Share News

Breaking News: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ పేలుళ్లు.

ABN , First Publish Date - May 08 , 2025 | 10:23 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ పేలుళ్లు.
Breaking News

Live News & Update

  • 2025-05-11T00:41:20+05:30

    • సంక్షోభ సమయంలో చైనా మనకు అండగా నిలిచింది: ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

    • పాకిస్థాన్‌లో ఆధిపత్య పోరు

    • పాకిస్థాన్‌లో ప్రధాని వర్సెస్‌ ఆర్మీ చీఫ్‌

    • ట్రంప్‌నకు థ్యాంక్స్‌ అంటూ పాక్‌ ప్రధాని షెహబాజ్‌ పోస్ట్‌

    • కాల్పుల విరమణ సరికొత్త ప్రారంభానికి నాంది అంటూ.. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యలు

    • షెహబాజ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ తర్వాత కాసేపటికే పాక్ డ్రోన్ దాడులు

    • మునీర్ డైరెక్షన్‌లో డ్రోన్ దాడులకు పాక్ తెగబడిందా అని అనుమానం

  • 2025-05-11T00:36:14+05:30

    • జమ్మూకశ్మీర్‌: నగ్రోటా దగ్గర చొరబాటుకు యత్నం

    • నగ్రోటా దగ్గర కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్‌

    • చొరబాటుదారులతో కాల్పుల్లో గాయపడ్డ జవాను

  • 2025-05-11T00:35:37+05:30

    • సరిహద్దు రాష్ట్రాల ప్రిన్సిపల్‌ సెక్రటరీలతో..

    • కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ చర్చలు

    • ఆత్మరక్షణలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు ఆదేశం

  • 2025-05-11T00:34:45+05:30

    • జమ్మూకశ్మీర్‌: నగ్రోటా దగ్గర అనుమానాస్సద కదలికలు

    • నగ్రోటా దగ్గర కొనసాగుతోన్న సెర్చ్ ఆపరేషన్‌

  • 2025-05-11T00:34:05+05:30

    • కాల్పుల విరమణ ఒప్పందం..

    • ఉల్లంఘనకు పాకిస్థాన్‌ బాధ్యత వహించాలి: విక్రమ్‌ మిస్రీ

    • కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ వరుసగా ఉల్లంఘిస్తోంది

    • సరిహద్దుల దగ్గర పరిణామాలను ఆర్మీ నిశితంగా గమనిస్తోంది

    • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించకుండా పాక్ చర్యలు తీసుకోవాలి

    • ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని భారత ఆర్మీకి ఆదేశాలు

    • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే..

    • చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం: విక్రమ్‌ మిస్రీ

    • పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుండటంతో..

    • భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది: విక్రమ్‌ మిస్రీ

  • 2025-05-11T00:31:44+05:30

    • పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనను..

    • తీవ్రంగా పరిగణిస్తున్న భారత్: విక్రమ్‌ మిస్రీ

    • కాల్పుల వివరణ ఒప్పందాన్ని పాకిస్థాన్‌ ఉల్లంఘిస్తోంది: విక్రమ్‌ మిస్రీ

    • పాక్‌ చర్యలకు తీవ్రంగా స్పందించడానికి..

    • భారత దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన కేంద్రం: విక్రమ్‌ మిస్రీ

    • పాక్ చర్యలకు భారత్ తగిన రీతిలో బదులిస్తోంది: విక్రమ్‌ మిస్రీ

  • 2025-05-11T00:30:15+05:30

    • కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్‌దే: విదేశాంగ శాఖ

    • వాస్తవ పరిస్థితిని పాక్ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాం: విదేశాంగ శాఖ

    • ఉల్లంఘనలకు పాక్ నిలువరిస్తుందని ఆశిస్తున్నాం: విదేశాంగ శాఖ

    • ఉల్లంఘనలు నిలువరించేందుకు సైన్యం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది

    • సరిహద్దుల్లో పాక్‌ ఉల్లంఘనలకు సైన్యం తగిన విధంగా జవాబిస్తుంది

    • ఉల్లంఘనలు నియంత్రించేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది

    • ఉల్లంఘనలు నిలువరించేందుకు సైన్యం సంపూర్ణ అధికారం కలిగి ఉంది

    • ఉల్లంఘనలు తిప్పికొట్టేందుకు సైన్యానికి అవసరమైన ఆదేశాలు అందాయి

    • పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది: విదేశాంగ శాఖ

    • ఒప్పందాన్ని ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గం: విదేశాంగ శాఖ

  • 2025-05-11T00:27:24+05:30

    • జమ్మూకశ్మీర్ నగ్రోటా దగ్గర సెర్చ్ ఆపరేషన్‌

    • నగ్రోటాలో ఆర్మీ యూనిట్‌పై కాల్పులు జరిగినట్లు అనుమానం

  • 2025-05-11T00:26:14+05:30

    • పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించిన కేంద్రం

    • సరిహద్దుల దగ్గర సాయుధ దళాలు గట్టి నిఘా: కేంద్రం

    • అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట..

    • సరిహద్దుల దగ్గర ఉల్లంఘనలు పునరావృతమైతే..

    • సమర్థంగా ఎదుర్కోవాలని కేంద్రం ఆదేశం

  • 2025-05-11T00:25:41+05:30

    • విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

    • పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంపై స్పందించిన కేంద్రం

    • సాయుధ దళాలు పరిస్థితిపై గట్టి నిఘా ఉంచాయి అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దుల ఉల్లంఘనలు పునరావృతమయ్యే సందర్భాలను గట్టిగా ఎదుర్కోవాలని ఆదేశాలు ఇచ్చాము.

  • 2025-05-11T00:25:02+05:30

    • కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది: మిస్రీ

    • పాకిస్థాన్ దాడుల‌ను స‌మ‌ర్థంగా తిప్పికొట్టాం: మిస్రీ

    • ప‌రిస్థితిని ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నాం: విక్రమ్‌ మిస్రీ

  • 2025-05-10T23:49:31+05:30

    ఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌వీకి దోవ‌ల్ ఫోన్‌

    • యుద్ధం భార‌త్ అభిమ‌తం కాదు: దోవ‌ల్‌

    • రెండు దేశాలు సంయ‌మ‌నం పాటిస్తాయ‌నుకుంటున్నాం: చైనా

    • ఉగ్రవాదంపై కౌంట‌ర్ ఎటాక్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది: దోవ‌ల్

  • 2025-05-10T23:49:30+05:30

    LoC ద‌గ్గర ప్రస్తుతం కాల్పులు జ‌ర‌గ‌డం లేదు: భార‌త ఆర్మీ

    • శ్రీన‌గ‌ర్‌లో పేలుళ్లు జ‌ర‌గ‌డం లేదు: భార‌త ఆర్మీ

    • డ్రోన్లు వ‌చ్చిన మాట వాస్తవ‌మే: భార‌త ఆర్మీ

    • వీటిలో చాలా డ్రోన్లు వెన‌క్కి వెళ్లిపోయాయి: భార‌త ఆర్మీ

    • ముందుజాగ్రత్త చ‌ర్యగా ప‌లు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్

    • ఎల్‌ఓసీ ద‌గ్గర పాకిస్థాన్ కాల్పుల‌ను ఆపేసింది: భార‌త ఆర్మీ

  • 2025-05-10T23:00:40+05:30

    ఆపరేషన్ సింధూర్ మీద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్పెషల్ బ్రీఫింగ్

    భారత్ - పాక్ సరిహద్దుల్లో పాక్‌ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. పాక్ సీజ్ ఫైర్ కు తూట్లుపొడిచి దాడులకు దెగబడుతున్న నేపథ్యంలో విదేశాంగశాఖ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి ప్రకటన చేసింది. సాయుధ దళాలు పరిస్థితిపై గట్టి నిఘా ఉంచాయని, అంతర్జాతీయ సరిహద్దు-నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దు ఉల్లంఘనలు పునరావృతమైతే కఠినంగా వ్యవహరించాలని వారికి సూచించామని మిస్రి తెలిపారు. కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘించడం సరికాదన్న మిస్రీ.. డీజీఎంవోల మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

    కాల్పుల విరమణను కొన్ని గంటలుగా పాక్‌ ఉల్లంఘిస్తోందని, ఒప్పందాన్ని ఉల్లంఘించడం అత్యంత దుర్మార్గమని మిస్రి అన్నారు. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్‌దే అని, ఉల్లంఘన నిరోధించడానికి సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు. ఈ ఉల్లంఘనలను పాక్‌ నిలువరిస్తుందని ఆశిస్తున్నామని, ఉల్లంఘనలను నిలువరించేందుకు సైన్యం బాధ్యతాయుతమైన చర్యలకు సిద్ధమైందని మిస్రి స్పష్టం చేశారు.

  • 2025-05-10T22:22:36+05:30

    బిఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎండి ఇంత్యాజ్ వీరమరణం

    "జమ్మూలోని ఆర్ ఎస్ పురా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ జరిపిన సీమాంతర కాల్పుల సమయంలో, 2025 మే 10న దేశ సేవలో బిఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎండి ఇంత్యాజ్ చేసిన అత్యున్నత త్యాగానికి బిఎస్ఎఫ్ డిజి, అన్ని ర్యాంకులు వందనం అర్పిస్తున్నారు.

    ఈ క్లిష్ట సమయంలో ప్రహరీ పరివార్ మృతుల కుటుంబానికి అండగా నిలుస్తున్నారు." అంటూ ఇంత్యాజ్ వీరమరణంపై బీఎస్ఎఫ్ తన ఎక్స్ ఖాతాలో ప్రకటన చేసింది. అటు, బీఎస్ఎఫ్ జమ్ము ఎక్స్ హ్యాండిల్ కూడా ఇంత్యాజ్ మృతికి సంతాపం తెలిపింది.

  • 2025-05-10T21:34:08+05:30

    కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ ఉల్లంఘించిన పాక్

    • సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కవ్వింపు చర్యలు.

    • సీజ్‌ఫైర్‌ అంటూనే కాల్పులకు తెగబడుతున్న పాక్‌ సైన్యం.

    • సరిహద్దుల్లో మళ్లీ దాడులకు తెగబడిన పాక్‌ సైన్యం.

    • సరిహద్దు నగరాలపై పాక్‌ సైన్యం వరుస డ్రోన్‌ దాడులు.

    • జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లో వరుస దాడులు.

    • ఆర్టిలరీ గన్స్‌, డ్రోన్లతో పాక్‌ సైన్యం దాడులు.

    • భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.

    • సైనిక పోస్ట్‌లు, సాధారణ పౌరులే లక్ష్యంగా పాక్‌ సైన్యం కాల్పులు.

    • పాక్‌ సైన్యం దాడులను సమర్థంగా తిప్పికొడుతున్న భారత బలగాలు.

  • 2025-05-10T21:23:45+05:30

    • పంజాబ్‌ గురుద్వారా సమీపంలో డ్రోన్‌ దాడులు

    • ఫిరోజ్‌పూర్‌లో బ్లాక్‌ అవుట్‌ ప్రకటించిన అధికారులు

  • 2025-05-10T21:23:27+05:30

    • ఆర్‌ఎస్‌ పురాలో పాక్‌ సైన్యం కాల్పులు

    • BSF ఎస్ఐ ఇంతియాజ్‌ వీరమరణం

  • 2025-05-10T21:23:02+05:30

    • సైనిక పోస్టులు లక్ష్యంగా పాక్‌ సైన్యం కాల్పులు

    • దీటుగా బదులిస్తున్న భారత బలగాలు

  • 2025-05-10T21:22:44+05:30

    శ్రీనగర్‌లో 4, 5 చోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు

    • జమ్ము, శ్రీనగర్‌, బారాముల్లా పఠాన్‌కోట్‌లో బ్లాక్‌ అవుట్‌

    • రాజస్థాన్‌: బార్మర్‌, జైసల్మేర్‌లో బ్లాక్‌ అవుట్‌

    • తదుపరి ఆదేశాలు వచ్చేవరకు బ్లాక్‌ అవుట్‌ పాటించాలన్న సైన్యం

  • 2025-05-10T21:20:17+05:30

    కాల్పుల విరమణ ముగిసిన కాసేపటికే వక్రబుద్ధిని చూపెట్టిన పాక్..

    • బార్డర్లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్

    • జమ్మూ కాశ్మీర్లో భారీగా పేలుళ్ల శబ్దం

    • ఉదంపూర్ లో పూర్తిగా బ్లాక్ అవుట్

    • నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు పాల్పడుతున్న పాకిస్తాన్

    • జమ్ము కాశ్మీర్లో పేలుల శబ్దం రావడంతో ట్విటర్లో స్పందించిన సీఎం ఒమర్ అబ్దుల్లా

    • కాల్పుల విరమణ ఒప్పందం ఏమైంది అని ట్విట్ చేసిన సీఎం

    • శ్రీనగర్ అంతట పేలుళ్లు వినిపించాయి అంటూ ట్వీట్

  • 2025-05-10T21:12:50+05:30

    పేలుళ్ల వీడియో..

  • 2025-05-10T21:10:45+05:30

    మళ్లీ పేలుళ్ల శబ్ధాలు..

    ట్వీట్ చేసిన జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.

  • 2025-05-10T21:08:29+05:30

    కుక్క తోక వంకర.. పాక్ బుద్ది వంకర..

    • జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ పేలుళ్లు.

    • ఉధంపూర్‌లో పూర్తిగా బ్లాక్‌అవుట్.

    • భారత వైమానిక రక్షణ దళాలు పాకిస్తాన్ డ్రోన్‌లను అడ్డగించడంతో భారీ పేలుళ్ల శబ్దాలు.

  • 2025-05-10T19:12:03+05:30

    కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం: ఒమర్‌ అబ్దుల్లా

    • కాల్పుల విరమణ మూడు రోజుల కిందే జరిగిఉంటే బాగుండేది.

    • జమ్ముకశ్మీర్‌ ప్రజలకు తక్షణ సాయం అందించడం మా బాధ్యత.

    • కాల్పుల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

  • 2025-05-10T19:11:09+05:30

    పాకిస్థాన్ అసత్య ప్రచారం చేసింది: కల్నల్‌ సోఫియా ఖురేషి

    • భారత్‌ దాడుల్లో పాక్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది

    • మసీదులపై దాడి చేశామంటూ అసత్య ప్రచారం చేశారు.

    • దేశాన్ని కాపాడేందుకు సైన్యం ఎప్పుడూ సిద్ధమే.

    • S-400ను ధ్వంసం చేసినట్లు పాక్‌ తప్పుడు ప్రచారం.

    • పాక్‌ దాడిలో భారత ఆర్మీకి ఎక్కడా నష్టం జరగలేదు.

    • భారత సైన్యమే పాక్‌ ఆర్మీ బేస్‌లను ధ్వంసం చేసింది.

  • 2025-05-10T19:08:37+05:30

    పాక్‌ JF-17 ఫైటర్స్‌ భారత్‌పై దాడి చేయలేదు: వ్యోమికా సింగ్‌

    • మీడియా సమావేశాల్లో పాక్‌ అవాస్తవాలు చెప్పింది.

    • ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశాం.

    • మతపరమైన ప్రదేశాలను ఎక్కడా లక్ష్యంగా చేసుకోలేదు.

  • 2025-05-10T18:27:44+05:30

    భారత్‌, పాక్‌ మధ్య తక్షణ కాల్పుల విరమణ: విక్రమ్‌ మిస్రీ

    • కాల్పుల విరమణను ధ్రువీకరించిన భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.

    • మ.3.35కు ఇరుదేశాల DGMOల మధ్య చర్చలు జరిగాయి.

    • DGMOల మధ్య చర్చల తర్వాత కాల్పుల విరమణకు అంగీకారం.

    • సా.5 నుంచే కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది.

    • కాల్పుల విరమణ ప్రతిపాదన పాకిస్థాన్‌దే.

    • ఈనెల 12న సా.5 గంటలకు ఇరుదేశాల DGMOల చర్చలు.

    • ఎల్లుండి ఇరుదేశాల మిలిటరీ జనరల్స్‌ తదుపరి చర్చలు.

  • 2025-05-10T18:25:20+05:30

    చర్చలు ఫలించాయి..

    భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, సైన్యాధిపతి అసిమ్ మునీర్, జాతీయ భద్రతా సలహదారులు అజిత్ దోవల్, అసిమ్ మాలిక్ సహా భారత్, పాకిస్తాన్‌కు చెందిన సీనియ్ అధికారులతో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ డేవిడ్ వాన్స్, తాను 48 గంటలపాటు చర్చలు జరిపాము. ఈ చర్చల్లో పురోగతి లభించింది. తక్షణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. తటస్థ స్థితిలో విస్తృత సమస్యలపై చర్చించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రధాన మంత్రులు మోదీ, షరీఫ్‌లు అనుసరించిన విధానాన్ని అభినందిస్తున్నాం అని మార్కో రూబియో తెలిపారు.

  • 2025-05-10T17:40:18+05:30

    చర్చలు సఫలం.. యుద్ధం ముగిసినట్లేనా..

    • భారత్‌- పాక్‌ యుద్ధంపై ట్రంప్‌ సంచలన ప్రకటన

    • కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి.

    • భారత్‌, పాక్‌ దేశాలకు మధ్యవర్తిత్వం వహించాం.

  • 2025-05-10T17:25:01+05:30

    పాక్‌ 8 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసిన భారత్..

    • భారత్ డ్రోన్ల దాడిలో ధ్వంసమైన పాక్‌ ఎయిర్‌బేస్‌లు

    • ఎటాక్‌ 1: రఫీఖి(షార్‌కోట్) సైనిక స్థావరం

    • ఎటాక్‌ 2: మురీద్(చక్వల్) సైనిక స్థావరం

    • ఎటాక్‌ 3: చక్లాలా(రావల్పిండి) సైనిక స్థావరం

    • ఎటాక్‌ 4: రహీమ్ యార్‌ఖాన్ ఎయిర్‌బేస్‌

    • ఎటాక్‌ 5: సుక్కుర్ ఎయిర్‌బేస్‌

    • ఎటాక్‌ 6: చునియాన్ ఎయిర్‌బేస్‌

    • ఎటాక్‌ 7: సియాల్‌కోట్ ఎయిర్‌బేస్‌

    • ఎటాక్‌ 8: పస్రూర్ రాడార్ కేంద్రం ధ్వంసం చేసిన భారత్‌

  • 2025-05-10T17:13:45+05:30

    పాకిస్థాన్‌కు సీరియస్ వార్నింగ్..

    pm-narendra-modi.jpg

    దేశ భద్రతా విషయంలో మరింత కఠిన వైఖరి ప్రదర్శించాలని అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత ప్రయోజనాలను దెబ్బతీసేలా భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడినా దానిని యుద్ధ చర్యగా పరిగణించాలని సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2025-05-10T16:22:33+05:30

    జమ్మూ కాశ్మీర్‌లోని తెలుగు విద్యార్థుల విజ్ఞప్తి..

    • ఏబీఎన్‌కు జమ్ము కాశ్మీర్‌లో షేరీ కాశ్మిరీ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యర్ధులు అభ్యర్ధన.

    • రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణం స్పందించాలని కోరిన విద్యర్ధులు.

    • కాకినాడ, అనంతపూర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన 8 మంది.

    • తెలంగాణ భూపాలపల్లి, నాకర్ కర్నూల్, నల్గోండ, జగిత్యాలకు చెందినవారు ఏడుగురు.

    • ప్రస్తుతం శ్రీనగర్ నుండి జమ్మూ బయలు దేరిన విద్యార్ధులు.

    • తమకు జమ్ము నుండి ఢిల్లీ వరకూ అయినా ట్రైన్‌లో టికెట్లు ఇచ్చి ఏర్పాట్లు చేయాలని విజ్జప్తి.

  • 2025-05-10T16:11:17+05:30

    త్రివిధ దళాధిపతులతో భేటీలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం

    • పాక్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    • ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణించాలని ప్రధాని పేర్కొన్నట్లు సమాచారం.

  • 2025-05-10T15:51:54+05:30

    ఢిల్లీ: కాసేపట్లో విదేశాంగ శాఖ ప్రెస్‌మీట్‌

    • కల్నల్‌ సోఫియా ఖురేషి

    • వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌

    • విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌

    • విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ

  • 2025-05-10T15:49:25+05:30

    పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ అసదుద్దీన్‌ ఒవైసీ..

    • భారత భూమి కోసం ప్రాణాలు అర్పిస్తాం.

    • పాక్‌ దాడులపై భారత్‌ వెనక్కి తగ్గేది లేదు.

    • దేవుడి దయతో మనం భారత్‌లో జన్మించాం.

    • పవిత్ర మాసంలో చిన్నపిల్లలు, అమాయకులను చంపే.. పాక్‌కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు.

