Hyderabad: ఫోన్ హ్యాక్ చేసి.. ఖాతా ఖాళీ
ABN, Publish Date - Nov 19 , 2025 | 06:52 AM
రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరితమైన ఏపీకే ఫైల్ లింకులు పంపి.. అమాయకుల ఫోన్లను హ్యాక్ చేస్తూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఖాతాల నుంచి రూ.16.31 లక్షలు కాజేశారు.
- ఐదుగురి నుంచి రూ.16.31 లక్షలు కాజేత
- ఏపీకే ఫైల్స్ పంపి దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మోసపూరితమైన ఏపీకే ఫైల్ లింకులు పంపి.. అమాయకుల ఫోన్లను హ్యాక్ చేస్తూ వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. నగరానికి చెందిన ఐదుగురు ఖాతాల నుంచి రూ.16.31 లక్షలు కాజేశారు. బాధితులు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఓ వృద్ధుడికి యూనియన్ బ్యాంకు లైఫ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పేరుతో లింకు వచ్చింది. క్లిక్ చేయడంతో సైబర్ క్రిమినల్స్ ఆయన ఫోన్ హ్యాక్ చేసి నిఘా పెట్టారు.
ఆయన ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు అతని ఖాతా నుంచి దశలవారీగా రూ.10 లక్షలు దోచేశారు. ఆలస్యంగా గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మరో కేసులో.. సైబర్ క్రిమినల్స్ కోటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్ కార్డు(Kotak Mahindra Bank Credit Card) పేరుతో 62 ఏళ్ల వృద్ధుడికి ఏపీకే ఫైల్ లింకులు పంపి దాని ద్వారా ఫోన్ హ్యాక్ చేశారు. అది తెలియని అతను తన క్రెడిట్ కార్డు వివరాలు ఎంటర్ చేయగానే రూ.1,72,999 డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో నిర్ఘాంతపోయాడు.
ఇంకో కేసులో.. 44 ఏళ్ల వ్యక్తికి ఆర్టీఏ ఎంపరివాహన్ యాప్ పేరుతో లింకు పంపి, ఫోన్ హ్యాక్ చేసి రూ.2.24,875 కొల్లగొట్టారు. నాలుగో కేసులో.. 38 ఏళ్ల వ్యక్తికి బీమా డీయాక్టివేషన్ పేరుతో నకిలీ లింకు పంపిన సైబర్ క్రిమినల్స్.. అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1,09,891 దోచేశారు. ఐదో కేసులో.. ఇదే తరహాలో 45 ఏళ్ల వ్యక్తిని నుంచి రూ.1.24 లక్షలు కొల్లగొట్టారు. ఒకేరోజు 5 కేసులు నమోదు కావడంతో సిటీ పోలీసులు సీరియ్‌సగా తీసుకుని, సాంకేతిక ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
సినిమాలకు.. ఇక సెలవు! నటనకు వీడ్కోలు.. పలికిన నటి తులసి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 19 , 2025 | 06:52 AM