Hyderabad: సైబర్ నేరగాళ్ల నయా ప్లాన్... ఉద్యోగం ఇప్పిస్తానని..
ABN, Publish Date - Jun 17 , 2025 | 08:13 AM
ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశపెట్టిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.1.11 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన యువకుడు (36) ఉద్యోగం మారే ప్రయత్నాల్లో తన బయోడేటాను పలువురు స్నేహితులకు పంపాడు.
- రూ.1.11 లక్షలకు టోకరా
హైదరాబాద్ సిటీ: ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశపెట్టిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.1.11 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన యువకుడు (36) ఉద్యోగం మారే ప్రయత్నాల్లో తన బయోడేటా(Biodata)ను పలువురు స్నేహితులకు పంపాడు. ఓ స్నేహితుడి సూచన మేరకు ఆ వ్యక్తి 62817 31463 నంబర్‌లో ఒకరిని సంప్రదించాడు. అవతలి వ్యక్తి తాను ‘ఇంటెల్ లై సంస్థ’ అడ్మిన్ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. తమ సంస్థలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, వేతనం ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని నమ్మించాడు.
అయితే, ప్రస్తుతం మీకు వస్తున్న ఆదాయానికి ఆ ప్యాకేజీ రాదని, దాని కోసం ఇన్‌కంట్యాక్స్ ఫైల్(Incontax file) చేయాలని సూచించాడు. దానికోసం తమ సంస్థ చార్టెడ్ ఎకౌంటెంట్(Chartered Accountant) సహకరిస్తాడని సూచించాడు. చార్టెట్ అకౌంటెంట్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి ఫైలింగ్ కోసం ముందుగా రూ.38 వేలు కట్టాలని చెప్పడంతో యువకుడు అతడు సూచించిన ఖాతాకు డబ్బు పంపాడు. ఆ తర్వాత మరిన్ని కారణాలు చెప్పి పలు దఫాలుగా మొత్తం రూ.1.11 లక్షలు వసూలు చేశారు. తర్వాత వారి ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండడంతో బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి.
గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
‘ధరణి’పై ఫోరెన్సిక్ ఆడిట్ షురూ
Read Latest Telangana News and National News
Updated Date - Jun 17 , 2025 | 08:13 AM