Hyderabad: అమ్మో.. రూ. 14.50 లక్షలు కొల్లగొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..
ABN, Publish Date - May 28 , 2025 | 07:07 AM
హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ తరహ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసానికి బలైపోయాడు. మొత్తం రూ.14.50లక్షలు నష్టపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- రూ. 14.50 లక్షలు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్
హైదరాబాద్ సిటీ: రూ. కోటి బిజినెస్ లోన్ ఇప్పిస్తామని ఓ వ్యాపారి నెత్తిన శఠగోపం పెట్టిన సైబర్ నేరగాళ్లు అతని నుంచి రూ. 14.50లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తి ట్రావెల్ బిజినెస్ చేస్తుంటాడు. వ్యాపార రుణాలు ఇప్పిస్తామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోన్ నంబర్లు కనిపించడంతో బాధితుడు సంప్రదించాడు.
వ్యాపారాభివృద్ధికి రూ. కోటి రుణం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌లో తీసుకుని లోన్ ప్రాసె్‌సలో ఉందంటూ ప్రాసెసింగ్ ఫీజు కింద మొదట కొంత డబ్బు తీసుకున్నాడు. లోన్‌కు ఆమోదం లభించిందంటూ మరికొంత, వివిధ రకాల బ్యాంకు చార్జీలు, ఇతర ఖర్చులు అంటూ విడతలవారీగా రూ.14.50లక్షలు కొల్లగొట్టాడు. అయినప్పటికీ లోన్ రాకపోవడంతో అతన్ని నిలదీయగా స్పందించడం మానేశాడు. దాంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..
Miss World 2025: మిస్ వరల్డ్ ఫైనల్స్... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు
Read Latest Telangana News and National News
Updated Date - May 28 , 2025 | 07:07 AM