Hyderabad: డీప్‌ఫేక్‌తో జర జాగ్రత్త..
ABN, Publish Date - May 14 , 2025 | 07:39 AM
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని సంబురపడాలో.. లేక పెరిగిన టెక్నాలజీతో మోసపోతున్నామని కంగారు పడాలో అర్థంగాని పరిస్థితిలో సగటు మానవుడు జీవించదాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఎక్కడో ఓచోట ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
- సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలతో బ్లాక్‌మెయిల్
- మోసం చేయడానికి వినియోగిస్తున్న సైబర్ నేరగాళ్లు
- అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
హైదరాబాద్ సిటీ: సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో డీప్‌ఫేక్‌లు సోషల్ మీడియా(Social media) వినియోగదారులకు సవాల్‌గా మారాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగించి సృష్టించే డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు, చిత్రాలు నిజమైనవిగా కనిపిస్తున్నాయి. వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ఇతరులను మోసగించడానికి కొందరు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు డీప్‌ఫేక్‌లపై అవగాహన పెంచుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి: Hyderabad: మారని మద్యం ప్రియులు.. ఒక్కనెలలో ఎన్ని డ్రంకెన్ డ్రైవ్ కేసులో తెలుసా..
స్మార్ట్ ఫోన్‌తో తీసే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని, ఫోన్‌లోని డేటా స్టోర్ చేసుకోవాలని పేర్కొంటున్నారు. కొందరు ముందు, వెనకా ఆలోచించుకోకుండా వ్యక్తిగత సమాచారంతో పాటు ఫొటోలను సోషల్ మీడియా వేదికలపై పంచుకోవడంవల్ల సైబర్ నేరగాళ్లకు ఆయుధంగా మారుతున్నాయి. రోజు రోజుకు స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డీప్‌ఫేక్‌తో జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదిగా పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
డీప్‌ఫేక్ అంటే ఏమిటి?
డీప్‌ఫేక్‌లు అంటే కృత్రిమ మేధస్సు ఆధారిత సాఫ్ట్‌వేర్‌ల ద్వారా సృష్టించబడిన నకిలీ వీడియోలు లేదా ఆడియోలు. ఒక వ్యక్తి మాట్లాడినట్టు లేదా చేసినట్టు కనిపించేలా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా నకిలీది. డీప్‌ఫేక్‌లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి, మోసాలకు, లేదా వ్యక్తుల పరువు తీసేందుకు ఉపయోగపడతాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు లేదా సామాన్య వ్యక్తులు చెప్పని మాటలు చెప్పినట్టు, లేదా చేయని పనులు చేసినట్టు చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటారు. ఉదాహరణకు నకిలీ వీడియో కాల్స్, ఆడియోల ద్వారా డబ్బులు డిమాండ్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆర్థిక మోసాలకు పాల్పడుతుంటారు. ఒక వ్యక్తిని అవమానకరంగా చూపించడం ద్వారా వారి వ్యక్తిగత జీవితానికి హాని కలిగిస్తుంటారు.
గుర్తించడం ఎలా?
వీడియోలో అసహజమైన ముఖ కదలికలు, లిప్ సింక్ సమస్యలు లేదా విచిత్రమైన లైటింగ్ ఉండవచ్చు. ఆడియోలో అసాధారణ స్వరం లేదా శబ్దం ఉండవచ్చు. కంటెంట్‌లోని సందర్భం లేదా వివరాలు అసంబద్ధంగా ఉంటే అది డీప్‌ఫేక్ కావచ్చు. దీన్ని గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సోషల్ మీడియా సంస్థలు కృత్రిమ మేధస్సు ఆధారిత సాధనాలను అభివృద్ధి చేస్తున్నాయి. డీప్‌ఫేక్‌లను వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సైబర్ కైరమ్ విభాగాలు నిరంతరం పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాన్ని సులభతరం చేస్తుంది. దానితో పాటు వచ్చే ప్రమాదాలను తెలుసుకోవడం మన బాధ్యత అని, వ్యక్తిగత సమాచారాన్ని, గోప్యతను రక్షించుకోవాల్సిన బాఽధయత ప్రజలపైనే ఉందని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు
కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు
ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?
నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!
దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!
Read Latest Telangana News and National News
Updated Date - May 14 , 2025 | 07:39 AM