    • అమాయకులు, చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదు.

    • ఇస్లాం పేరుతో పాక్‌ అసత్య ప్రచారం చేస్తోంది.

  • 2025-05-10T15:44:47+05:30

    బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న వీర జవాన్ మురళి నాయక్ భౌతిక కాయం.

    • బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో మురళి నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మంత్రి సవిత.

    • బెంగళూరు ఎయిర్ పోర్ట్ నుంచి మురళి నాయక్ స్వగ్రామం కల్లి తండాకు భౌతికకాయాన్ని తీసుకువస్తున్న మంత్రి సవితతో పాటు, సత్యసాయి జిల్లా అధికారులు.

    • ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కొడికొండ చెక్‌పోస్ట్ నుంచి భారీ ర్యాలీతో మురళి నాయక్ స్వగ్రామం వరకు తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున వస్తున్న స్థానికులు.

  • 2025-05-10T15:40:31+05:30

    సజావుగా హెలికాప్టర్ సేవలు..

    చార్ ధామ్ యాత్రకు సంబంధించిన హెలికాప్టర్ సేవలు రాష్ట్రంలో సజావుగా నడుస్తున్నాయి. కొన్ని NOC, క్లియరెన్స్ సంబంధిత సమస్యల కారణంగా కొంత సమయం నిలిపివేయడం జరిగింది అని ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ CEO సోనికా చెప్పారు.

  • 2025-05-10T15:35:40+05:30

    జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు హోంమంత్రి అనిత..

    • అమరావతి: ఆదివారం జరిగే జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలకు హాజరుకానున్న హోంమంత్రి అనిత.

    • పాక్ కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్ మురళి నాయక్ అంత్యక్రియలకు హోంమంత్రి వంగలపూడి అనిత హాజరు కానున్నారు.

    • శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లి తాండ స్వగ్రామానికి మురళి నాయక్ భౌతికకాయం చేరనుంది.

    • గుమ్మయ్యగారిపల్లి నుంచి భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం ఆదివారం అంత్యక్రియలు.

    • పాక్ జరిపిన కాల్పుల్లో మరణించిన నేపథ్యంలో అధికారిక, సైనిక లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐ.టీ శాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు హోంమంత్రి అనిత హజరు.

    • మురళీ నాయక్ పార్థివదేహానికి నివాళి అర్పించనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు.

  • 2025-05-10T15:33:13+05:30

    టర్కీ కాన్సులేట్‌ కార్యాలయం దగ్గర భారీ భద్రత

    • హైదరాబాద్‌: టర్కీ కాన్సులేట్‌ కార్యాలయం దగ్గర భారీ భద్రత.

    • టర్కీ కాన్సులేట్ జనరల్‌ దగ్గర కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు.

    • నిన్న పాక్‌ ప్రయోగించిన టర్కీ మేడ్‌ డ్రోన్లను కూల్చిన బలగాలు.

    • టర్కీ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం దగ్గర.. ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున పటిష్ట పోలీస్‌ బందోబస్తు.

  • 2025-05-10T15:12:15+05:30

    పాక్ ఆర్మీపై విరుచుకుపడ్డ బలూచ్ లిబరేషన్ ఆర్మీ..

    • 39చోట్ల మెరుపు దాడులు చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA).

    • ఈ దాడుల్లో పాకిస్థాన్ సైనిక స్థావరాలు, గ్యాస్ పైప్లైన్లు, ప్రధాన రహదారులు లక్ష్యంగా మారినట్లు సమాచారం.

    • బలోచిస్తాన్‌లోని కాలాత్ జిల్లాలోని మాంగోచర్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న BLA ప్రత్యేక బృందం 'ఫతే స్క్వాడ్'.

    • దీంతో పాటు, ఖజినాయ్ హైవేను మూసివేసి, స్థానిక పోలీసులను తాత్కాలికంగా అదుపులోకి తీసుకున్న బిఎల్ఏ.

    • కొన్ని గంటల తరువాత వారిని విడుదల చేసిన బిఎల్ఏ.

    • BLA దాడుల్లో పాకిస్థాన్ సైనికులకు భారీగా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.

    • కచ్చి జిల్లాలో జరిగిన రోడ్‌సైడ్ బాంబు దాడిలో ఏడుగురు పాక్ సైనికులు మరణం.

    • గత కొన్ని రోజులుగా బలూచిస్తాన్‌లో పెరుగుతున్న హింస.

  • 2025-05-10T15:09:48+05:30

    చనిపోయిన టాప్ ఉగ్రవాదులు వీరే..

    ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల పేర్లు తాజాగా బయటకు వచ్చాయి. లిస్ట్‌లో మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2025-05-10T15:07:13+05:30

    పాక్ భయం.. ఆ దేశ ఉపప్రధాని కీలక ప్రతిపాదన..

    భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్ కీలక కామెంట్స్ చేశారు. యుద్ధంపై కీలక ప్రతిపాదన ముందుకు తెచ్చారు. భారత్ దాడులను తట్టుకోలేక.. యుద్ధం ఆపాలంటూ ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చారు.

  • 2025-05-10T00:00:48+05:30

    ఎల్‌ఇటి చీఫ్ హఫీజ్ సయీద్ మాజీ గార్డు చెప్పిన సంచలన విషయాలు:

    లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) చీఫ్ హఫీజ్ సయీద్ మాజీ గార్డు నూర్ దహ్రీ సదరు ఉగ్రవాద సంస్థ గురించి చాలా విషయాలు చెప్పాడు. చాలా మంది యువకులు ఎల్‌ఇటి చీఫ్ ప్రసంగాలకు ప్రేరేపించబడి ఉగ్రవాద సంస్థలో చేరారని చెప్పాడు. ఈ యువకులంతా తరువాత ఆఫ్ఘనిస్తాన్, భారతదేశంలోని కాశ్మీర్‌కు వెళ్లారని చెప్పాడు. అయితే, వారిలో ఎక్కువ మంది తిరిగి రాలేదని పేర్కొన్నాడు.వేలాది మంది పాకిస్తాన్ పౌరుల మరణాల వెనుక ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉందని చెప్పాడు. దహ్రీ సదరు ఉగ్రవాద సంస్థను 'డెత్ కల్ట్' అని అభివర్ణించాడు.

  • 2025-05-09T23:23:51+05:30

    నేను ఉన్న చోట నుండి అడపాదడపా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయ్: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా

    "జమ్మూలో ఇప్పుడు బ్లాక్‌అవుట్.. నగరమంతటా సైరన్‌లు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చీకటే. అంతేకాదు, నేను ఉన్న చోట నుండి అడపాదడపా పేలుళ్ల శబ్దాలు, బహుశా భారీ ఫిరంగిదళాలు, ఇప్పుడు వినబడుతున్నాయి. జమ్మూలో ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే..

    దయచేసి వీధుల్లోకి రాకండి. ఇంట్లోనే ఉండండి. రాబోయే కొన్ని గంటల పాటు మీరు సురక్షితమైన ప్రదేశంలో ఉండండి. పుకార్లను నమ్మకండి. ఆధారాలు లేని లేదా ధృవీకరించని కథనాలను వ్యాప్తి చేయవద్దు. మనం కలిసి దీనిని అధిగమిస్తాం. అని జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ ఖాతాలో ప్రజలకు విన్నవించారు.

  • 2025-05-09T22:33:44+05:30

    ఎయిరిండియా కీలక ప్రకటన

    • సరిహద్దు ప్రాంతాలకు సర్వీస్‌లు నిలిపివేత

    • జమ్ము, శ్రీనగర్‌, లేహ్‌, జోధ్‌పూర్‌, అమృత్‌సర్‌

    • చండీగఢ్‌, భుజ్‌, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌కు

    • ఈనెల 15 వరకు AI విమాన సర్వీస్‌లు రద్దు

  • 2025-05-09T21:57:59+05:30

    ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత మిసైల్ దాడులతో అక్కడి పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా నిలిచిపోయింది. అయితే, మిగతా మ్యాచ్‌లు యఏఈలో నిర్వహించాలనుకున్న ప్లాన్ వర్కవుటయ్యేలా కనిపించట్లేదు.

    మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 2025-05-09T21:57:10+05:30

    భారత్‌లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ దాడులను భారత్ సైన్యం తిప్పికొట్టింది. అందుకు భారత సైన్యం అంబులపొదిలోని ఆకాశ్ క్షిపణులు అత్యంత కీలకంగా వ్యవహరించాయి. ఈ ఆకాశ్ క్షిపణుల తయారీలో తెలుగు వ్యక్తి కీలకంగా వ్యవహరించారు.

    మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 2025-05-09T21:56:20+05:30

    పాకిస్తాన్ ఒకవైపు భారత్‌పై డ్రోన్, మిసైల్ దాడులతో గందరగోళంలో ఉంటే, మరోవైపు బలూచిస్తాన్‌లో తిరుగుబాటుదారులు పాక్ సైన్యంపై దాడులను ముమ్మరం చేశారు. బలూచ్ యోధులు మూడు సమూహాలుగా విడిపోయి, పాకిస్తాన్‌లోని పశ్చిమ ప్రాంతమైన బలూచిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు.

    మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 2025-05-09T21:56:19+05:30

    భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మీద ప్రపంచ దేశాలు కన్నేశాయి. ముఖ్యంగా చైనా, అమెరికా, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయెల్ ఈ యుద్ధంపై డేగ కన్ను వేశాయి. ఎందుకంటే, ఇప్పటికే నిరూపితమైన పాశ్చాత్య యుద్ధ సామాగ్రికి వ్యతిరేకంగా అధునాతన చైనా సైనిక సాంకేతికత ఎలా పనిచేస్తుందో తెలిసొచ్చే సమయం కావడంతో దీనిపై అన్ని దేశాలు ప్రత్యేక దృష్టి సారించాయి.

    మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 2025-05-09T21:56:18+05:30

    భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం చీకటి పడడంతో పాక్ మళ్లీ కాల్పులకు తెగబడుతూ.. డ్రోనులతో దాడులు చేస్తోంది. యూరీ, కుప్వారా, పూంఛ్‌, నౌగామ్‌ సెక్టార్లలో.. పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ ఎంత వేగంగా కాల్పులు జరుపుతుందో.. భారత్ అంతే వేగంతో వాటిని సమర్థవంతంగా తిప్పికోడుతోంది.

    మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

  • 2025-05-09T21:50:41+05:30

    ముగిసిన కీలక భేటీ..

