ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: రూ.12.99 లక్షలు కొల్లగొట్టేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN, Publish Date - Oct 09 , 2025 | 09:42 AM

పెన్షన్‌ కోసం విధిగా సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని ఏపీకే లింక్‌లు పంపిన సైబర్‌ నేరగాళ్లు రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఖాతా నుంచి రూ.12.99 లక్షలు కొల్లగొట్టారు. బర్కత్‌పురాలో నివసించే రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఈనెల 4న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి ఆన్‌లైన్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ అందిస్తామన్న ప్రకటనను ఫేస్‌బుక్‌లో చూశారు.

- లైఫ్‌ సర్టిఫికెట్‌ పేరుతో మోసం..

- రూ.12.99 లక్షలు పోగొట్టుకున్న రిటైర్డ్‌ ఉద్యోగి

హైదరాబాద్‌ సిటీ: పెన్షన్‌ కోసం విధిగా సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని ఏపీకే లింక్‌లు పంపిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఖాతా నుంచి రూ.12.99 లక్షలు కొల్లగొట్టారు. బర్కత్‌పురాలో(Barkatpura) నివసించే రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఈనెల 4న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) నుంచి ఆన్‌లైన్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ అందిస్తామన్న ప్రకటనను ఫేస్‌బుక్‌లో చూశారు. అందులోని లింక్‌లో తన వివరాలు నమోదు చేశారు. కొద్ది సేపటి తర్వాత పీఎన్‌బీ లోగో డీపీగా ఉన్న వ్యక్తి వాట్సప్‌ ద్వారా సంప్రదించాడు.

లైఫ్‌ సర్టిఫికెట్‌ కోసం వివరాలు నమోదు చేయాలంటూ బాధితుడి మొబైల్‌కు పీఎన్‌బీలైఫ్‌ సర్టిఫికెట్‌ పేరుతో ఏపీకే లింక్‌ను పంపాడు. ఇదంతా నిజమని నమ్మిన బాధితుడు ఆ లింక్‌ను తెరిచి, వివరాలు నమోదు చేశాడు. కొద్ది సేపటికే తన బ్యాంకు ఖాతా నుంచి రూ.12.99 లక్షలు వేర్వేరు ఖాతాలకు బదిలీ అయినట్లు తెలుసుకున్నాడు. మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భారత్‌ దాల్‌.. అంతా గోల్‌మాల్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 09 , 2025 | 09:42 AM