Hyderabad: ఉద్యోగం రాలేదని ఊపిరి తీసుకున్నాడు..
ABN, Publish Date - Mar 18 , 2025 | 08:25 AM
ఉద్యోగం రాలేదన్న బాధతో ఓ యువకుడు ఊపిరి తీసుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలోని గంధంగూడ శ్రీనివాస్‌నగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన విరాలిలా ఉన్నాయి.
నార్సింగ్(హైదరాబాద్): గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నా ఫలితం లేకపోవడంతో ఏపీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగ్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఏపీకి చెందిన మహేష్‌కుమార్ రెడ్డి (29) తన భార్యతో కలిసి గంధంగూడ శ్రీనివాస్‌నగర్ కాలనీ(Gandhamguda Srinivasnagar Colony)లో ఉంటున్నాడు. మహేష్ భార్య ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పెళ్లయిన కొంతకాలనికే ఉద్యోగం కోల్పోడంతో మహేష్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: AC buses: రద్దీ రూట్లలో ఏసీ బస్సులు..
దీంతో భార్య భర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని తెలుస్తోంది. సోమవారం ఉదయం భార్య విధులకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న మహేష్(Mahesh) ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఉద్యోగం రాలేదన్న మానసకి వేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టన్నుల్లో స్మగ్లింగ్.. గ్రాముల్లో పట్టివేత
టికెట్ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు
ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..
వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News and National News
Updated Date - Mar 18 , 2025 | 08:25 AM