Hyderabad: సమాధిని తవ్వి పోస్టుమార్టం చేయించిన పోలీసులు
ABN, Publish Date - Dec 19 , 2025 | 10:37 AM
ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. కుటుంబసభ్యులు ఖననం చేయగా పోలీసులు సమాధిని తవ్వించగా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
- ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన యువకుడు
హైదరాబాద్: ఆటోలో ప్రయాణిస్తూ కిందపడి తీవ్రంగా గాయపడిన యువకుడిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందిన సంఘటన బోరబండ పోలీస్‌స్టేషన్(Borabanda Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంకు చెందిన ఇసాఖ్ హుస్సేన్(38) కూలీ పనులు చేస్తూ ఎస్పీఆర్ హిల్స్ రాజీవ్‌గాంధీ నగర్‌లో ఉండేవాడు. గత నెల 26న సెవెన్ సీటర్ ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో శ్రీరామ్ నగర్ హనుమాలయం వద్ద ఇసాఖ్ హుస్సేన్ ఆటో నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ ప్రమాదం విషయాన్ని ఇసాఖ్ తండ్రి తయ్యబ్ అలీ గత నెల 29న బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఇసాఖ్‌ను గాంధీ ఆస్పత్రి నుంచి అంబర్‌పేటలోని సీజన్ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రి వైద్యుల సూచన ప్రకారం అతడిని అంబులెన్స్‌లో అసోం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అతడి కుటుంబ సభ్యులు ముస్లిం సంప్రదాయం ప్రకారం అసోంలో ఖననం చేశారు.
ప్రమాదంలో గాయపడిన ఇసాఖ్ పరిస్థితి తెలుసుకునేందుకు బోరబండ పోలీసులు అతడి తండ్రికి ఫోన్ చేయగా అసలు విషయం తెలిసింది. దీంతో హుటాహుటిన ఎస్‌ఐ మధుసూదన్ అసోంకు వెళ్లి అక్కడి మెజిస్ట్రేట్‌తో చర్చించి ఖననం చేసిన ఇసాఖ్ మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేయించారు. అతడి మృతికి కారణమైన ఆటోడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసును బోరబండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కవితనే కాదు ఎవరైనా సీఎం కావొచ్చు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 19 , 2025 | 10:37 AM