Gold Rates Today: గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 06:39 AM
దేశంలో బంగారం, వెండి ధరలు షాకుల మీద షాక్ ఇస్తున్నాయి. నిన్న ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న పసిడి ధరలు ఈరోజు (జూన్ 17, 2025) ఉదయం నాటికి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే వీటి ధరలు ఏ మేరకు చేరుకున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో బంగారం (Gold Price Today), వెండి ధరలు నిన్న ఆల్ టైం గరిష్ఠానికి చేరుకోగా, నేడు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 17, 2025 నాటి హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,500కు చేరుకోగా. ఇది జూన్ 16 నాటి రేటు రూ.1,01,660తో పోలిస్తే రూ.160 తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,040గా ఉంది. ఇది జూన్ 16 నాటి రూ.93,200తో పోలిస్తే రూ.160 తగ్గుదలను చూపిస్తోంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఇవి కూడా తగ్గిపోయాయి. కేజీ వెండి ధర రూ.1,09,800 స్థాయికి చేరుకుంది.
ఎందుకు పెరిగింది..
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జూన్ 12 నాటి రేట్లతో పోలిస్తే, 24 క్యారెట్ల బంగారం రూ. 98,583 నుంచి ఏకంగా రూ.1,01,500కు పెరిగింది. ఇది గణనీయంగా రూ.2,917 పెరిగింది. కానీ జూన్ 16 నుంచి జూన్ 17 నాటికి మాత్రం రూ.160 తగ్గుదల కనిపించింది. అయితే ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, డాలర్ విలువలో మార్పులు కారణంగా వీటి ధరల్లో భారీగా మార్పులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
కొనుగోలుదారులకు సూచనలు
ఈ క్రమంలో భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం విధించే పన్నులు, అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలకు డిమాండ్ పెరగనుందని అంటున్నారు. ఈ అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపించనున్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ధరల హెచ్చుతగ్గులను గమనించడం చాలా ముఖ్యం. ఒకవైపు ధరలు తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, స్థానిక డిమాండ్ ఆధారంగా ఇవి మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
తేడా ఏంటి?
24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛత కలిగి ఉంటుంది. దీనిని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. ఇది సాధారణంగా బులియన్ బార్లు లేదా నాణేల రూపంలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగిస్తారు. మరోవైపు, 22 క్యారెట్ల బంగారం 91.6% స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఇందులో 5% వెండి, 2% రాగి, 1.3% జింక్‌తో కూడిన మిశ్రమం ఉంటుంది. ఇది ఆభరణాల తయారీకి వాడతారు. ఎందుకంటే ఇది మరింత బలంగా, ధరించడానికి అనువైనదిగా ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News