    • ఢిల్లీ: ప్రధాని మోదీ నివాసంలో ముగిసిన కీలక భేటీ

    • సరిహద్దులో తాజా పరిణామాలను ప్రధానికి వివరించిన త్రివిధ దళాధిపతులు

  • 2025-05-09T21:11:25+05:30

    మోగిన సైరన్లు, బ్లాక్‌ అవుట్‌..

    • జైసల్మేర్‌, యూరీలో మోగిన సైరన్లు, బ్లాక్‌ అవుట్‌

    • హర్యానా పంచకులలో బ్లాక్‌ అవుట్‌

    • పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బ్లాక్‌ అవుట్‌

    • జమ్మూ, అఖ్నూర్‌లో మోగిన సైరన్లు, బ్లాక్‌ అవుట్‌

    • జమ్మూకశ్మీర్, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ సరిహద్దుల్లో హై అలర్ట్‌

  • 2025-05-09T21:10:46+05:30

    ఎయిర్‌పోర్టులు మూసివేత

    • ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో IAF కీలక నిర్ణయం

    • ఉత్తర, పశ్చిమ భారత్‌లోని ఎయిర్‌పోర్టులు మూసివేత

    • ఈనెల 10 నుంచి 15 వరకు 28 ప్రధాన ఎయిర్‌పోర్టులు మూసివేత

  • 2025-05-09T21:09:36+05:30

    సరిహద్దుల్లో ఉద్రిక్తత..

    • భారత్‌, పాక్‌ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

    • జమ్మూకశ్మీర్‌లో డ్రోన్‌ దాడులకు పాక్‌ విఫలయత్నం

    • సాంబా, పఠాన్‌కోట్‌లో సెక్టార్లలో పాక్‌ డ్రోన్లు కూల్చివేసిన సైన్యం

    • పాక్ వైపు నుంచి వచ్చిన అన్ని డ్రోన్లను కూల్చివేసిన భారత్ సైనికులు

  • 2025-05-09T20:29:36+05:30

    భారీ అగ్నిప్రమాదం..

    • హైదరాబాద్‌: చందానగర్‌ సెంట్రో స్టోర్‌లో అగ్నిప్రమాదం

    • ఎగసిపడుతున్న మంటలు, అదుపుచేస్తున్న ఫైర్‌ సిబ్బంది

    • షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

  • 2025-05-09T20:28:23+05:30

    భారీ కాల్పులు..

    • జమ్మూకశ్మీర్‌: యురి సెక్టార్‌లో భారీగా కాల్పులు

    • LoC వెంబడి కాల్పులకు తెగబడుతున్న పాక్‌

    • సమర్థంగా తిప్పికొడుతున్న భారత బలగాలు

  • 2025-05-09T20:27:40+05:30

    ఎయిరిండియా కీలక ప్రకటన..

    • సరిహద్దు ప్రాంతాలకు సర్వీస్‌లు నిలిపివేత

    • జమ్ము, శ్రీనగర్‌, లేహ్‌, జోధ్‌పూర్‌, అమృత్‌సర్‌, చండీగఢ్‌, భుజ్‌, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌కు ఈనెల 15 వరకు AI విమాన సర్వీస్‌లు రద్దు

  • 2025-05-09T20:27:03+05:30

    సెలవులు రద్దు..

    • ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు, సిబ్బందికి సెలవులు రద్దు

    • ఆరోగ్య కారణాలు మినహా ఏ ఒక్కరికీ సెలవులు మంజూరు చేయకూడదని నిర్ణయం

  • 2025-05-09T20:26:25+05:30

    కేంద్రం దీటైన జవాబు..

    • పాక్‌ పైశాచికత్వాని కేంద్రం దీటైన జవాబు ఇచ్చింది: రఘునందన్‌

    • పాక్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలి: ఎంపీ రఘునందన్‌

    • మహిళల సారథ్యంలోనే పాక్‌ దాడులు చేశాం: ఎంపీ రఘునందన్‌

  • 2025-05-09T20:25:35+05:30

    ముగిసిన భేటీ..

    • ఉన్నతాధికారులతో ముగిసిన భట్టి విక్రమార్క సమావేశం

    • పోలీసులు సమగ్ర యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలి: భట్టి

    • అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలి: భట్టి

    • ప్రజలకు అవగాహన కోసం మాక్‌ డ్రిల్‌ చేపట్టాలి: భట్టి

    • తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు: భట్టి

  • 2025-05-09T20:25:05+05:30

    రేపటి నుంచే..

    • హైదరాబాద్‌: రేపటి నుంచి మిస్‌ వరల్డ్‌ పోటీలు

    • మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారీ భద్రత ఏర్పాటు

    • పోటీదారుల విడిది కేంద్రాల్లో మూడంచెల భద్రత

  • 2025-05-09T20:24:31+05:30

    రికార్డ్ ధర..

    • తిరుపతి: తుడా టవర్స్‌లో వాణిజ్య గదుల వేలం

    • రూ.34 కోట్లకు 5 గదులు దక్కించుకున్న బ్రాండెడ్‌ కంపెనీలు

  • 2025-05-09T19:21:54+05:30

    ధర్మ యుద్ధానికి మద్దతు ఇవ్వండి: పవన్ కల్యాణ్

    • పాక్‌పై ధర్మయుద్ధానికి అందరి మద్దతు అవసరం: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

    • శత్రు మూకలను కట్టడి చేసి దేశాన్ని కాపాడగలిగే శక్తిసామర్థ్యాలు మన బలగాలకు ఉన్నాయి: పవన్‌ కల్యాణ్‌

  • 2025-05-09T19:20:54+05:30

    ప్రధాని కీలక భేటీ..

    • ఢిల్లీ: ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ

    • ప్రధానితో త్రివిధ దళాధిపతులు సమావేశం

    • సరిహద్దు భద్రత, ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చ

    • పాల్గొన్న త్రివిధ దళాధిపతులు, దోవల్‌, సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

  • 2025-05-09T18:32:35+05:30

    యుద్ధం మొదలైతే నేను పాల్గొంటా: మంత్రి ఉత్తమ్‌

    • హైదరాబాద్: త్రివిధ దళాలకు మా సెల్యూట్: మంత్రి ఉత్తమ్‌

    • ఒక్క పౌరుడు గాయపడకుండా దాడులు చేశారు: మంత్రి ఉత్తమ్‌

    • ఏ ప్రభుత్వం ఉన్నా బుద్ధిచెప్పడం తప్పనిసరి: మంత్రి ఉత్తమ్‌

    • మన రాఫెల్‌ యుద్ధ విమానాలను ఎక్కడా కూల్చలేదు: మంత్రి ఉత్తమ్‌

    • పాకిస్తాన్‌ అబద్ధాలు చెబుతోంది: మంత్రి ఉత్తమ్‌

    • యుద్ధం మొదలైతే పాకిస్తాన్‌ పతనమే: మంత్రి ఉత్తమ్‌

    • యుద్ధం మొదలైతే నేను పాల్గొంటా: మంత్రి ఉత్తమ్‌

    • నా అవసరం ఏ మాత్రం ఉన్నా యుద్ధానికి వెళ్తా: మంత్రి ఉత్తమ్‌

    • పాక్‌ విచ్ఛిన్నమడం ఖాయం: మంత్రి ఉత్తమ్‌

    • యుద్ధంలో మూడో దేశం ఎప్పుడూ ముందుకు రాదు: మంత్రి ఉత్తమ్‌

    • పీవోకేను ఇండియా స్వాధీనం చేసుకోవాలి: మంత్రి ఉత్తమ్‌

    • పీవోకే నుంచి పాక్‌ను ఖాళీ చేయడమే సమస్యకు పరిష్కారం: మంత్రి ఉత్తమ్‌

    • మన జోష్‌ చూసి పాక్‌ ఎదుర్కొనే ధైర్యం చేయదు: మంత్రి ఉత్తమ్‌

  • 2025-05-09T18:15:56+05:30

    పాకిస్థాన్‌ రెచ్చగొట్టే చర్యలకు దిగింది: విక్రమ్‌ మిస్రీ

    • గత రాత్రి పాకిస్థాన్‌ రెచ్చగొట్టే చర్యలకు దిగింది: విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ

    • పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: విక్రమ్‌ మిస్రీ

    • పలు నగరాలు లక్ష్యంగా పాక్‌ దాడులు చేసింది: విక్రమ్‌ మిస్రీ

    • నిన్నటి దాడుల్లో పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం: విక్రమ్‌ మిస్రీ

    • చాలాసార్లు పాక్‌ ఉల్లంఘనలకు పాల్పడింది: విక్రమ్‌ మిస్రీ

    • ప్రపంచాన్ని మోసం చేసేందుకు పాక్‌ ప్రయత్నం

    • మతం రంగు పూసేందుకు పాక్‌ యత్నిస్తోంది: విక్రమ్‌ మిస్రీ

    • ప్రార్థనా మందిరాలపై దాడులు చేయలేదని పాక్‌ చెప్పడం అబద్ధం

    • భారత్‌పై పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది: విక్రమ్‌ మిస్రీ

    • పూంఛ్‌లోని స్కూల్‌పై పాక్‌ దాడి చేసింది: విక్రమ్‌ మిస్రీ

    • దాడి సమయంలో స్కూల్‌ మూసివేసి ఉంది

    • మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పాక్‌ కుట్ర

    • కర్తార్‌పూర్‌ కారిడార్‌ మూసివేశాం: విక్రమ్‌ మిస్రీ

    • పాక్‌ దాడులను సమర్థంగా ఎదుర్కొన్నాం: విక్రమ్‌ మిస్రీ

    • పాక్‌ చర్యలపై మరోసారి IMFకు ఫిర్యాదు చేస్తాం

    • పాక్‌ ఎయిర్‌స్పేస్‌ను మూసివేయలేదు: విక్రమ్‌ మిస్రీ

    • సింధు జలాల ఒప్పందం రద్దు చేశాం: విక్రమ్‌ మిస్రీ

  • 2025-05-09T18:15:01+05:30

    పాక్‌కు తీవ్ర నష్టం..

    • భారత్‌ దాడిలో పాక్‌కు తీవ్ర నష్టం కలిగింది: వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌

    • పౌర విమానాలను కవచంగా చేసుకుని పాక్‌ దాడి చేసింది: వ్యోమికా సింగ్‌

    • కరాచీ-లాహోర్‌ మధ్య విమానాలు తిరుగుతున్నాయి: వ్యోమికా సింగ్‌

    • మన వాయుసేన ఎంతో సంయమనం పాటిస్తోంది: వ్యోమికా సింగ్‌

    • ఎయిర్‌ స్పేస్‌ మూసివేసినట్లు పాక్‌ తప్పుడు ప్రచారం: వ్యోమికా సింగ్‌

  • 2025-05-09T18:14:03+05:30

    ఢిల్లీ: విదేశాంగ శాఖ ప్రెస్‌మీట్‌..

    • భారత సరిహద్దుల్లో పాక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోంది: కల్నల్‌ సోఫియా ఖురేషి

    • పాక్‌ దాడులను డ్రోన్లతో తిప్పికొట్టాం: కల్నల్‌ సోఫియా ఖురేషి

    • పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్‌ దాడులకు పాల్పడింది: సోఫియా ఖురేషి

    • లేహ్‌ నుంచి సర్‌క్రీక్‌ వరకు 36 చోట్ల దాడులు: సోఫియా ఖురేషి

    • కైనటిక్‌, నాన్‌ కైనటిక్‌ సాధనాలతో భారత్‌ తిప్పికొట్టింది: సోఫియా ఖురేషి

    • పాక్‌ డ్రోన్లన్నీ టర్కీకి చెందినవి గుర్తించాం: సోఫియా ఖురేషి

    • బఠిండా సైనిక స్థావరంపై దాడికి యత్నించారు: సోఫియా ఖురేషి

    • పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: సోఫియా ఖురేషి

    • మిలిటరీ బేస్‌లు టార్గెట్‌గా పాక్‌ దాడులు: సోఫియా ఖురేషి

    • ఉత్తర ప్రాంతంలోని 26 ప్రదేశాలు టార్గెట్‌గా పాక్‌ దాడులు

    • పాక్‌ డ్రోన్లను బలగాలు కూల్చివేశాయి: సోఫియా ఖురేషి

  • 2025-05-09T17:13:43+05:30

    శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు..

    • హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్

    • ఏ క్షణమైన బాంబుతో ఎయిర్‌పోర్ట్‌ను పేల్చివేస్తామని హెచ్చరిక

    • మీ ప్రభుత్వానికి... చెప్పండి... మేము విశ్వసనీయమైన పాక్‌ స్లీపర్ సెల్స్‌ అంటూ బెదిరింపులు

  • 2025-05-09T17:13:42+05:30

    కేంద్ర హోంశాఖ లేఖ..

    • ఢిల్లీ: అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంశాఖ లేఖ

    • సివిల్ డిఫెన్స్ రూల్స్‌తో అత్యవసర అధికారాలు ఉపయోగించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

    • అత్యవసర సమయంలో కావలసిన వస్తువుల సేకరణకు అనుమతిస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్న 1968 సివిల్ డిఫెన్స్ రూల్స్

  • 2025-05-09T17:04:49+05:30

    తెలంగాణ కంట్రోల్ రూమ్..

    • ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

    • సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం..

    • కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం

    • కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌: 011-23380556

  • 2025-05-09T17:03:55+05:30

    కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు.. ఎక్కడంటే..

    • ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

    • కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు: 011-23387089, 9871999430

    • 9871999053, 9871990081, 9818395787

    • రాష్ట్ర ప్రజలకు సహాయం అందించడానికి ఏపీ భవన్‌ కృషి చేస్తుందని తెలిపిన సీఎం చంద్రబాబు

  • 2025-05-09T17:03:15+05:30

    హైఅలర్ట్‌..

    • ఇస్రో కేంద్రాల దగ్గర హైఅలర్ట్‌

    • శ్రీహరికోట, బెంగళూరు సహా 11 కేంద్రాల్లో అలర్ట్‌

    • పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం

    • ఇస్రో కేంద్రాల దగ్గర CISF సిబ్బంది సంఖ్య పెంపు

  • 2025-05-09T15:30:19+05:30

    వీర జవాన్ కుటుంబానికి చంద్రబాబు ఫోన్..

    • జవాన్‌ మురళీనాయక్‌ కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్‌

    • మురళీనాయక్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు

    • మురళీనాయక్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం: చంద్రబాబు

  • 2025-05-09T15:29:23+05:30

    డిఫెన్స్‌కు విరాళం..

    • నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌కు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల విరాళం

    • తెలంగాణ కాంగ్రెస్‌ MLA, MLCల ఒక నెల వేతనం విరాళం

  • 2025-05-09T15:28:40+05:30

    బాణసంచాపై బ్యాన్‌..

    • సరిహద్దుల్లోని అన్ని ప్రాంతాల్లో బాణసంచాపై బ్యాన్‌

    • బాణసంచా క్రయవిక్రయాలపై కేంద్రం నిషేధం

    • సరిహద్దుల్లో బాణసంచా దుకాణాలు మూసివేతకు ఆదేశం

  • 2025-05-09T15:27:52+05:30

    దేశ సరిహద్దుల్లో ట్రాఫిక్‌పై ఆంక్షలు..

    • దేశ సరిహద్దుల్లో 50 కిలో మీటర్లలోపు ట్రాఫిక్‌పై ఆంక్షలు

    • హైఅలర్ట్‌ ప్రాంతాల్లో సాయంత్రం నుంచే బ్లాక్‌ అవుట్‌

    • అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని ఆర్మీ సూచన

  • 2025-05-09T15:26:55+05:30

    భద్రత పెంపు..

    • దేశవ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భద్రత పెంచిన కేంద్రం

    • పోర్టుల్లో భద్రత రెండో లెవెల్‌కు పెంచూతూ నిర్ణయం

    • పోర్టులు, షిప్పులు, టర్మినల్స్‌లో భద్రత పెంపు

  • 2025-05-09T11:34:28+05:30

    మరో ఏడుగురు ఉగ్రవాదులు హతం..

    జమ్మూ కశ్మీర్ సరిహద్దుల వెంట ఇండియన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో మరో ఏడుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతోంది. మే 8, 9 తేదీల్లో జమ్మూ కశ్మీర్‌లో సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల స్థావరాలపై భద్రతా దళాలు అటాక్ చేసింది. ఈ ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించగా.. బీఎస్ఎఫ్ దళాలు వారిని నిలువరించాయి. ఈ క్రమంలో ఏడుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

  • 2025-05-09T11:34:27+05:30

    అల్లకల్లోలంగా పాకిస్థాన్..

    దేశానికి డబ్బులు కావాలంటూ పాక్ ప్రజలు ప్రపంచ బ్యాంక్‌కు విజ్ఞప్తులు చేస్తూ ట్యాగ్‌లు చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలను అడుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది. వద్దని ఎంత వారించినా పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. భారత్ సైన్యం దాడులతో పాకిస్తాన్ ఖంగు తింటోంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలే ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి పాకిస్తాన్‌లో కనిపిస్తోంది.

    మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2025-05-09T10:26:51+05:30

    పాక్ చొరబాటు యత్నాలను భగ్నం చేసిన భారత సైన్యం

    India-vs-Pakistan.jpg

    • జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాల్లో పెద్దఎత్తున చొరబాటుకు యత్నం

    • సరిహద్దు వెంబడి చొరబాటు యత్నాలను భగ్నం చేసిన BSF

    • 9 మంది జైషే మహ్మద్ చొరబాటుదారులను మట్టుబెట్టిన BSF

  • 2025-05-09T10:25:51+05:30

    ప్లీజ్ ఆదుకోండి.. అడుక్కుంటున్న పాక్..

    యుద్ధానికి కాలు దువ్విన పాకిస్థాన్.. ఇప్పుడు దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తుంది. భారత్ దాడులకు తట్టుకోలేక.. ప్రపంచ దేశాలను అడుక్కుంటోంది. ప్లీజ్ ప్లీజ్.. మమ్మల్ని కాపాడండి అంటూ అడుక్కుంటోంది. పాకిస్థాన్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక పోస్ట్ చేసింది. ప్లీజ్ ఆదుకోండి అంటూ ప్రపంచ దేశాలను అడుక్కుంటోంది. శత్రువుల భారీ నష్టం సంభవించిందని.. అంతర్జాతీయ భాగస్వాములు తమను ఆదుకోవాలని పాక్ విజ్ఞప్తి చేస్తోంది. పెరుగుతున్న యుద్ధం, స్టాక్స్ పతనం నేపథ్యంలో.. ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడాలని ప్రపంచ దేశాలను పాక్ ప్రాథేయపడుతోంది.

  • 2025-05-09T10:05:46+05:30

    ఉగ్రవాదులతో పాకిస్థాన్ సంబంధాలు

    • అంతర్జాతీయంగా ఎండగడుతున్న భారత్

    • ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ సైనికాధికారులు

    • ఉగ్రవాదుల అంత్యక్రియల వీడియోలను బయటపెట్టిన భారత్

    • స్కైన్యూస్ చానల్ చర్చలో వీడియోను ప్రదర్శించిన భారత రాయబారి

  • 2025-05-09T09:56:45+05:30

    భారత్-పాక్ ఉద్రిక్తతలతో సీఏ పరీక్షలు వాయిదా

    • ఈనెల 9 నుంచి 14 వరకు జరగాల్సిన పరీక్షలను..

    • వాయిదా వేస్తున్నట్టు ICAI ప్రకటన

  • 2025-05-09T09:46:56+05:30

    చండీగఢ్‌లో మోగిన ఎయిర్ సైరన్‌లు..

    పాకిస్తాన్ నుండి వైమానిక దాడి జరిగే అవకాశం ఉందని నివాసితులను అప్రమత్తం చేస్తూ వైమానిక దళ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే చండీగఢ్‌లో ఎయిర్ సైరన్‌లు మోగాయి. స్థానిక ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంటి లోపలే ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు కోరారు.

  • 2025-05-09T09:40:25+05:30

    చైనా, పాక్‌కు బీఎల్‌ఏ స్ట్రాంగ్ వార్నింగ్..

    చైనా, పాకిస్థాన్ దేశాలకు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మీరు బ్రతికి ఉండాలంటే బలూచిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిపోండి.. లేదంటే మీ అంతు చూస్తాం అంటూ హెచ్చరించింది. ఈ మేరకు బీఎల్‌ఏ మిలిటెంట్లు ఒక వీడియో విడుదల చేశారు.

  • 2025-05-09T09:16:48+05:30

    గుజరాత్‌లోని హజీరా పోర్టులో దాడి అంటూ ఫేక్ ప్రచారం

    • హజీరా పోర్టుపై దాడి జరిగిందని సోషల్ మీడియాలో వీడియో వైరల్

    • హజీరా పోర్టులో దాడి అవాస్తవమన్న PIB

    • వైరల్ వీడియో 2021లో ట్యాంకర్ పేలుడుకు సంబంధించింది.

