Share News

Temperatures: మెట్టుగూడ మండిపోయింది..

ABN , Publish Date - Mar 18 , 2025 | 06:41 AM

హైదరాబాద్ నగరంలోని మెట్టుగూడ మండిపోయింది. ఇక్కడ అత్యధికంగా 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో భానుడి ప్రతాపానికి అక్కడి ప్రజలు బెంబేలెత్తిపోయారు.

Temperatures: మెట్టుగూడ మండిపోయింది..

- 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

- నగరంలో భానుడి సెగలు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ న్యూ మెట్టుగూడ(Secunderabad New Mettuguda)లో సోమవారం అత్యధికంగా 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముషీరాబాద్‌ తాళ్లబస్తీ, బేగంబజార్‌, రాజేంద్రనగర్‌, మాదాపూర్‌(Musheerabad Tallabasti, Begambazar, Rajendranagar, Madhapur) ప్రాంతాల్లో 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం బయటకు వచ్చేందుకు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: మా పోరాటం ఆగదు.. రేవంత్ ప్రభుత్వానికి హరీష్‌రావు మాస్ వార్నింగ్


city1.2.jpg

గతేడాది 2024 మార్చి 17న న్యూ మెట్టుగూడ(New Mettuguda)లో 36.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ ఏడాది అదే తేదీన 40 డిగ్రీలకు చేరడం గమనార్హం. వారం రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీలకు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎండ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలతో పాటు గృహాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్‌(Electricity) డిమాండ్‌ ఇప్పటికే గ్రేటర్‌లో 75 మిలియన్‌ యూనిట్లకు చేరింది.


ఈ వార్తలు కూడా చదవండి:

టన్నుల్లో స్మగ్లింగ్‌.. గ్రాముల్లో పట్టివేత

టికెట్‌ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు

ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..

వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 18 , 2025 | 06:41 AM