ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అమెరికాలో నగర యువకుడి మృతి

ABN, Publish Date - Dec 10 , 2025 | 09:56 AM

హైదరాబాద్‏కు చెందిన ఓ యువకుడు అమెరికాలో మృతిచెందాడు. సంకీర్త్‌ పినుమళ్ల అనే యువకుడు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సైటోన్‌ ఒహియోలో ఎమ్మెస్‌ చేశారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అయితే.. అక్కడ మంచు కురుస్తున్న కారణంగా కాలు జారి పడి మృతి చెందినట్టు సమాచారం.

హైదరాబాద్: అమెరికాలో హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన యువకుడు సంకీర్త్‌ పినుమళ్ల (24) ప్రమాదవశాత్తూ మృతి చెందారు. ఈ నెల 6న ఉదయం రోడ్డుపై నడుస్తుండగా దట్టంగా కురుస్తున్న మంచు కారణంగా ప్రమాదవశాత్తు కాలు జారి పడి మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. కాగా, సంకీర్త్‌ సొంతూరు హైదరాబాద్‌లోని మల్కాజిగిరి. తండ్రి సుధాకర్‌ కొన్నేళ్లుగా దాచేపల్లి అంబుజా సిమెంట్స్‌లో పనిచేస్తూ కుటుంబంతో ఇక్కడే ఉంటున్నారు. దీంతో సంకీర్త్‌ ఇక్కడి దుర్గా పబ్లిక్‌ స్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నారు.

ఇంటర్‌, బీటెక్‌ హైదరాబాద్‌లో చేశారు. ఆ తర్వాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ సైటోన్‌ ఒహియోలో ఎమ్మెస్‌ చేశారు. ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. సంకీర్త్‌కు ఒక చెల్లెలు ఉంది. ఆమె కూడా అమెరికాలోనే ఎమ్మెస్‌ చదువుతున్నారు. మృతదేహం బుధవారం అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరనుండగా, మల్కాజ్‌గిరిలో అంత్యక్రియలు జరుగుతాయని తండ్రి తెలిపారు. సంకీర్త్‌ మరణవార్త తెలిసి.. ఇక్కడి పూర్వ విద్యార్థులు, దుర్గా పబ్లిక్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2025 | 09:56 AM