Ananrhapuram News: ప్రియురాలు మోసగించిందని.. యువకుడి ఆత్మహత్య
ABN, Publish Date - Nov 29 , 2025 | 02:01 PM
ప్రేమ వ్యవహారానికి ఓ యువకుడు బలైన సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలంలో జరిగింది. రాజు అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే.. ఆమె మోసం చేసిందంటూ.. అతను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి కుటుబంలో విషాదం నెలకొంది.
మడకశిర(అనంతపురం): ప్రేమించిన అమ్మాయి మోసగించిందని మడకశిర(Madakashira) మండలం హరేసముద్రం గ్రామానికి చెందిన రాజు(24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు, తిరుపతి ఎస్వీ యూనివర్సీటి(Tirupati SV University)లో రాజు పీజీ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె మోసగించిందని బాధపడేవాడు. ఈ క్రమంలో గురువారం తిరుపతి నుంచి స్వగ్రామానికి వచ్చాడు.
తన ప్రియురాలు మోసగించినందుకే బలవన్మరణానికి పాల్పడుతున్నానని సూసైడ్ నోట్ రాసిపెట్టి, శుక్రవారం తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించేలోగా ప్రాణాలను కోల్పోయాడు. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి రామచంద్రప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 29 , 2025 | 02:01 PM