ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: థమ్సప్‌ అడిగి.. చైన్‌ స్నాచింగ్‌

ABN, Publish Date - Aug 06 , 2025 | 10:07 AM

థమ్సప్‌ ఇవ్వండని అడిగి దుకాణ మహిళా యజమాని మెడలోంచి మంగళసూత్రం లాక్కొని ఓ ముసుగుదొంగ పరారయ్యాడు. ఈ సంఘటన ఓల్డ్‌ బోయినపల్లి మణికంఠ కాలనీలో కలకలం రేపింది. బాధితురాలు నాగలక్ష్మి, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

- మహిళ మెడలోని మంగళసూత్రంతో పరార్‌

- బోయినపల్లిలో ఘటన

హైదరాబాద్: థమ్సప్‌ ఇవ్వండని అడిగి దుకాణ మహిళా యజమాని మెడలోంచి మంగళసూత్రం లాక్కొని ఓ ముసుగుదొంగ పరారయ్యాడు. ఈ సంఘటన ఓల్డ్‌ బోయినపల్లి మణికంఠ కాలనీలో కలకలం రేపింది. బాధితురాలు నాగలక్ష్మి, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓల్డ్‌ బోయినపల్లి మణికంఠకాలనీలో నివాసం ఉంటున్న నాగలక్ష్మి తన ఇంట్లో కిరాణ దుకాణం నడుపుతోంది.

సోమవారం సాయంత్రం జోరుగా వర్షం పడుతుండటంతో వర్షాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న ఓ దొంగ కిరాణా షాపునకు వచ్చి థమ్సప్‌ అడిగి తాగుతున్నట్లు నటించాడు. బిస్కెట్‌ ప్యాకెట్‌ కావాలని అడిగాడు. బిస్కెట్‌ ప్యాకెట్‌ ఇచ్చేలోపు ఆమె మెడలోని రెండున్నర తులాల మంగళసూత్రం తెంపుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న ఆమె అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించగా..

ఆ దొంగ ఆమెను తోసేసి దుకాణ షట్టర్‌ను కిందకి దింపి బైక్‌పై పరారయ్యాడు. దొంగ హెల్మెట్‌, రెయిన్‌కోటు ధరించి ఉన్నాడని, పల్సర్‌ బైక్‌పై పారిపోయినట్లు స్థానికులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇదే కిరాణం దుకాణం వద్ద నాలుగు రోజుల క్రితం పార్క్‌ చేసిన ఓ కార్‌ కెమెరాలు దొంగతనానికి గురైనట్లు స్థానికులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్‌ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 06 , 2025 | 10:07 AM