ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: పూల కోసం వెళ్లి మృత్యుఒడిలోకి..

ABN, Publish Date - Aug 29 , 2025 | 12:28 PM

వినాయక చవితిని అట్టహాసంగా జరుపుకోవాలని స్నేహితులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూజకు అవసరమైన కలువ పూల కోసం వెళ్లి చెరువులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటనతో పండుగవేళ బుధవారం బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- చెరువులో మునిగి ఇద్దరు పిల్లల మృతి

- వినాయకచవితి పండుగ వేళ పూండ్లలో విషాదం

బాపట్ల: వినాయక చవితిని అట్టహాసంగా జరుపుకోవాలని స్నేహితులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూజకు అవసరమైన కలువ పూల కోసం వెళ్లి చెరువులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటనతో పండుగవేళ బుధవారం బాపట్ల(Bapatla) మండలం పూండ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూండ్ల గ్రామంలోని పిల్లలు శివాలయంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

పూజకు అవసరమైన కలువ పూల కోసం బుధవారం ఉదయం గ్రామానికి చెందిన సైకం నాగభూషణం(17), శుద్దపల్లి శ్రీమంత్‌(15) అనే ఇద్దరు మరో స్నేహితుడితో కలిసి గ్రామశివారులోని పొన్నూరు మండలం రమణపాలెం సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. నాగభూషణ, శ్రీమంత్‌ తొలుత చెరువులో దిగగా మునిగిపోయారు. గట్టుమీద నుంచి గమనించిన స్నేహితుడు గ్రామంలోకి వెళ్లి సమాచారం ఇచ్చాడు.

గ్రామస్థులు వచ్చేసరికి అప్పటికే చెరువులో లోతుకు వెళ్లిన ఇద్దరూ మృతి చెందారు. ఇంటర్మీడియట్‌ చదువుతున్న పెద్దకుమారుడు నాగభూషణం మృతితో సైకం శ్రీనివాసరావు, జయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీమంత్‌ జన్మస్థలం ఒంగోలు కాగా చిన్నప్పటి నుంచి పూండ్లలోని మేనమామ అయిన బ్రహ్మం దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. అల్లరిముద్దుగా పెంచుకుంటున్న మేనల్లుడి మృత్యువార్త వినగానే మేనమామ, తాత, అమ్మమ్మలు విషాదంలో మునిగిపోయారు.

ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..

4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 29 , 2025 | 12:28 PM