Hyderabad: ఎయిర్‌గన్‌తో హల్‌చల్ చేసి.. ప్రియురాలితో ఎంజాయి చేసేందుకు వచ్చి..
ABN, Publish Date - May 08 , 2025 | 07:13 AM
ఎయిర్‌గన్‌తో హల్‌చల్ చేసి.. ప్రియురాలితో ఎంజాయి చేసేందుకు వచ్చి.. చివరకు పోలీసులకు అడ్డంగా దిరికిపోయి ఇప్పుడు కటకటాలపాలయ్యాడు. దొంగిలించిన డబ్బుతో ప్రియురాలితో ఎంజాయి చేసేందుకు వచ్చి, వాహానాల తనిఖీలో పోలీసులకు అడ్డంగా దొరికిపొయాడు. చివరకు పోలీసులు తమదైన శైలీలో విచారిస్తే.. అతని పాపాల చిట్టా మొత్తం బయటకు వచ్చింది.
- నిందితుడి అరెస్ట్
- రూ. 3.40 లక్షలు, 8 తులాల బంగారం, బైక్ స్వాధీనం
హైదరాబాద్: ఐదు రోజుల క్రితం ఈస్ట్ శ్రీనివాసనగర్(East Srinivasa nagar)లో ఎయిర్ గన్‌తో హల్‌చల్ చేసిన నిందితుడిని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు(SR Nagar Police) బుధవారం అరెస్ట్ చేశారు. ఇతడి నుంచి ఎయిర్ పిస్టల్, రూ.3.40 లక్షల నగదు, 8 తులాల బంగారంతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ఈ వార్తను కూడా చదవండి: Kishan Reddy: ఆపరేషన్ సిందూర్ భారత నిబద్దతకు నిదర్శనం
ఏపీ విశాఖపట్నంకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ తిప్పరాజు రామకృష్ణ నెలన్నర క్రితం విశాఖ మధురానగర్ ద్వారకలోని ఓ ఇంట్లో చోరీ చేశాడు. ఆ బంగారాన్ని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.12(Banjara Hills Road No. 12)లో నివాసం ఉంటున్న సోదరి భాగ్యమ్మ, అల్లుడు అశోక్‌కు ఇచ్చాడు. ఈ బంగారాన్ని విక్రయించిన అశోక్ తన ప్రియురాలితో ఎంజాయి చేసేందుకు ఎస్‌ఆర్‌నగర్‌కు వచ్చాడు. ఈస్ట్ శ్రీనివాసనగర్‌లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ద్విచక్ర వాహనంపై వచ్చిన అశోక్‌ను ఆపి వివరాలు అడిగారు. '
దీంతో పొంతన లేని సమాదానం చెప్పడంతో అతడి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేశారు. ఇందులో రూ.3.40 లక్షల నగదు, ఎయిర్ పిస్టల్, 8 తులాల బంగారం లభించింది. వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన రీతిలో విచారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..
Operation Sindoor: 300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత
Operation Sindoor: సిందూరమే.. సంహారమై
CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు
Read Latest Telangana News and National News
Updated Date - May 08 , 2025 | 07:13 AM