ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: మత్తు ఇంజక్షన్‌ వేసుకుంటూ.. డ్రోన్‌కు చిక్కారు

ABN, Publish Date - Jul 24 , 2025 | 01:49 PM

చెట్ల పొదల్లో మనల్ని ఎవరు చూస్తారులే అనుకున్నారు. మత్తు ఇంజక్షన్లు వేసుకుంటూ.. మత్తులో మునిగి తేలుతున్నారు. ఇలా తిరుపతి రూరల్‌ మండలం లింగేశ్వరనగర్‌లో బుధవారం మత్తు ఇంజక్షన్లు వాడుతున్న నలుగురు యువకులను డ్రోన్‌ కెమెరాతో నిఘా వుంచి పోలీసులు పట్టుకున్నారు.

- డ్రోన్‌కు చిక్కిన నలుగురు యువకులు

- కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లితండ్రులకు అప్పగించిన పోలీసులు

తిరుపతి: చెట్ల పొదల్లో మనల్ని ఎవరు చూస్తారులే అనుకున్నారు. మత్తు ఇంజక్షన్లు వేసుకుంటూ.. మత్తులో మునిగి తేలుతున్నారు. ఇలా తిరుపతి రూరల్‌(Tirupati Rural) మండలం లింగేశ్వరనగర్‌లో బుధవారం మత్తు ఇంజక్షన్లు వాడుతున్న నలుగురు యువకులను డ్రోన్‌ కెమెరాతో నిఘా వుంచి పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి వారిని పట్టుకునేందుకు రూరల్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ఉంచారు.

అలా నిఘా ఉంచిన డ్రోన్‌ కెమెరాకు.. లింగేశ్వరనగర్‌(Lingeshwara Nagar)లోని మారుమూల ప్రాంతంలో పొదల మధ్య మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటూ నలుగురు యువకులు చిక్కారు. ఎస్పీ నేతృత్వంలోని ఈగల్‌ టీమ్‌లు, డ్రోన్‌ కెమెరాల సిబ్బంది గుర్తించారు. వారిని పట్టుకుని తిరుపతి రూరల్‌ పోలీసులకు అప్పగించారు.

రూరల్‌ సీఐ చిన్నగోవిందు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. యుక్త వయస్సులో ఇలా చెడు అలవాట్లకు బానిసలుగా మారితే భవిష్యత్‌ మొత్తం సర్వ నాశనం అవుతుందని హితవు పలికారు. వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు. తల్లిదండ్రుల అనుమతితో వారిని వైద్యుల సూచనల మేరకు రీహాబిలటేషన్‌ కేంద్రానికి పంపి కౌన్సెలింగ్‌ ఇప్పిస్తామని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..

2 నెలల్లో ఓఆర్‌ఆర్‌ ఆర్థిక ప్రతిపాదనలు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2025 | 01:49 PM