ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బండరాయితో మోది యువకుడి దారుణ హత్య

ABN, Publish Date - Aug 05 , 2025 | 06:33 AM

ఇద్దరి మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన బోరబండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం కోల్కుంద దొడ్డ తాండకు చెందిన బస్వరాజ్‌ రాథోడ్‌(23), వరుసకు సోదరుడైన ప్రేమ్‌రాజ్‌ రాథోడ్‌(22), కుమార్‌ కలిసి బోరబండ ప్రాంతం ఇందిరానగర్‌లో నాలుగు నెలలుగా అద్దెకు ఉంటున్నారు.

హైదరాబాద్: ఇద్దరి మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఓ యువకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన బోరబండ(Borabanda) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక(Karnataka) రాష్ట్రం కోల్కుంద దొడ్డ తాండకు చెందిన బస్వరాజ్‌ రాథోడ్‌(23), వరుసకు సోదరుడైన ప్రేమ్‌రాజ్‌ రాథోడ్‌(22), కుమార్‌ కలిసి బోరబండ ప్రాంతం ఇందిరానగర్‌లో నాలుగు నెలలుగా అద్దెకు ఉంటున్నారు. బస్వరాజ్‌, ప్రేమ్‌రాజ్‌ డ్రైవర్లు, కుమార్‌ ఇటుక లారీలపై కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి బస్వరాజ్‌, ప్రేమ్‌రాజ్‌ మధ్య పర్వత్‌నగర్‌లో గొడవ జరిగింది.

ఈ క్రమంలో ప్రేమ్‌రాజ్‌ను బస్వరాజ్‌ కొట్టాడు. దీంతో ప్రేమ్‌రాజ్‌ మాదాపూర్‌ పోలీస్ స్టేషన్‌(Madhapur Police Station)లో ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. పోలీసులు పిలిస్తే బస్వరాజ్‌ మాదాపూర్‌ వెళ్లలేదు. ఆ కోపంతో ప్రేమ్‌రాజ్‌ సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు నిద్రపోతున్న బస్వరాజ్‌ తలపై గ్రానెట్‌ రాయితో మోదాడు. తలకు తీవ్రమైన గాయమైన బస్వరాజ్‌ను బంధువులు వెంటనే సనత్‌నగర్‌లోని రెనోవా హాస్పిటల్‌కు తరలించారు.

అప్పటికే బస్వరాజ్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌జోన్‌ డీసీపీ ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌, ఎస్‌.ఆర్‌.నగర్‌ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సురేందర్‌గౌడ్‌ పరిశీలించి, ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు ప్రేమ్‌రాజ్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బోరబండ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఇది రాజకీయం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం!

బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 05 , 2025 | 06:34 AM