Hyderabad: భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదని..
ABN, Publish Date - Oct 22 , 2025 | 09:58 AM
పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వివరించారు.
- భర్త ఆత్మహత్య
హైదరాబాద్: పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్(Attapur Police Station) పరిధిలో జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు. హుడా కాలనీలో నివాసముండే సంజయ్ కుమార్(23) డైక్ర్లీనింగ్ పని చేస్తుంటాడు. సంవత్సరం క్రితం ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆయేషాను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
వివాహమైన కొన్ని నెలలు బాగానే ఉన్నారు. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. సంజయ్ కుమార్(Sanjay Kumar) తన భార్యను తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా భర్త దగ్గరికి వచ్చేందుకు నిరాకరించింది. తన భార్య రావడంలేదని మనస్థాపం చెందిన సంజయ్ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Oct 22 , 2025 | 09:58 AM