ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఇంటర్‌ విద్యార్థినులకు సెక్స్‌ పాఠాలు..

ABN, Publish Date - Oct 16 , 2025 | 07:25 AM

విద్యార్థినులకు సెక్స్‌ పాఠాలు చెబుతూ వారిని లైంగికంగా వేధిస్తున్న ఓ కళాశాల గణితశాస్త్ర అధ్యాపకుడిపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

- గణిత శాస్త్ర అధ్యాపకుడిపై పోక్సో కేసు

హైదరాబాద్: విద్యార్థినులకు సెక్స్‌ పాఠాలు చెబుతూ వారిని లైంగికంగా వేధిస్తున్న ఓ కళాశాల గణితశాస్త్ర అధ్యాపకుడిపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి(Inspector Srinath Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ జనప్రియ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న కాలువ శ్రీకాంత్‌(30) ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా రెండేళ్లుగా పనిచేస్తున్నాడు.

కళాశాల సమయం పూర్తయిన తరువాత కొందరు ఇంటర్‌ విద్యార్థినులకు అదనపు సమయం తీసుకుని పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇస్తున్నాడు. ఈ క్రమంలో కొందరి ఫోన్‌ నంబర్లు తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత వారితో చాటింగ్‌ చేస్తుండేవాడు. ఎన్డీఏ పరీక్షలో సెక్సుకు సంబంధించిన ప్రశ్నలుంటాయని నమ్మించి వాటి గురించి వివరిస్తూ చాట్‌ చేయడంతో పాటు కొందరితో చనువు పెంచుకుని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు.

ఓ విద్యార్థిని విషయం తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధ్యాపకుడిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు మరికొందరు విద్యార్థినులతో కూడా శ్రీకాంత్‌ అలాగే ప్రవర్తించేవాడని తెలిసింది. నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా

వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2025 | 07:25 AM