Hyderabad: ‘నా కుమారుడి మరణంపై అనుమానాలున్నాయి’
ABN, Publish Date - Nov 08 , 2025 | 11:20 AM
తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మృతి చెందిన మహ్మద్ అహ్మద్(26) తండ్రి మహ్మద్ మియా రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతబస్తీ జహనుమాకు చెందిన మహ్మద్ అహ్మద్ రాజేంద్రనగర్ సర్కిల్ భవానీ కాలనీలోని కెన్వర్త్ అపార్ట్‌మెంట్స్‌లో రెండు నెలలుగా అద్దెకుంటున్నాడు.
హైదరాబాద్: తన కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, డ్రగ్స్ ఓవర్ డోస్‌తో మృతి చెందిన మహ్మద్ అహ్మద్(26) తండ్రి మహ్మద్ మియా రాజేంద్రనగర్(Rajendra Nagar) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతబస్తీ జహనుమాకు చెందిన మహ్మద్ అహ్మద్ రాజేంద్రనగర్ సర్కిల్ భవానీ కాలనీలోని కెన్వర్త్ అపార్ట్‌మెంట్స్‌లో రెండు నెలలుగా అద్దెకుంటున్నాడు. టవర్-1 ఫ్లాట్ 805లో కర్నూల్‌కు చెందిన షేక్ జారా(20)తో సహజీవనం చేస్తున్నాడు. మహ్మద్ అహ్మద్ బుధవారం రాత్రి తన గదిలో డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడంవల్ల మరణించిన సంగతి తెలిసిందే.
అదే ఇంట్లో సులేమాన్‌నగర్ చింతల్‌మెంట్‌కు చెందిన సయ్యద్ బిన్ సలామ్(23), ఆ పోర్షన్‌లోని మరో గదిలో కలకత్తాకు చెందిన మొమతా బిస్వాస్ అనే మహిళ ఉంటుండడం తెలిసిందే. మొమత బిస్వాస్ భర్త కల్‌కత్తాకు వెళ్లగా ఆమె ఒంటరిగా ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా సయ్యద్ బిన్ సలామ్‌తో పాటు షేక్ జారాకు కూడా పాసిటివ్ వచ్చింది. మహ్మద్ అహ్మద్ పోస్టుమార్టం నివేధిక ఇంకా రాలేదని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 08 , 2025 | 11:20 AM