Hyderabad సెల్‌టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్..
ABN, Publish Date - May 22 , 2025 | 09:36 AM
సెల్‌టవర్ ఎక్కి ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బత్తుల రాము అనే వ్యక్తి హైదర్‌నగర్ రెయిన్‌బో ఆస్పత్రి వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కాడు. తనకు సత్యనారాయణ అనే వ్యక్తి ఇవ్వాల్సిన రూ.8లక్షలు ఇవ్వకుంటే ఆత్యహత్మ చేసుకుంటానని బెదిరించాడు.
హైదరాబాద్: ఓ వ్యక్తి పెట్రోల్ బాటిల్‌తో సెల్‌టవర్‌ఎక్కి హల్‌చల్ చేసిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్(KPHB Police Station) పరిధిలో జరిగింది. కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట(Suryapet) జిల్లా నడిగూడెం గ్రామానికి చెందిన బత్తుల రాము వసంత్‌నగర్‌లోని ఆర్‌ఎల్ ఇంజనీరింగ్ కంపెనీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ నిర్మించే ఇళ్లను రాము సబ్ కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేస్తుంటాడు.
ఈ వార్తను కూడా చదవండి: Shamshabad: విమానంలో మహిళ హల్‌చల్..
అయితే వీరి మధ్య లెక్కలో తేడాలు రావడంతో కంపెనీ యజమాని సత్యనారాయణ రాముకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపివేశాడు. తనకు రావాల్సిన డబ్బులు అడిగి విసుగుచెందిన రాము బుధవారం మధ్యాహ్నం హైదర్‌నగర్ రెయిన్‌బో ఆస్పత్రి(Hydernagar Rainbow Hospital) వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కి తనకు సత్యనారాయణ ఇవ్వాల్సిన రూ.8లక్షలు ఇవ్వకుంటే ఆత్యహత్మ చేసుకుంటానని బెదిరించాడు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి రామును కిందకు దింపి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసులు ఆర్‌ఎల్ కంపెనీ యజమాని సత్యనారాయణను పిలిపించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించగా అతను సరిగా స్పందించలేదు. పోలీసులు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..
Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి
BJP National President K Laxman: వ్యవస్థలో మార్పే అసలైన పరీక్ష
Asaduddin Owaisi: వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే
Kaleshwaram Pushkaralu: భక్తజన సంద్రం.. త్రివేణీ సంగమం
Read Latest Telangana News and National News
Updated Date - May 22 , 2025 | 09:36 AM