Bapatla Accident: కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:15 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా మార్టూర్ మండలం కొల్లపూడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయిన కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
బాపట్ల సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా మార్టూర్ మండలం కొల్లపూడి (Kollapudi Accident) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయిన కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదానికి గురైన వారిని లక్ష్మణ్ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్ (25)గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. బాధితులు గుంటూరు నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి