ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Anantapur: పాపం.. మస్తాన్‌ వలి చనిపోయాడు.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Oct 02 , 2025 | 01:12 PM

నగరంలోని క్లాక్‌ టవర్‌ ఫ్రైఓవర్‌ వంతెనపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తపోవనం ప్రాంతానికి చెందిన దూదేకుల మస్తాన్‌ వలి(32)దుర్మరణం చెందాడు.

- రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

అనంతపురం: నగరంలోని క్లాక్‌ టవర్‌ ఫ్రైఓవర్‌(Clock Tower Flyover) వంతెనపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తపోవనం ప్రాంతానికి చెందిన దూదేకుల మస్తాన్‌ వలి(32)దుర్మరణం చెందాడు. అనంతపురం ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన మేరకు నారాయణపురం పంచాయతీలోని తపోవనానికి చెందిన మస్తాన్‌ వలి(Mastan Wali) నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పని చేస్తున్నాడు.

భార్య ఆశాతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన ద్విచక్రవాహనంపై నగరంలోకి బయల్దేరాడు. అయితే క్లాక్‌టవర్‌ ఫ్లైఓవర్‌ వంతెన మధ్యలోకి రాగానే ఎలా జరిగిందో తెలియదు కానీ ఉరవకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కింద మస్తాన్‌వలి పడ్డాడు. తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అదృష్టవశాత్తు ఆయన భార్య ప్రమాదం నుంచి బయటపడ్డారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనంతపురం ట్రాఫిక్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2025 | 01:12 PM