ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Wife Eliminated Husband: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య

ABN, Publish Date - Oct 11 , 2025 | 04:16 PM

ప్రియుడి మోజులో పడి పచ్చని సంసారాన్ని నిట్టనిలువునా కాల్చుకుంటున్నారు కొందరు మహిళలు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో తాజాగా సంచలనం రేపుతోంది.

ఆంధ్రప్రదేశ్, అక్టోబర్ 11: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యలు పెరిగిపోతున్నాయి. పెళ్లై పిల్లలున్నా ఇతరుల మోజులో పడి పచ్చని సంసారాన్ని నిట్టనిలువునా కాల్చుకుంటున్నారు. అయితే, కొందరు మహిళలు తాళి కట్టిన భర్తనే కడతేర్చుతుండడం సంచలనంగా మారుతోంది. అంతేకాక కన్న బిడ్డలను సైతం చంపేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే వివాహేతర సంబంధాల కారణంగా అనేక సంఘటనలు జరగ్గా.. తాజాగా చిత్తూరు జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తన భర్తను ఓ మహిళ దారుణంగా చంపేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏపీ(Andhra Pradesh)లోని చిత్తూరు దుర్గమ్మ గుడి వీధిలో అక్టోబరు 6వ తేదీన బి.వెంకటేశ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంకటేశ్ రెండో భార్య తులసి మునియమ్మ అలియాస్ కావ్య(22)పై పోలీసులకు అనుమాన వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. కావ్యకు సురేశ్(23)అనే వ్యక్తితో వివాహేతర సంబంధం(Illegal Affaire) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వెంకటేశ్ తో పెళ్లైన కొన్నాళ్లే సురేశ్ తో కావ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. వీరి గురించి తెలిసిన కావ్య భర్త.. ఆమెను నిలదీశాడు. దీంతో తమ సుఖానికి భర్త అడువస్తున్నాడని ప్రియుడు సురేశ్ తో కలిసి వెంకటేశ్ ను చంపేందుకు ప్లాన్ వేసింది. అక్టోబర్ 6వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వెంకటేశ్ ను తాడుతో గొంతు నులిమి కావ్య, సురేశ్ చంపేశారు. అనంతరం వారిపై ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు.. వెంకటేశ్ ను తాడుతో వేలాడదీసి.. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే తర్వాత విచారణలో అది హత్య అని తేలగా దర్యాప్తు వేగవంతం చేశారు. చివరికి కావ్య, సురేశ్ కలిసి వెంకటేశ్‌ని చంపినట్లు పోలీసులు (AP Police) నిర్ధారించారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు తరలించారు. క్షణికావేశంలో చేసే ఇలాంటి తప్పులు అనేక జీవితాలను, పలు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇలాంటి ఎన్నో హత్య కేసుల్లో ముద్దాయిలు దొరికిపోతున్నా.. భర్తలను హత్య చేసేందుకు కొందరు కసాయి మహిళలు వెనుకాడటం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్‌ మరిచారు

భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త

Updated Date - Oct 11 , 2025 | 05:56 PM