Hyderabad: అయ్యోపాపం.. ఎంత ఘోరం జరిగిందో..
ABN, Publish Date - May 08 , 2025 | 09:37 AM
మంటల్లో చిక్కుకుని కొరియోగ్రాఫర్ మృతిచెందిన విషాద సంఘటన ఇది. ఇంట్లో ఉన్న ఏసీకి షార్ట్ సర్య్కూట్ కావడంతో ఇళ్లంతా పొగ అలుముకుంది. అలాగే మంటలు కూడా వ్యాపించాయి. ఓపక్క పొగ, మరోపక్క మంటలతో ఇంట్లో నిద్రిస్తున్న పోరేటి వీరేందర్‌రెడ్డి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
- మంటల్లో చిక్కుకుని కొరియోగ్రాఫర్ మృతి
- ఏసీకి షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం
హైదరాబాద్: ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఏసీకి షార్ట్ సర్య్కూట్ కారణంగా పుప్పాల్‌గూడ(Puppalguda)లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని ఓ సినీ కొరియోగ్రాఫర్(Film choreographer) అగ్నికి ఆహుతైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పుప్పాల్‌గూడ శ్రీనగర్‌కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో సినీ కొరియోగ్రాఫర్ పోరేటి వీరేందర్‌రెడ్డి (38) ఉంటున్నాడు. గత రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా, షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఏసీ మిషన్‌కు మంటలు అంటుకున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చి.. చివరకు..
గదిలో దట్టమైన పొగ, మంటలు వ్యాపించడాన్ని వీరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రకాష్‌రెడ్డి (76), విజయ(60), మౌతిక (14), నిశాంత్‌రెడ్డి (8) గమనించారు. 100కు, ఫైర్ కార్యాలయానికి సమాచారం అందించారు. నిద్రలో ఉన్న వీరేందర్ రెడ్డి(Veerendhar Reddy) పొగకు ఊపిరాడక స్పృహకోల్పోయాడు. పోలీసులు సీపీఆర్ చేసినా లాభం లేకుండా పోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. నార్సింగ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..
Operation Sindoor: 300 విమానాల రద్దు 25 విమానాశ్రయాల మూసివేత
Operation Sindoor: సిందూరమే.. సంహారమై
CM Revanth Reddy: అత్యవసర సర్వీసుల సిబ్బంది సెలవులు రద్దు
Read Latest Telangana News and National News
Updated Date - May 08 , 2025 | 09:37 AM