  • 2025-05-09T09:10:31+05:30

    S-400 మామూలు పవర్ కాదు..

    యుద్ధం కావాలి.. అంటూ విర్రవీగిన పాకిస్థాన్‌కు రియల్ వార్ ఎలా ఉంటుందో చూపిస్తోంది భారత్. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ చేసిన ఇండియా.. టెర్రరిస్టులతో పాటు వాళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వచ్చిన దాయాది దేశం పని పడుతోంది.

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2025-05-09T09:06:59+05:30

    పాక్ కవ్వింపులకు దీటుగా బదులిస్తున్న భారత ఆర్మీ

    • పాక్ మిలిటరీ పోస్ట్ ధ్వంసం చేసినట్టు వీడియో షేర్ చేసిన ఆర్మీ

  • 2025-05-09T07:36:28+05:30

    అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

    • రాత్రి పాక్ ప్రధాని ఇంటి సమీపంలో భారత్ దాడి.

    • షరీఫ్ సేఫ్‌హౌస్‌కు వెళ్లినట్టు సమాచారం.

    • బంకర్‌లో తలదాచుకున్నట్లు వార్తలు.

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2025-05-09T06:54:02+05:30

    పాకిస్థాన్‌కు కోలుకోలేని దెబ్బ..

    • పాకిస్థాన్‌లో 2 వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేత: ఇండియన్‌ ఆర్మీ

    • సర్గోదా, ఫైసలాబాద్‌లో రక్షణ వ్యవస్థలను కూల్చివేశాం.

    • 8 క్షిపణులతో దాడులకు తెగబడిన పాకిస్థాన్ సైన్యం.

    • పాక్ క్షిపణులను నేలకూల్చిన భారత సైన్యం.

  • 2025-05-09T06:53:02+05:30

    రాజస్థాన్‌లో పలు ప్రాంతాలపై పాకిస్థాన్ దాడులు

    • పాకిస్థాన్ దాడులకు దీటుగా జవాబిచ్చిన భారత సైన్యం

    • పోఖ్రాన్‌ ఆర్మీ స్టేషన్‌పై దాడికి పాకిస్థాన్‌ యత్నం

    • క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి యత్నించిన పాక్‌

    • పాక్‌ క్షిపణులు, డ్రోన్లను పేల్చేసిన భారత రక్షణ వ్యవస్థ

    • రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో డ్రోన్లతో పాకిస్థాన్‌ దాడులు

    • జైసల్మేర్‌లో పాకిస్థాన్ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం

  • 2025-05-09T06:52:34+05:30

    సరిహద్దు వెంట పలు ప్రాంతాలపై డ్రోన్లతో పాక్‌ దాడులు

    • పాకిస్థాన్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టిన భారత్‌ సైన్యం

    • పంజాబ్‌లోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్ దాడులు

    • పాకిస్థాన్ దాడులకు దీటుగా జవాబిచ్చిన భారత సైన్యం

    • పఠాన్‌కోట్‌ సెక్టార్‌లో పాక్‌కు చెందిన ఫైటర్‌జెట్‌ను కూల్చిన సైన్యం

    • జలంధర్‌లో పాక్‌ డ్రోన్లను సమర్థంగా అడ్డుకున్న భారత రక్షణ వ్యవస్థ

    • పంజాబ్‌లోని భటిండాలో పాక్‌ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం

  • 2025-05-09T06:50:52+05:30

    భారత్‌, పాకిస్థాన్‌ సంయమనం పాటించాలి: చైనా

    • పరిస్థితులు సంక్లిష్టపరిచే చర్యలకు పాల్పడవద్దు.

    • శాంతి పరిరక్షణకు ఇరుదేశాలు కట్టుబడాలి.

    • ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇతర దేశాలతో కలిసి.. నిర్మాణాత్మకంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

  • 2025-05-09T06:49:35+05:30

    పాకిస్థాన్ ప్రధానికి అమెరికా సెక్రటరీ రుబియో ఫోన్‌

    • తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలన్న రుబియో

    • ఇరుదేశాల మధ్య చర్చలకు మద్దతిస్తామన్న రుబియో

  • 2025-05-09T02:31:36+05:30

    • పాకిస్థాన్‌లో PTI కార్యకర్తల ఆందోళన

    • ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారుల నిరసన

    • ఇమ్రాన్‌ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌

    • ఇస్లామాబాద్‌లో అర్ధరాత్రి ర్యాలీ చేసిన PTI కార్యకర్తలు

  • 2025-05-09T01:32:54+05:30

    articleText

  • 2025-05-09T01:32:53+05:30

    • జమ్మూకశ్మీర్‌: యూరీలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు

    • పూంఛ్‌లో కొనసాగుతోన్న కాల్పులు

    • NSG కమాండ్‌ పరిధిలోకి జమ్మూ ఎయిర్‌పోర్ట్‌

    • జమ్మూ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర భారీగా NSG కమాండోల మోహరింపు

  • 2025-05-09T01:32:52+05:30

    • పాకిస్థాన్‌పై భారత త్రివిధ దళాల ముప్పేట దాడి

    • పెషావర్‌, లాహోర్‌, ఇస్లామాబాద్‌, కరాచీలో బాంబుల వర్షం

    • పాకిస్థాన్‌తో పాటు పీఓకేలో పలు ప్రాంతాలపై భారత్ దాడులు

    • పాక్ సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా దాడులు

  • 2025-05-09T01:32:51+05:30

    • పాకిస్థాన్‌పై ఇప్పటికే కొనసాగుతోన్న భారత్‌ కౌంటర్ అటాక్‌

    • ఉ.9గంటలకు భారత విదేశాంగ శాఖ ప్రెస్‌ మీట్‌

  • 2025-05-09T01:25:09+05:30

    • భారత్‌ దెబ్బకు పాకిస్థాన్‌లో అంతర్గత సంక్షోభం

    • ఆర్మీ చీఫ్ మునీర్‌ను అరెస్ట్‌ చేసిన పాకిస్థాన్‌ CJCSC షంషాద్ మీర్జా

    • గుర్తు తెలియని ప్రాంతానికి మునీర్‌ తరలింపు

    • పాక్ ప్రధాని నివాసానికి సమీపంలో పేలుడు తర్వాత మారిపోయిన పరిణామాలు

    • మునీర్‌ను అరెస్ట్‌ చేసి బాధ్యతలు తీసుకున్న షంషాద్ మీర్జా

  • 2025-05-09T01:24:14+05:30

    • ఏ క్షణమైనా యుద్ధానికి భారత్‌ సిద్ధం

    • పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని అమెరికా వ్యాఖ్యలు

  • 2025-05-09T01:23:12+05:30

    • EU ఉపాధ్యక్షుడితో జైశంకర్ సంప్రదింపులు

    • భారత్‌-పాక్‌ మధ్య ప్రస్తుత పరిస్థితులను వివరించిన జైశంకర్‌

    • ఇటలీ ఉపప్రధానితో జైశంకర్ సంప్రదింపులు

  • 2025-05-09T01:19:50+05:30

    • జమ్మూకశ్మీర్‌: ఉరి సెక్టార్‌లో జనావాసాలే లక్ష్యంగా పాక్ దాడులు

    • జనావాసాలపై షెల్లింగ్‌లతో పాకిస్థాన్ దాడులు

    • జమ్మూకశ్మీర్‌: నౌషేరా సెక్టార్‌లో రెండు పాక్ డ్రోన్లు కూల్చివేత

    • పంజాబ్‌కు అదనపు పారామిలటరీ బలగాలు తరలింపు

  • 2025-05-09T01:18:20+05:30

    • ముప్పేట దాడితో అల్లాడుతోన్న పాకిస్థాన్‌

    • ఒకవైపు భారత్‌, మరోవైపు బలూచ్‌ దాడులు

    • వరుస దాడులతో భయభ్రాంతుల్లో పాకిస్థాన్‌

  • 2025-05-09T01:15:50+05:30

    • ధర్మశాలలో పంజాబ్‌, ఢిల్లీ IPL మ్యాచ్ రద్దు

    • ధర్మశాలలో బ్లాక్‌అవుట్‌తో మ్యాచ్ రద్దు

    • IPL ప్లేయర్లను పఠాన్‌కోట్‌ మీదుగా ఢిల్లీకి తరలింపు

    • IPL ప్లేయర్ల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు

  • 2025-05-09T01:14:29+05:30

    • పఠాన్‌కోట్‌లో మరో పాక్ ఫైటర్ జెట్ కూల్చివేత

    • పాక్ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు: ఆర్మీ

  • 2025-05-09T01:14:28+05:30

    • క్వెట్టాలో బలూచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ దాడులు

    • క్వెట్టాలోని పాకిస్థాన్‌ ఫ్రాంటియర్‌ కోర్‌పై BLA దాడులు

  • 2025-05-09T01:12:17+05:30

    • సరిహద్దుల్లో పరిస్థితులపై కేంద్ర మంత్రి అమిత్‌షా ఆరా

    • ఎయిర్‌పోర్టులలో భద్రతపై CISF డీజీతో మాట్లాడిన అమిత్‌షా

    • BSF డీజీతో మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్‌షా

    • బోర్డర్‌లో ముఖ్య సైనికాధికారులతో అమిత్‌షా చర్చలు

  • 2025-05-09T01:10:31+05:30

    • ఉద్రిక్తతలకు పాల్పడితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామన్న జైశంకర్‌

