Home » Bapatla
చీరాలలో ఓ వృద్ధురాలు తన చిరకాల కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనతో ఫొటో దిగాలన్న ఆమె కోరికను సీఎం స్వయంగా నెరవేర్చారు.
ఎస్సీ హోదా వర్తింపు అంశానికి సంబంధించి గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై పాస్టర్ ఆనంద్ వేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 15న డిస్మిస్ చేసింది.
చీరాలలో 6 నెలల శిశువు కిడ్నాప్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయ్యింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన ఎస్సీ హోదాను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్.. చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
బాపట్ల జిల్లా చీరాల జాతీయ రహదారిపై అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. పశువులను అక్రమంగా తరలిస్తున్న మూడు వాహనాలను గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే..
వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. విభజన కంటే వైసీపీ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని.. దారిలో పెడుతున్నామని వెల్లడించారు.
బాపట్ల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. సూరేపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభకు హాజరయ్యారు. మీ భూమి - మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు.
ప్రపంచంలో తెలుగువారంతా గర్వించే నగరం అమరావతి అని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా కావాలన్నారని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో.. వైసీపీ అధికారానికే కాదు.. ప్రతిపక్షా హోదాకి సైతం దూరమైంది.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో కోగంటి ఈశ్వర్ చంద్, కృష్ణకుమారి ఆధ్వర్యంలో శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహ జీర్ణోద్ధరణ కార్యక్రమంతో పాటూ కనకదుర్గ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నూతన విగ్రహ వాయు ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్లు కోగంటి భాను ప్రకాష్, కోగంటి అనూష తదితరులు పాల్గొన్నారు.