Hyderabad: పీఎం కిసాన్ యోజన పేరుతో సైబర్ మోసం.. రూ.2.99లక్షలు గోవిందా..
ABN, Publish Date - Sep 11 , 2025 | 07:00 AM
పీఎం కిసాన్ యోజన పేరుతో ఏపీకే లింక్‌లు పంపిన సైబర్ నేరగాళ్లు ఫోన్‌ను తమ నియంత్రణలోకి తీసుకొని బాధితుడి ఖాతా నుంచి రూ2.90 లక్షలు బదిలీ చేసుకున్నారు. బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ‘పీఎం కిసాన్ యోజన’ పేరుతో ఏపీకే లింక్ పంపారు.
- రూ.2.99లక్షలు కాజేసిన నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: పీఎం కిసాన్ యోజన(PM Kisan Yojana) పేరుతో ఏపీకే లింక్‌లు పంపిన సైబర్ నేరగాళ్లు ఫోన్‌ను తమ నియంత్రణలోకి తీసుకొని బాధితుడి ఖాతా నుంచి రూ2.90 లక్షలు బదిలీ చేసుకున్నారు. బహదూర్‌పురా(Bahadurpura) ప్రాంతానికి చెందిన వ్యక్తికి సైబర్ నేరగాళ్లు ‘పీఎం కిసాన్ యోజన’ పేరుతో ఏపీకే లింక్ పంపారు. ఆ వ్యక్తి లింక్‌లను తెరిచాడు. తర్వాత బాధితుడి ఫోన్ అతడి నియంత్రణలో లేదు.
ఖాతా నుంచి రూ.2.99 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు తెలుసుకొని బ్యాంకు అధికారులను సంప్రదించాడు. బ్యాంకు అధికారులు అందులోని రూ.9 వేలను మాత్రమే ఆపగలిగారు. ఏపీకే లింక్ ద్వారా మాల్‌వేర్ పంపిన నేరగాళ్లు ఫోన్‌ను నియంత్రణలో తీసుకుని బ్యాంకు లావాదేవీలకు వచ్చే ఓటీపీలతో డబ్బులు కాజేసినట్లు బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
మ్యాట్రిమోని సైట్‌లో పరిచయమైన మహిళ మాటలు నమ్మిన యువకుడు రూ.1.56 లక్షలు పోగొట్టుకున్నాడు. జియాగూడ ప్రాంతానికి చెందిన యువకుడికి జీవన్ సాథి సైట్‌లో ఓ మహిళ పరిచయమైంది. మాటలు కలిపి క్రిప్టో పెట్టుబడుల గురించి చెప్పింది.
తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి ఆమె ఓ లింక్ ద్వారా ‘డెక్స్(డీఈఎక్స్) అనే యాప్‌ను పంపింది. ఇన్‌స్టాల్ చేసుకున్న బాధితుడు పలు దఫాలుగా రూ.1.56 లక్షలు ఆమె సూచించిన ఖాతాలకు బదిలీ చేశాడు. యాప్‌లో లాభాలు వచ్చినట్లు కనిపిస్తున్నా విత్‌డ్రా కాలేదు. ఇంకా డబ్బు డిమాండ్ చేయడంతో ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News
Updated Date - Sep 11 , 2025 | 07:00 AM