    • ఉగ్రవాద సంస్థల తరహాలో ప్రవర్తిస్తోన్న పాక్ సైన్యం

    • హమాస్ తరహా దాడులకు పాక్ యత్నిస్తోందన్న భారత్‌

    • ఏప్రిల్‌లో ISI, హమాస్‌ భేటీ అయినట్లు సమాచారం

  • 2025-05-09T01:09:06+05:30

    • లాహోర్‌పై భారత్‌ ముమ్మర దాడులు

    • రంగంలోకి దిగిన భారత వాయుసేన

    • పెషావర్‌లో బాంబుల మోత

  • 2025-05-09T01:09:05+05:30

    • ఢిల్లీలో హైఅలర్ట్‌

    • ఢిల్లీలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని

    • ఇండియా గేట్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత

    • ప్రజలెవరూ బయట తిరగొద్దని ఆదేశం

  • 2025-05-09T01:00:32+05:30

    • భారత్‌ దెబ్బకు తోక ముడిచిన పాకిస్థాన్‌

    • పాకిస్థాన్‌ డ్రోన్లను సమర్థంగా కూల్చేసిన భారత్‌

    • భారత్‌ కౌంటర్‌ ఎటాక్‌తో పాకిస్థాన్‌ మైండ్‌ బ్లాంక్‌

    • కనిపించని పాకిస్థాన్‌ డ్రోన్లు

    • పాకిస్థాన్‌పై కౌంటర్‌ ఎటాక్‌ కొనసాగిస్తోన్న భారత్‌

    • మూడు పాకిస్థాన్‌ ఫైటర్‌ జెట్లను కూల్చేసిన భారత్‌

    • భారత్‌కు సజీవంగా చిక్కిన పాక్‌ రేంజర్‌

    • సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్

  • 2025-05-09T00:59:19+05:30

    • ఇస్లామాబాద్‌లో పాక్‌ ప్రధాని నివాసం దగ్గర భారీ పేలుడు

    • సురక్షిత ప్రాంతానికి పాక్ ప్రధాని షెహబాజ్ తరలింపు

  • 2025-05-09T00:59:18+05:30

    • కరాచీ పోర్టుపై భారత్‌ సైన్యం దాడి

    • కరాచీ పోర్టులో ఏడు భారీ పేలుళ్లు

    • కరాచీ పోర్టులో 10 కార్గో నౌకలు ధ్వంసం

    • INS విక్రాంత్‌ నుంచి మిస్సైల్స్‌, డ్రోన్లు ప్రయోగం

    • 1971 తర్వాత కరాచీపై ఇండియన్ నేవీ దాడులు

    • పెషావర్‌, ఇస్లామాబాద్‌, కరాచీలో భారీ పేలుళ్లు

  • 2025-05-09T00:59:17+05:30

    • భారత్‌ అదుపులో పాకిస్థాన్ పైలట్‌

    • జైసల్మేర్‌లో అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు

    • పైలట్‌ను అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ క్విక్‌ రెస్పాన్స్‌ టీం

    • అఖ్నూర్‌లో మరో పైలట్‌నే అదుపులోకి తీసుకున్న భారత సైన్యం

  • 2025-05-09T00:59:16+05:30

    articleText

  • 2025-05-09T00:47:24+05:30

    • పాకిస్థాన్‌ దాడులకు దీటుగా జవాబిస్తోన్న భారత్

    • లాహోర్‌, సియాల్‌కోట్‌పై భారత్ ప్రతి దాడి.. ఇస్లామాబాద్‌, బహ్వాల్‌పూర్‌లో దాడులు

    • వక్రబుద్ధి ప్రదర్శిస్తోన్న పాకిస్థాన్‌

    • దాడులతో మాకు సంబంధం లేదంటూ పాక్‌ వింత ప్రకటన

  • 2025-05-09T00:44:11+05:30

    • పోఖ్రాన్ ఆర్మీ స్టేషన్‌పై దాడికి పాక్ యత్నం

    • మిస్సైల్స్‌, డ్రోన్లతో దాడికి పాకిస్థాన్ యత్నం

    • పాక్ డ్రోన్లను పేల్చేస్తున్న భారత క్షిపణి రక్షణ వ్యవస్థ

    • జమ్ముపై హమాస్ తరహా దాడి: భారత రక్షణ దళాలు

    • హమాస్‌లాగా పాకిస్థాన్ ఆర్మీ వ్యవహరిస్తోంది: భారత్ ఆర్మీ

  • 2025-05-09T00:44:10+05:30

    • హోషియార్‌పూర్‌లో పాక్ మిస్సైల్‌ ధ్వంసం

    • పాకిస్థాన్‌కు చెందిన 3 యుద్ధ విమానాలు కూల్చివేత

    • పాక్ ఫైటర్ జెట్‌ F-16ను కూల్చివేసిన భారత్‌

    • రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్

  • 2025-05-09T00:33:33+05:30

    • పాకిస్థాన్ సైన్యం అధికారిక ప్రకటన

    • రెండు JF-17 విమానాలు కోల్పోయినట్లు పాక్ ప్రకటన

    • భావోద్వేగంగా తీవ్రమైన నష్టమంటూ పాకిస్థాన్ ప్రకటన

    • కొందరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపిన పాకిస్థాన్‌

    • తాము యుద్ధం కోరుకోవడం లేదంటూ పాక్‌ ప్రభుత్వం కీలక ప్రకటన

  • 2025-05-09T00:33:32+05:30

    • పఠాన్‌కోట్‌లో పాకిస్థాన్ సైనికులను పట్టుకున్న భారత్‌

    • ఎయిర్‌బేస్‌ టార్గెట్‌గా దాడి చేయటానికి వచ్చిన పాక్ సైనికులు

    • పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వీడియో కాన్ఫరెన్స్‌

    • సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలని డీజీపీలకు ఆదేశం

  • 2025-05-09T00:29:56+05:30

    అమెరికా,ఇటలీ,ఈయూ ప్రతినిధులకు విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌

    పాక్ దాడులపై ఫోన్‌లో వివరించిన విదేశాంగ మంత్రి జైశంకర్

    త్రివిధ దళాధిపతులతోపాటు సీడీఎస్‌తో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భేటీ

    భారత్‌లోని 8 వేల ట్విట్టర్‌ ఖాతాలపై నిషేధం

    పాక్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టినట్లు భారత్ ప్రకటన

  • 2025-05-09T00:14:44+05:30

    • ముంబైలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను పెంచారు. సిద్ధివినాయక ఆలయం, గేట్‌వే ఆఫ్ ఇండియా, ముంబాదేవి, బాబా అణు పరిశోధన కేంద్రం, తారాపూర్ అణు కేంద్రం సహా అనేక ప్రదేశాలలో భద్రతను మరింత పటిష్టం చేశారు. సిద్ధివినాయక ఆలయంలోకి కొబ్బరికాయ, దండలు, పూలు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు.

  • 2025-05-09T00:12:30+05:30

    • జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు అవతల నుండి భారీ కాల్పులకు తెగబడుతోంది. నివాస ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ కాల్పుల కారణంగా, ఉరిలో ఒక చోట మంటలు చెలరేగాయి. పాకిస్తాన్ దుశ్చర్యలకు భారత సైన్యం తగిన సమాధానం ఇస్తోంది.

  • 2025-05-09T00:09:19+05:30

    • పాకిస్తాన్‌కు చెందిన ఫైటర్ జెట్ ఎఫ్-16ను భారత సైన్యం కూల్చేసిన సంగతి తెలిసిందే. పఠాన్ కోట్ సెక్టార్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఈ ఫైటర్ జెట్‌ను భారత సైన్యం కూల్చేసింది. ఆ సమయంలో ఆ ఫైటర్ జెట్ పైలెట్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, ఎనిమిది క్షిపణులతో పాకిస్తాన్ దాడికి తెగబడింది.

  • 2025-05-09T00:07:29+05:30

    • భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాల పైనే దాడులకు పాల్పడితే.. పాకిస్తాన్ మాత్రం భారత్‌లోని సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.

    • పాకిస్తాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లను, ఆత్మాహుతి డ్రోన్లను నిర్వీర్యం చేస్తోంది

  • 2025-05-08T23:31:58+05:30

    ఢిల్లీ: తాజా పరిస్థితులపై అమిత్ షా సంప్రదింపులు

    సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

    సరిహద్దు రక్షణ దళాల డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా

    విమానాశ్రయ భద్రతకు సంబంధించి సిఐఎస్ఎఫ్ డీజీ తో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.

  • 2025-05-08T22:31:29+05:30

    చంఢీగఢ్‌, మొహాలీలో మోగిన యుద్ధ సైరన్లు

    సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

    జమ్మూకశ్మీర్‌తో పాటు శ్రీనగర్‌లో విద్యుత్ సరఫరా బంద్‌

    పంజాబ్‌లో గురుదాస్‌పూర్‌, తరన్‌తరన్‌లో బ్లాక్‌అవుట్‌

    చంఢీగఢ్‌, మొహాలీలో మోగిన యుద్ధ సైరన్లు

  • 2025-05-08T22:31:28+05:30

    శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ దగ్గర హైఅలర్ట్‌

    డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిక

    పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఇండియన్ ఆర్మీ

    జమ్ముపై పాక్ దాడులను తిప్పికొట్టాం: భారత రక్షణ శాఖ

    జమ్మూలో ఎలాంటి నష్టం జరగలేదు: భారత రక్షణ శాఖ

    పాకిస్థాన్‌పై దాడికి సిద్ధమవుతున్న త్రివిధ దళాలు

  • 2025-05-08T22:31:27+05:30

    అమెరికాతో విదేశాంగ మంత్రి జైశంకర్ సంప్రదింపులు

    అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియోతో జైశంకర్ చర్చ

    ఉద్రిక్తతలు నియంత్రించాలని కోరిన అమెరికా కార్యదర్శి రూబియో

    ఉగ్రవాదంపై పోరుకు తమ మద్దతు ఉంటుందన్న అమెరికా

  • 2025-05-08T22:31:26+05:30

    ఢిల్లీ: ప్రధాని మోదీ నివాసానికి దోవల్‌

    పాక్‌ దాడులపై చర్చిస్తున్న మోదీ, దోవల్‌

    పాక్ సైనిక చర్యలను పరిశీలిస్తున్న మోదీ

    పాక్ దాడులపై ఎప్పటికప్పుడు మోదీ ఆరా

    త్రివిధ దళాధిపతులు, CDSతో రాజ్‌నాథ్ సమావేశం

  • 2025-05-08T21:49:45+05:30

    రాజస్థాన్‌: జైసల్మేర్‌లో పాక్‌ డ్రోన్లను కూల్చిన సైన్యం

    సాంబా సెక్టార్‌లో దాడులకు తెగబడిన పాక్‌

    పాకిస్థాన్‌ దాడులను తిప్పికొడుతున్న భారత బలగాలు

  • 2025-05-08T21:45:13+05:30

    పాకిస్థాన్‌కు భారత్‌ ఎదురుదెబ్బ

    పాక్‌ F-16 ఫైటర్‌ జెట్‌ని కూల్చేసిన భారత బలగాలు

    మరో రెండు JF-17 యుద్ధవిమానాలు కూల్చిన సైన్యం

    జమ్ము వర్సిటీ దగ్గర 2 పాక్‌ డ్రోన్లు కూల్చివేసిన సైన్యం

    పాక్‌ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టాం: ఆర్మీ

  • 2025-05-08T21:18:41+05:30

    యాంటీ మిస్సైల్‌ సిస్టమ్‌కి దొరక్కుండా డ్రోన్లు ప్రయోగించిన పాక్‌

    యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌తో పాక్‌ డ్రోన్లు కూల్చివేత

