Bapatla News: వాట్సాప్‌తో కొనుగోళ్లు... హాయ్ అంటే ఏఐ సహకారం
ABN , Publish Date - Nov 20 , 2025 | 08:48 AM
ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం సాంకేతిక సేవలను ఉపయోగించుకునే విధానానికి తెరతీసింది. రైతుల కోసం వాట్సాప్ నెంబర్‌ను అందు బాటులోకి తెచ్చింది. 7337359375 నంబ రుకు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ వాయిస్‌తో తదుపరి ప్రక్రియపై రైతులకు మార్గనిర్దేశనం చేస్తుంది.
- సేకరణను సులభతరం చేసే దిశగా అడుగులు
- బాపట్ల, గుంటూరు జిల్లాల్లో కేంద్రాలు ప్రారంభం
- నెలాఖరు నుంచి పల్నాడు జిల్లాలో కొనుగోళ్లకు ఏర్పాట్లు
(బాపట్ల, ఆంధ్రజ్యోతి)
ధాన్యం కొనుగోళ్లను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం సాంకేతిక సేవలను ఉపయోగించుకునే విధానానికి తెరతీసింది. రైతుల కోసం వాట్సాప్ నెంబర్‌ను అందు బాటులోకి తెచ్చింది. 7337359375 నంబ రుకు హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ వాయిస్‌తో తదుపరి ప్రక్రియపై రైతులకు మార్గనిర్దేశనం చేస్తుంది. అన్నదాతలు వాట్సాప్ వేదికగా ఇచ్చే వివరాలతో కొను గోలు స్లాట్ బుక్ కానుంది. వాట్సాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకునే రైతుల ధాన్యా న్ని కొనుగోలు నుంచి వారి ఖాతాల్లో డబ్బు లు జమ అయ్యేవరకు సాంకేతిక బృందం పర్యవేక్షణ కొనసాగనుంది. ఓ వైపు కొను గోలు కేంద్రాలను తెరుస్తూనే, మరో వేదిక గా వాట్సాప్ సేవలను కూడా రైతులకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునే విషయంలో ప్రతీ సీజన్‌లోనూ రైతుల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. ఈ క్రమంలో అర్హత కలిగిన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. వాట్సాప్ నెంబరుకు హాయ్ అనే మెసేజ్ పెట్టిన తర్వాత ఏఐ వాయిస్ ఇచ్చే సూచనలను రైతులు పాటించాల్సి ఉంటుంది. ఆధార్ నంబరు ఎంటర్ చేసిన తర్వాత రైతు తన పేరును ధ్రువీకరించాల్సి ఉంటుంది.

ఏ కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అమ్మాలనుకుంటున్నారో తెలియపరచడంతో, విక్రయానికి సంబంధించి ఇచ్చే మూడు తేదీలలో ఓ దానిని రైతు ఎంపిక చేసుకునే వీలు కూడా కల్పించారు. ఇక ఏ రకం ధాన్యం, పరిమాణం ఎంత అనే వివరాల కోసం ప్రత్యేక ఆప్షన్ వాట్సాప్ ద్వారానే ఇవ్వనున్నారు. తర్వాత ప్రక్రియగా అమ్మకం తేదీ ఖరారు, షెడ్యూల్ బుక్ అయినట్లు స్లాట్ కూపన్ వాట్సాప్ ద్వారానే రైతుల దరికి చేరేలా టెక్నాలజీని ప్రభుత్వం డిజైన్ చేసింది. ఈ విధానంలో అన్నదాతలకు సమయం ఆదాతో పాటు ఖర్చులూ తగ్గనున్నాయి.
పల్నాడులో 286 కేంద్రాలు..
ఈ నెలాఖరు నుంచి పల్నాడు జిల్లాలో ధాన్యం సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 286 రైతు సేవా కేంద్రాల ద్వారా 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు. మూడు జిల్లాల పరిధిలోనూ గతేడాది ఖరీఫ్ సీజన్‌తో పోలిస్తే కొనుగోళ్ల లక్ష్యాన్ని దాదాపుగా రెట్టింపు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల కోసం వాట్సాప్ నెంబర్ 73373 59375
బాపట్ల జిల్లాలో 2 లక్షల టన్నులు
బాపట్ల జిల్లాలో మంగళవారం 5 కొనుగోలు కేంద్రాల సేవలను అందుబా టులోకి తెచ్చిన సివిల్ సప్లయీస్ విభా గం బుధవారం 117 కేంద్రాలను ప్రారం భించింది. రెండు లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. గతేడాది 93,000 మెట్రిక్ టన్నుల సేకరించగా, ఈ ఏడాది ఏకంగా రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేసింది.
గుంటూరులో లక్ష టన్నులు..
గుంటూరు జిల్లాలో బుధవారం నుంచి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. తొలుత 5 రైతు సేవా క్లస్టర్లను ఓపెన్ చేసి, వారం వ్యవధిలో 45 క్లస్టర్లలో కొనుగోళ్లు జరిపేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలో లక్ష టన్నుల వరకు సేకరించేలా ప్రస్తుతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News