ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Flexi Cap Funds: ఒకేసారి రూ.4.5 లక్షల పెట్టుబడి..రాబడి రూ.20.84 లక్షలు

ABN, Publish Date - May 06 , 2025 | 09:06 PM

తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఈ కోరికను నెరవేర్చుకోవడం మాత్రం అంత తేలిక కాదు. సంపాదనలో నిలకడ లేకపోవడం, పెట్టుబడి ఎంపికలో స్పష్టత లేకుండా ఉన్నవారికి ఇది కాస్త కష్టం కావచ్చు. కానీ ఐదేళ్లలో 4 లక్షలతో 20 లక్షలు ఎలా సంపాదించాలనేది ఇక్కడ తెలుసుకుందాం.

Flexi Cap Fund Returns

తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తారు. కానీ ఆచరణలో మాత్రం దానిని కొంత మంది మాత్రమే పాటిస్తారు. అయితే మాములుగా బ్యాంకుల్లో లేదా పోస్టాఫీస్ స్కీంలలో పెట్టుబడులు చేస్తే మాత్రం మీ పెట్టుబడులు పెరగవు. ఇలాంటి క్రమంలో మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. వీటి ద్వారా సరైన ప్లాన్ చేసుకుంటే మీ కలను ఈజీగా సాకారం చేసుకోవచ్చు. అంతేకాదు గత 5 ఏళ్లలో స్టాక్ మార్కెట్ అనిశ్చితి ఉన్నా కూడా పలు రకాల ఫండ్స్ మత్రం పెట్టుబడిదారులకు ఊహించని రీతిలో రాబడులను అందించాయి.


మార్కెట్ పరిస్థితులను..

ఇది అదృష్టం కాదు, సమయస్ఫూర్తి, మార్కెట్ అవగాహన, సరైన పద్ధతిలో ప్లాన్ ప్రకారం పెట్టుబడి చేస్తే ఏదైనా సాధ్యం అవుతుంది. ఇలాంటి క్రమంలో ఎలాంటి ఫండ్లు ఎక్కువ రాబడిని అందిస్తాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, దీని కోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్‌ వివిధ రకాలుగా ఉంటాయి. వీటిలో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ (Flexi Cap Funds) ఒకటి.

ఈ ఫండ్స్‌ విశేషం ఏమిటంటే ఇవి పెద్ద కంపెనీలు (లార్జ్ క్యాప్), మధ్యస్థాయి కంపెనీలు (మిడ్ క్యాప్), చిన్న కంపెనీలు (స్మాల్ క్యాప్) అన్నింటిలోనూ పెట్టుబడి పెట్టే స్వేచ్ఛను కలిగి ఉంటాయి. ఇది ఫండ్ మేనేజర్‌కు మార్కెట్ పరిస్థితులను బట్టి పెట్టుబడి పునఃవిభజన చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ కారణంగా పెట్టుబడిదారులకు మెరుగైన రాబడులు వస్తాయి. దీంతోపాటు రిస్క్‌ను సమర్థవంతంగా నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది.


పరిస్థితులను బట్టి

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఒక అద్భుతమైన ఎంపిక. ఈ ఫండ్స్ లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ కంపెనీల స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే సౌలభ్యాన్ని అందిస్తాయి. ఫండ్ మేనేజర్లు మార్కెట్ పరిస్థితులను బట్టి వివిధ రంగాలు, కంపెనీలలో పెట్టుబడులను మార్చుతారు. ఉదాహరణకు ఒక రంగంలో పనితీరు తగ్గినప్పుడు, ఫండ్ మేనేజర్ ఆ రంగం నుంచి బయటకు వచ్చి, మంచి పనితీరు కనబరుస్తున్న రంగంలో పెట్టుబడి చేస్తారు. దీనివల్ల పెట్టుబడిదారులు రిస్క్‌ను తగ్గించుకుంటూ, అత్యధిక రాబడిని పొందగలరు.


ఐదు రెట్ల లాభం..

ఈ క్రమంలోనే క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గత 5 ఏళ్లలో 35.88 శాతం వార్షిక రాబడిని అందించింది. ఇది ప్రస్తుతం అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఈ ఫండ్ ఆస్తుల నిర్వహణ (AUM) రూ.6,712 కోట్లు కాగా, నికర ఆస్తి విలువ (NAV) రూ.105.93గా ఉంది. NIFTY 500 TRI బెంచ్‌మార్క్‌తో పోలిస్తే, 2013 జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఫండ్ 19.38 శాతం వార్షిక రాబడిని అందించింది. ఈ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 0.62 శాతం. కనీస SIP పెట్టుబడి రూ.1,000, కనీస ఒకేసారి పెట్టుబడి మొత్తం రూ.5,000. అయితే దీనిలో ఒకేసారి రూ.4.5 లక్షల పెట్టుబడి పెట్టిన వారికి, గత 5 ఏళ్లలో ఈ ఫండ్ దానిని రూ.20,84,000 పెంచేసింది. అంటే ఐదేళ్లలోనే ఐదు రెట్ల మొత్తాలను అందించింది ఈ ఫండ్.

గమనిక: ఆంధ్రజ్యోతి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేయాలని సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.


ఇవి కూడా చదవండి:


Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Sridhar Babu: సీఎం రేవంత్‎ను సమర్థిస్తూనే బీఆర్ఎస్‎కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..


Indian Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఈ కంపెనీలకు బిగ్ లాస్


ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..

Read More Business News and Latest Telugu News

Updated Date - May 06 , 2025 | 09:09 PM