ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఆ అపార్టుమెంట్‌.. ఓ బెట్టింగ్‌ డెన్‌

ABN, Publish Date - May 02 , 2025 | 07:10 AM

ఆ అపార్టుమెంట్‌.. ఓ బెట్టింగ్‌ డెన్‌గా మారిపోయింది. విదేశీ ఏజెంట్ల నుంచి లాగిన్‌ ఐడీ తీసుకొని, 5 శాతం కమీషన్‌తో సబ్‌ బుకీలను ఏర్పాటు చేసుకొని క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. అయితే.. ఏది ఎంతకాలం ఆగదుగా.. చివరకు విషయం పోలీసులకు తెలవడంతో విషయమంతా బహిర్గతమైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- విదేశీ ఐడీలతో క్రికెట్‌ బెట్టింగ్‌

- ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌ను బెట్టింగ్‌ డెన్‌గా మార్చాడు. విదేశీ ఏజెంట్ల నుంచి లాగిన్‌ ఐడీ తీసుకొని, 5 శాతం కమీషన్‌తో సబ్‌ బుకీలను ఏర్పాటు చేసుకొని క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, దోమలగూడ పోలీసులు సంయుక్తంగా డెన్‌పై దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైవీ సుదీంద్ర తెలిపిన వివరాల ప్రకారం హిమాయత్‌నగర్‌(Himayatnagar)కు చెందిన శ్రీరాజ్‌బూబ్‌కు అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్‌లు నిర్వహించే విదేశీ ఏజెంట్లతో పరిచయం ఏర్పడింది.

ఈ వార్తను కూడా చదవండి: Vikarabad: భారీ పోలీసు బందోబస్తు మధ్య పులిచర్లకుంట తండాలో భూ సర్వే


వారి నుంచి లాగిన్‌ ఐడీ తీసుకొని కొన్నాళ్లుగా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. క్రికెట్‌ అభిమానులను పంటర్లుగా చేర్చుకొని బెట్టింగ్‌ ఊబిలోకి దింపేందుకు చిక్కడపల్లికి చెందిన హోండ్మనే సాయినాథ్‌, రేగల్ల గోపీనాథ్‌లను అనుచరులుగా (సబ్‌ బుకీలు) ఏర్పాటు చేసుకున్నాడు. వచ్చిన డబ్బులో వారికి 5 శాతం కమీషన్‌ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. తాను ఉండే అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లోనే బెట్టింగ్‌ డెన్‌ నిర్వహిస్తున్నాడు. విదేశీ ఏజెంట్ల ద్వారా రాధీఎక్స్‌ డాట్‌ కామ్‌ అప్లికేషన్‌ నుంచి లాగిన్‌ ఐడీని పొందాడు. తన అనుచరుల ద్వారా పంటర్లను ఆహ్వానించి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు.


బుధవారం చెన్నై సూపర్‌ కింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ కింగ్స్‌కు మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో పవాని లింగయ్య అపార్టుమెంట్‌లో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ప్రధాన బుకీ శ్రీరాజ్‌ బూబ్‌తో పాటు, సబ్‌ బుకీలు హోండ్మనే సాయినాథ్‌, రేగల్ల గోపీనాథ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బెట్టింగ్‌ డబ్బు రూ. 1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌ యాప్‌లు ఉన్న మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను దోమలగూడ పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

Gold Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత

Read Latest Telangana News and National News

Updated Date - May 06 , 2025 | 06:51 AM