విషాదం.. పెళ్లైన రెండు రోజులకే వరుడు మృతి..
ABN, Publish Date - Aug 12 , 2025 | 08:00 AM
ఎంతో ఆనందంగా, అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఓ యువకుడు (వరుడు).. రెండురోజులకే మృతి చెందాడు. దాంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బడంగ్‌పేట్ కార్పొరేషన్ 30వ డివిజన్‌లోని లక్ష్మీదుర్గ కాలనీకి చెందిన కాశ పుల్లప్ప కుమారుడు సాయిఅనిల్‌కుమార్(25) వివాహం కర్నూల్‌కు చెందిన యువతితో గురువారం అర్ధరాత్రి జిల్లెలగూడలో జరిగింది.
హైదరాబాద్: ఎంతో ఆనందంగా, అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఓ యువకుడు (వరుడు).. రెండురోజులకే మృతి చెందాడు. దాంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బడంగ్‌పేట్ కార్పొరేషన్ 30వ డివిజన్‌లోని లక్ష్మీదుర్గ కాలనీకి చెందిన కాశ పుల్లప్ప కుమారుడు సాయిఅనిల్‌కుమార్(25) వివాహం కర్నూల్‌కు చెందిన యువతితో గురువారం అర్ధరాత్రి జిల్లెలగూడలో జరిగింది.
శుక్రవారం తెల్లవారు జామున వధువుతో కలిసి ఇంటికి చేరుకున్న అనిల్ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఆదివారం మధ్యాహ్నం బడంగ్‌పేట్(Badangpet) శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా వరుడి మృతితో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అనిల్ మరణం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే సబితారెడ్డి సోమవారం సాయంత్రం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..
చట్టాలు తెలుసుకుని అమెరికా రండి
Read Latest Telangana News and National News
Updated Date - Aug 12 , 2025 | 08:00 AM