరుణాచలానికి భక్తులు భారీగా తరలి వెళ్తారు. ఆ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు, పర్యాటకులు అరుణాచలానికి బయలుదేరి వెళ్లనున్నారు. కానీ హైదరాబాద్ నుంచి నేరుగా అరుణాచలం వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యాలు లేవన్న సంగతి అందరికి తెలిసిందే. దాంతో అరుణాచలం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5వ తేదీ కార్తీక పౌర్ణమి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.
హైదరాబాద్‌లోని దిల్‌షుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, వనస్థలి పురం నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించింది. అందులో భాగంగా ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం సైతం అందుబాటులోకి తీసుకు వచ్చామని పేర్కొంది. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు అరుణాచలం గిరి ప్రదక్షణకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ వస్తువులను దానం చేస్తే.. అమ్మవారి అనుగ్రహం..
నవంబర్ మూడో వారం చివరి నుంచి ఈ రాశులకు అదృష్ట యోగం
For More Devotional News And Telugu News