ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నకిలీ పత్రాలతో ఎస్‌బీఐ నుంచి రూ. 6 కోట్ల రుణం

ABN, Publish Date - Sep 10 , 2025 | 10:14 AM

నకిలీ పత్రాలతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ. 6 కోట్ల రుణం తీసుకున్న ఇద్దరు నిందితులను ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ నారాయణ, రవి నెక్నాంపూర్‌లో లేని భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ఎస్‌బీఐ నుంచి సుమారు రూ. 6 కోట్ల రుణం తీసుకున్నారు.

- ఇద్దరు నిందితుల అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: నకిలీ పత్రాలతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(State Bank of India) నుంచి రూ. 6 కోట్ల రుణం తీసుకున్న ఇద్దరు నిందితులను ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ నారాయణ, రవి నెక్నాంపూర్‌లో లేని భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ఎస్‌బీఐ(SBI) నుంచి సుమారు రూ. 6 కోట్ల రుణం తీసుకున్నారు. రుణం వాయిదాలను సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి వారు ఇచ్చిన పత్రాలను పరిశీలించగా నకిలీవని తేలింది.

తీసుకున్న రుణం ప్రైవేట్‌ కంపెనీలకు, నారాయణ భార్య వ్యక్తిగత ఖాతాకు మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎస్‌బీఐ అధికారుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నిందితులను ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

సీఎం రేవంత్‌ ఇంటి ప్రహరీ కూల్చివేత

Read Latest Telangana News and National News

Updated Date - Sep 10 , 2025 | 10:14 AM