Share News

AC buses: రద్దీ రూట్లలో ఏసీ బస్సులు..

ABN , Publish Date - Mar 18 , 2025 | 07:08 AM

నగరంలో.. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఏసీ బస్సులను నగిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు మండిపోయే అవకాశముండడంతో రద్దీ రూట్లలో ఏసీ బస్సులను త్వరలో నడపనున్నారు.

AC buses: రద్దీ రూట్లలో ఏసీ బస్సులు..

- వేసవి నేపథ్యంలో అధికారుల ప్రణాళికలు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో రద్దీ రూట్లలో ఏసీ బస్సులను(AC buses) ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఐటీ కారిడార్‌(IT Corridor)తో పాటు లాంగ్‌ రూట్లలో ఏసీ బస్సుల ట్రిప్పులను పెంచాలని భావిస్తోంది. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలతో ఏసీ బస్సుల్లో ప్రయాణాలు చేసేందుకు నగరవాసులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ 95 పెంచుకునే దిశగా ప్రయత్నిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Temperatures: మెట్టుగూడ మండిపోయింది..


గ్రేటర్‌ జోన్‌(Greater Zone)లో మొత్తం 90 ఏసీ బస్సులుండగా వాటిలో 53 బస్సులను నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)కు నడుపుతున్నారు. మరో 37 మెట్రో ఎలక్ర్టిక్‌ ఏసీ బస్సులను(Metro Electric AC Buses) రద్దీ రూట్లలో నడుపుతున్నారు. సాధారణ రోజుల్లో ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ 70 నుంచి 75శాతం ఉంటోంది.


city2.2.jpg

ఏసీ సర్వీసులను విస్తరించి వేసవిలో 95శాతం ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యంగా ఆర్టీసీ ప్రచారం నిర్వహిస్తోంది. రద్దీ సమయంలో సూపర్‌వైజర్లను నియమించడంతో పాటు, ప్రతీస్టాపులోనూ బస్సులు ఆగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టన్నుల్లో స్మగ్లింగ్‌.. గ్రాముల్లో పట్టివేత

టికెట్‌ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు

ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..

వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 18 , 2025 | 07:08 AM