Bapatla Accident: కర్లపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే బంధువులు మృతి
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:42 AM
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని కర్లపాలెం వాసులుగా తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బంధువులుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.
బాపట్ల: కర్లపాలెం మండల సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న(ఆదివారం) అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన వారిని కర్లపాలెం వాసులుగా చెప్పారు. మృతులను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బంధువులుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. మృతులను బేతాళం బలరామరాజు( 65 ), బేతాళం లక్ష్మీ ( 60), గాదిరాజు పుష్పవతి( 60), ముదుచారి శ్రీనివాసరాజు( 54)గా పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు