ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru: మాజీ ఎంపీ డీకే సురేష్‌ భార్యనంటూ.. సోషల్‌ మీడియాలో ప్రచారం

ABN, Publish Date - May 02 , 2025 | 11:41 AM

నేను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తమ్ముడు డీకే సురేష్ భార్యను.. అంటూ సోషల్ మీడియాలో హల్‏చల్ చేసిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పవిత్ర అనే మహిళ డీకే సురేష్ భార్యగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టులు పెడుతోంది. అయితే.. దీనిపై పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

- సోషల్‌ మీడియాలో ప్రచారం

- కనకపుర తాలూకాలో మహిళ అరెస్టు

బెంగళూరు: డీసీఎం డీకే శివకుమార్‌(DK Shivalumar) తమ్ముడు, మాజీ ఎంపీ డీకే సురేష్‌(DK Suresh) భార్యగా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకున్న మహిళను రామనగర్‌ జిల్లా సెన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కనకపుర(Kanakapura) తాలూకా దొడ్డఆలహళ్ళికి చెందిన పవిత్ర(Pavitra) అనే మహిళ ప్రస్తుతం మైసూరులో నివసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: న్యూఢిల్లీలో రెడ్ అలర్ట్..విమాన సర్వీసులపై ఎఫెక్ట్


ఏప్రిల్‌ 8న పవ్రిత తన సోషల్‌ మీడియా ఖాతాలు పవిత్ర డీకే సురేష్‌ దొడ్డాలహళ్ళి పేరుతో ఉండే ఫేస్‌బుక్‌ ద్వారాను, పవిత్ర 256 అనే ఇన్‌స్టాఖాతా ద్వారా వీడియోలు పోస్టు చేశారు. డీకే సురేష్‌ భార్యను అంటూ చెప్పుకున్న ఆమె నాకు స్టేటస్‌ కావాలన్నారు. ఇద్దరి ఫొటోలను ఎడిట్‌ చేసి పోస్టు చేశారు. వీడియోలు వైరల్‌ కావడంతో డీకే సురేష్‌ తరుపు న్యాయవాది ప్రదీప్‌ రామనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


రాజకీయాల్లో ఉండే డీకే సురేష్‌ పరువుకు భంగం కలుగుతోందని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రామనగర్‌ సెన్‌ పోలీసులు వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. పవిత్రను అరెస్టు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం మండ్య జిల్లా జైలుకు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

Gold Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత

Read Latest Telangana News and National News

Updated Date - May 06 , 2025 | 07:27 AM