ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘పహల్గామ్‌’ ఉగ్రవాదులతో మీకు సంబంధాలున్నాయ్‌ అంటూ.. రూ.26.06 లక్షలు..

ABN, Publish Date - Sep 24 , 2025 | 08:33 AM

మీకు కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయి. మీపై మనీల్యాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. అందుకే డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నాం’ అంటూ వృద్ధుడిని భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు అతడి నుంచి రూ.26.06 లక్షలు దోచేశారు.

- వృద్ధుడిని భయపెట్టి రూ.26.06 లక్షలు దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ‘మీకు కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడులతో సంబంధాలు ఉన్నాయి. మీపై మనీల్యాండరింగ్‌ కేసులు నమోదయ్యాయి. అందుకే డిజిటల్‌ అరెస్ట్‌ చేస్తున్నాం’ అంటూ వృద్ధుడిని భయపెట్టిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) అతడి నుంచి రూ.26.06 లక్షలు దోచేశారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవిత(City Cyber ​​Crime DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం.. హుమాయున్‌నగర్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధునికి గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్‌ కాల్‌ చేశారు.

యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌, ఎన్‌ఐఏ అధికారుల్లా పరిచయం చేసుకున్నారు. మీ ఆధార్‌ కార్డు(Aadhaar card)తో లింకై ఉన్న ఖాతాలతో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడి డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించినట్లు తేలిందని భయపెట్టారు. పహల్గాం ఉగ్రదాడితో సంబంధాలు ఉన్నట్లు తేలిందని బెదించారు. పోలీస్‌ డ్రెస్‌లో ఉన్న వ్యక్తులు మాట్లాడుతూ.. ‘మీకు ఈ కేసులతో సంబంధం లేదని నిరూపణ అయితే వదిలేస్తాం.

అప్పటి వరకు మీరు డిజిటల్‌ అరెస్టులో ఉంటారు. మీ ఖాతాల్లో ఉన్న డబ్బు ఆర్‌బీఐ ఆధీనంలో ఉన్న ఖాతాకు బదిలీ చేయాలి. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఎక్కడా బయటకు చెప్పొద్దు’ అని హెచ్చరించారు. బాధితుడు వారు చెప్పిన ఖాతాకు మొత్తం రూ.26.06 లక్షలు బదిలీ చేశాడు. తర్వాత ఎవరూ స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 24 , 2025 | 08:33 AM