    పంజాబ్‌ అమృత్‌సర్‌లో విద్యుత్‌ సరఫరా నిలిపివేత

    జమ్ము ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరిన ఫైటర్‌ జెట్స్‌

    పఠాన్‌కోట్‌ ఎయిర్‌ బేస్‌ను టార్గెట్‌ చేసిన పాక్‌

    జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేత

  • 2025-05-08T21:13:43+05:30

    భారత్ - పాక్ మధ్య యుద్ధం తీవ్రతరం.. జమ్ము ఎయిర్‌ స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్‌ అటాక్‌.. 8 పాక్‌ మిస్సైల్స్‌ను కూల్చేసిన భారత్‌

    • జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులు

    • జమ్ము ఎయిర్‌స్ట్రిప్‌పై పాక్ మిస్సైల్‌ అటాక్‌

    • 8 పాక్‌ మిస్సైల్స్‌ను కూల్చేసిన భారత్‌

    • S400 సిస్టమ్‌తో ధ్వంసం చేసిన భారత సైన్యం

    • జమ్ము, కశ్మీర్‌, రాజస్థాన్‌ను బ్లాకౌట్ చేసిన బలగాలు

    • ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు

    • పలుచోట్ల పాక్‌ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం

    • జమ్ములో ఏడు చోట్ల పేలుళ్ల శబ్దాలు

    • జమ్ము, కశ్మీర్‌, అఖ్నూర్‌, పూంచ్‌లో మోగిన సైరన్‌లు

    • పఠాన్‌కోట్‌ ఎయిర్‌పోర్టును టార్గెట్‌ చేసిన పాక్‌

    • కుప్వారాలో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

  • 2025-05-08T18:56:38+05:30

    ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి ప్రకటన:

    • ఆపరేషన్ సింధూర్ లో హతమైన వ్యక్తులు ఉగ్రవాదులు.

    • ఉగ్రవాదులకు రాష్ట్ర అంత్యక్రియలు నిర్వహించడం బహుశా పాకిస్తాన్‌లో ఒక ఆచారం.

    • పాకిస్థాన్ నిన్న జమ్మూ, కాశ్మీర్‌లోని సిక్కు సమాజం లక్ష్యంగా దాడి చేసింది.

    • పూంచ్‌లోని గురుద్వారా పై పాకిస్థాన్ దాడి చేసింది

    • ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు.

    • పూంచ్‌లో మొత్తం 16 మంది పౌరులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

  • 2025-05-08T18:30:51+05:30

    కాందహార్‌ విమానం హైజాక్‌ మాస్టర్‌ మైండ్‌ రవూప్‌ అజహర్‌ హతం..!

    • భారత్‌ చిరకాల ప్రతీకారం ఆపరేషన్ సింధూర్ ద్వారా తీరింది. అప్పట్లో సంచలనం రేపిన 1999 ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఐసీ-814 హైజాక్‌కు మాస్టర్‌మైండ్‌, జైషే ఉగ్రవాది అబ్దుల్‌ రవూఫ్‌ అజహర్‌ కూడా భారత దాడుల్లో హతమయ్యాడు.

    • ఆపరేషన్ సింధూర్ తొలి దాడిలో భారత్ పాకిస్థాన్ లోని బహావల్‌పుర్‌ మర్కజ్‌ సుబాన్‌ కాంప్లెక్స్‌పై భారత్‌ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి 14 మంది మరణించారు. వీరిలో రవూఫ్‌ అజహర్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రవూఫ్‌ అజహర్‌ కాందహార్ ఫ్లైట్ హైజాక్ తోపాటు పలు ఉగ్రదాడుల్లో నిందితుడు.

  • 2025-05-08T17:37:57+05:30

    ఇండియా డ్రోన్ అటాక్స్.. లబోదిబోమంటూ పాక్ ప్రెస్ మీట్

    • ఆపరేషన్ సిందూర్ అప్‌డేట్స్: కరాచీ, లాహోర్, సహా ఇతర ప్రధాన నగరాలపై దాడి చేయడానికి భారతదేశం డ్రోన్‌లను ఉపయోగించిందని పాకిస్తాన్ పేర్కొంది.

    • పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు క్షిపణి దాడులు చేసిన ఒక రోజు తర్వాత, లాహోర్, కరాచీలపై భారతదేశం డ్రోన్ దాడులు ప్రారంభించిందని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది.

  • 2025-05-08T16:20:47+05:30

    కొనసాగుతున్న ఆపరేషన్‌ సిందూర్‌..

    • పాక్‌ దాడులను తిప్పికొడుతూ భారత్‌ ఎదురుదాడులు

    • పాక్‌ ఆర్మీ హెడ్‌ క్వార్టర్‌పై భారత్‌ డ్రోన్‌ దాడి

    • పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ధ్వంసం చేసిన భారత్‌

    • రావల్పిండి హెడ్‌ క్వార్టర్‌ పైనా భారత్‌ డ్రోన్‌ దాడి

  • 2025-05-08T11:49:24+05:30

    భారత్-పాక్ ఉద్రిక్తత.. హైఅలర్ట్..

    • జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లో హైఅలర్ట్

    • భారత్-పాక్ ఉద్రిక్తతలతో భద్రత కట్టుదిట్టం

    • జమ్ములోని సాంబా, కథువా, ఆర్ఎస్ పురాలో అలర్ట్

    • పోలీసులకు సెలవులు రద్దు చేసిన పంజాబ్‌, రాజస్థాన్‌

    • బహిరంగ సమావేశాలపైనా రెండు రాష్ట్రాల్లో ఆంక్షలు

    • ఇప్పటికే అమృత్‌సర్ ఎయిర్‌పోర్టు తాత్కాలిక మూసివేత

    • పంజాబ్, రాజస్థాన్‌ సరిహద్దులు మూసివేత

    • సరిహద్దులను తమ ఆధీనంలోకి తీసుకున్న BSF

    • సురక్షిత ప్రాంతాలకు సరిహద్దు ప్రజల తరలింపు

    • సరిహద్దు ప్రాంతాల్లో యాంటీడ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు

  • 2025-05-08T11:48:08+05:30

    ఎయిర్‌పోర్టులు మూసివేత..

    • 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

    • ఈనెల 10 వరకు 9 కీలక ఎయిర్‌పోర్టులు మూసివేత

    • జమ్ము, శ్రీనగర్, చండీగఢ్, అమృత్‌సర్, లేహ్, భుజ్, జోధ్‌పూర్, జామ్‌నగర్‌, రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులు మూసివేత

  • 2025-05-08T11:47:11+05:30

    రెచ్చిపోతున్న పాక్.. భారీ ఫిరంగులతో దాడి..

    • LoC వెంట కాల్పుల తీవ్రత పెంచుతున్న పాకిస్థాన్

    • భారీ ఫిరంగులతో దాడులు చేస్తున్న పాక్ రేంజర్లు

    • ఆర్టిలరీ, మోర్టార్ గన్స్, శతఘ్నులతో పాక్ కాల్పులు

    • పాక్‌ కవ్వింపు చర్యలను తిప్పికొట్టిన భారత సైన్యం

    • LoC దగ్గర పాక్ సైనిక పోస్టులను ధ్వంసం చేసిన భారత్

  • 2025-05-08T11:17:59+05:30

    జెత్వాని కేసు.. ఐపీఎస్‌లకు రిలీఫ్

    • ముంబై నటి జెత్వాని కేసులో ఇద్దరు ఐపీఎస్‌లకు ఏపీ హైకోర్టు రిలీఫ్

    • IPSలు విశాల్ గున్నీ, కాంతిరాణాపై తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

    • పోలీస్ అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ పైనా తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించిన హైకోర్టు

    • నిందితుల క్వాష్ పిటిషన్లపై విచారణ జూన్ 30కి వాయిదా

  • 2025-05-08T11:16:50+05:30

    అఖిలపక్ష భేటీ.. ఎందుకంటే..

    • ఢిల్లీ: ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

    • రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్యర్యంలో భేటీ

    • 'ఆపరేషన్ సిందూర్'పై అఖిలపక్షానికి వివరిస్తున్న కేంద్రం

    • హాజరైన ఖర్గే, రాహుల్‌ సహా ఇతర విపక్ష నేతలు

  • 2025-05-08T11:16:01+05:30

    ఏపీ లిక్కర్ స్కామ్.. నిందితులకు ఎదురుదెబ్బ

    • ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

    • కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, బాలాజీ గోవిందప్పకు మధ్యంతర రక్షణ కల్పించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • తదుపరి విచారణ ఈనెల 13కు వాయిదా వేసిన ధర్మాసనం

  • 2025-05-08T10:24:54+05:30

    ఎన్ఐఏ విజ్ఞప్తి

    • ఢిల్లీ: ఏప్రిల్ 22 పహల్గామ్ పర్యాటకులకు NIA విజ్ఞప్తి

    • ఉగ్రదాడి ఘటన ఫొటోలు, వీడియోలు ఉంటే సంప్రదించాలని వినతి

    • దాడికి ముందు పహల్గామ్‌లో టూరిస్టులు, ప్రజలు తీసుకున్న ఫొటోలు, వీడియోలు ఉంటే సంప్రదించాలని NIA సూచన

  • 2025-05-08T10:24:16+05:30

    హెలికాప్టర్ ప్రమాదం.. ఉత్తరాఖండ్‌ సీఎం రియాక్షన్..

    • హెలికాప్టర్ ప్రమాదంపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ దిగ్భ్రాంతి

    • ప్రమాదంలో ఐదుగురి మరణం బాధాకరం: పుష్కర్‌ సింగ్ ధామి

    • గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు

    • ఘటనపై దర్యాప్తు చేయాలని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి ఆదేశాలు

  • 2025-05-08T10:23:01+05:30

    ఘోర ప్రమాదం..

    • ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం

    • ఐదుగురు పర్యాటకులు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు

    • ఉత్తరకాశి జిల్లాలోని గంగ్నాని సమీపంలో ఘటన

    • గంగోత్రి వెళ్తున్న పర్యాటకుల హెలికాప్టర్

    • ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం పుష్కర్ సింగ్‌

    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం

    • ప్రమాదంపై దర్యాప్తు చేయాలని సీఎం పుష్కర్ సింగ్ ఆదేశం