ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఒకచోట రూ. 21 లక్షలు, మరోచోట రూ.11.86 లక్షలు.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Sep 13 , 2025 | 06:50 AM

‘మీపై మనీల్యాండరింగ్‌ కేసులు నమోదు అయ్యాయి. మిమ్మల్ని డిజిటల్‌ అరెస్టు చేస్తున్నాం’ అంటూ బెదిరిగించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన వృద్ధుడి నుంచి రూ.21లక్షలు దోచేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్‌ కాల్‌ చేశారు. ముంబై పోలీస్‌ అధికారుల్లా పరిచయం చేసుకున్నారు.

హైదరాబాద్‌ సిటీ: ‘మీపై మనీల్యాండరింగ్‌ కేసులు నమోదు అయ్యాయి. మిమ్మల్ని డిజిటల్‌ అరెస్టు చేస్తున్నాం’ అంటూ బెదిరిగించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన వృద్ధుడి నుంచి రూ.21లక్షలు దోచేశారు. డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్‌ కాల్‌(WhatsApp call) చేశారు. ముంబై పోలీస్‌ అధికారుల్లా పరిచయం చేసుకున్నారు.

మీ ఆధార్‌ కార్డుతో లింకై ఉన్న బ్యాంకు ఖాతాలు దుర్వినియోగం అయ్యాయని, మనీ ల్యాండరింగ్‌ మోసాలకు పాల్పడ్డారని క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం ఉన్నతాధికారినంటూ పోలీస్‌ డ్రెస్‌లో వీడియోకాల్‌ చేశారు. ‘మీపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. మీ బ్యాంకు ఖాతాలు ఆడిట్‌ చేయాల్సిన అవసరం ఉంది. మీ ఖాతాల్లో ఉన్న డబ్బు ఆర్‌బీఐ ఆధీనంలో ఉన్న ఖాతాకు బదిలీ చేయాలి. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఎక్కడా బయటకు చెప్పొద్దు.

మనీ ల్యాండరింగ్‌తో మీకు ఎలాంటి సంబంధమూ లేదని తేలితే మీ డబ్బు మీ ఖాతాలో జమ చేస్తాం’ అని నమ్మించాడు. అతని మాటలు విన్న బాధితుడు వారు చెప్పిన ఖాతాకు మొత్తం రూ. 21లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎవరూ స్పందించకపోవడం, డబ్బులు ఖాతాలో జమ కాకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. ఇదంతా సైబర్‌ క్రిమినల్స్‌ మోసమని ఆలస్యంగా తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మాయ చేసి ముంచేశారు..

- రూ.11.86 లక్షలు కొల్లగొట్టిన నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: తాము సూచించిన విధంగా పెట్టుబడి పెడితే అధిక లాభాలు సంపాదించవచ్చని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు ఇద్దరు నగరవాసుల నుంచి రూ.11.68 లక్షలు కాజేశారు. అబిడ్స్‌(Abids) ప్రాంతానికి చెందిన వ్యక్తి (35) ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైం జాబ్‌ ఆఫర్‌ ప్రకటన చూసి సంప్రదించాడు. క్యూబ్‌ రీసెర్చ్‌ టెక్నాలజీస్‌ సంస్థ ప్రతినిధినని పరిచయం చేసుకున్న చంద్రిక అనే మహిళ ముందుగా చిన్న టాస్కులు చేయించి చిన్న మొత్తాల్లో లాభాలు అందించి నమ్మకం పొందింది.

తర్వాత ప్రీపెయిడ్‌ జాబు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పింది. బాధితుడి నుంచి సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు పలు దఫాలుగా రూ.10.25 లక్షలు పెట్టుబడి పెట్టించారు. నకిలీ వెబ్‌సైట్‌లో రూ.15.57 లక్షలు ఉన్నట్లుగా చూపారు. ఈ డబ్బు విత్‌డ్రా చేసుకునే వీలు లేకపోవడం, మరింత డబ్బు డిమాండ్‌ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం ఠాణాలో పిర్యాదు చేశాడు. మరో కేసులో ఆసిఫ్‌నగర్‌కు చెందిన వ్యక్తి (44) పార్ట్‌టైం జాబ్‌కోసం ప్రయత్నించాడు.

ఈ సమయంలో మైకేల్‌ పేజ్‌ ఐటీ సంస్థ ప్రతినిధినని పరిచయం చేసుకున్న వీణా ఖత్రి అనే మహిళ ముందుగా చిన్న టాస్కులు ఇచ్చి లాభాలు చూపారు. తర్వాత పెట్టుబడి పెట్టాలని సూచించడంతో నమ్మిన బాధితుడు రూ.1.61 లక్షలు పెట్టుబడి పెట్టాడు. నకిలీ వెబ్‌సైట్‌లో రూ.3.50 లక్షలు వచ్చినట్లు చూపడంతో విత్‌డ్రాకు యత్నించాడు. డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ.3.50 లక్షలు పెట్టుబడి పెట్టాలని డిమాండ్‌ చేయడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 13 , 2025 | 06:55 AM