ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: చంపి ఇంట్లోనే తగులబెట్టారు...

ABN, Publish Date - May 09 , 2025 | 08:53 AM

ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి ఇంట్లోనే తగులబెట్టిన విషయం నగరంలో వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న ఆ మహిళను ఎవరు హత్య చేశారన్నదానిపై పోలీసులు పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- ఒంటరి మహిళ దారుణహత్య

హైదరాబాద్: ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి ఆపైన నిప్పు పెట్టి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి చాంద్రాయణగుట్ట పోలీస్‏స్టేషన్‌(Chandrayangutta Police Station) పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ రౌతు గోపీ తెలిపిన వివరాల ప్రకారం. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన కేతావత్‌ బుజ్జి అలియాస్‌ లక్ష్మి(40) కేశవగిరి హిల్స్‌ ప్రాంతంలో ఏడేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకుంటోంది. లేబర్‌ అడ్డా మీద కూలి పనికి వెళ్లేది.

ఈ వార్తను కూడా చదవండి: JNTU: టీసీఎస్‏తో జేఎన్‌టీయూ అవగాహన


భర్త రూప్లా పెళ్ళయిన ఐదేళ్లకే మృతిచెందాడు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. ఇదిలావుండగా రోజుమాదిరిగానే బుజ్జి బుధవారం కూడా పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చింది. చుట్టుపక్కల ఇళ్లల్లో కూడా అందరూ కూలీలే నివాసముంటున్నారు. అందరూ రాత్రి భోజనాలు ముగించుకొని నిద్రపోయారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఇంట్లోనుంచి పొగ రావడం గమనించిన స్థానికులు నీళ్లుచల్లి మంటలను ఆర్పివేశారు. అందరూ సాధారణ అగ్నిప్రమాదమే అనుకున్నారు.


మంటలను ఆర్పిన తర్వాత లోపలికి వెళ్లి చూడగా కేతావత్‌ బుజ్జి చనిపోయి ఉంది. మృతదేహం కాలుతూ ఉంది. వెంటనే డయల్‌ 100కు కాల్‌ చేశారు. నైట్‌ డ్యూటీలో ఉన్న సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత, బండ్లగూడ ఇన్‌స్పెక్టర్‌ గుర్నాద్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహిళ గొంతు కోసి ఉంది. స్థానికులు మంటలను ఆర్పివేయడంతో మృతదేహం స్వల్పంగా కాలిపోయింది. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Breaking News: భారత్-పాక్ యుద్ధంపై చైనా తాజా రియాక్షన్ ఇదే..

ToDay Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

నవ్వించడమే సింగిల్‌ లక్ష్యం

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ చనిపోయాడా ..?

Operation Sindoor: యుద్ధ బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - May 09 , 2025 | 08:53 AM