Tirupati News: తిరుపతిలో గంజాయి బ్యాచ్ వీరంగం..
ABN, Publish Date - Nov 08 , 2025 | 10:25 AM
తిరుపతి లో గురువారం అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. సింగాలగుంటలో దాదాపు ఐదారు గంటల పాటు ఆరుగురు యువకులు, విద్యార్థులు హల్‌చల్ చేశారు. కనకభూషణ లేఅవుట్‌లో ఆరు కార్లు అద్దాలు ధ్వంసం చేశారు. పక్కనే వున్న విద్యుత్ శాఖ సబ్‌స్టేషన్ కార్యాలయ కిటికీ అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు.
- ఆరు కార్లు, విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ కార్యాలయ అద్దాలు ధ్వంసం
తిరుపతి: తిరుపతి(Tirupati)లో గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. సింగాలగుంటలో దాదాపు ఐదారు గంటల పాటు ఆరుగురు యువకులు, విద్యార్థులు హల్‌చల్ చేశారు. కనకభూషణ లేఅవుట్‌లో ఆరు కార్లు అద్దాలు ధ్వంసం చేశారు. పక్కనే వున్న విద్యుత్ శాఖ సబ్‌స్టేషన్ కార్యాలయ కిటికీ అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు. సబ్ స్టేషన్ నైట్ షిప్టు ఆపరేటర్ రేవంత్‌కుమార్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చెన్నారెడ్డి కాలనీకి చెందిన ప్రవీణ్, విఘ్నేష్, వేణు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు పదో తరగతి చదువుతున్నారు. మరొకరి వివరాలు తెలియదు. స్నేహితులైన వీరికి మూడు నెలల క్రితం కొంతమంది ప్రత్యర్థులతో గొడవ జరిగింది. దీంతో వారిని టార్గెట్‌గా చేసుకుని కొద్ది రోజులుగా వీరు కనకభూషణ లేఅవుట్‌లో మద్యం మత్తులో హల్‌చల్ చేస్తున్నారు. కొందరు స్థానికులు వీరిని మందలించారు. మళ్లీ గురువారం రాత్రి గంజాయి, మద్యం తాగి.. బీరు బాటిళ్లతో నడి రోడ్డుపై బీభత్సం సృష్టించారు.
సబ్‌స్టేషన్ కార్యాలయంపై దాడి చేసి తలుపులు, కిటికీల అద్దాలు పగలకొట్టారు. రోడ్లపై ఆపి వున్న ఆరు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. దీనిపై డయల్ 112కు కొందరు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ భక్తవత్సలం ఆదేశాల మేరకు ఎస్‌ఐలు లోకేషబాబు, అజిత, బ్లూకోల్స్ట్, రక్షక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం రెండు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 08 , 2025 | 10:25 AM