Indian Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఈ కంపెనీలకు బిగ్ లాస్
ABN , Publish Date - May 06 , 2025 | 03:38 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 155.77 పాయింట్లు పడిపోయి 80,641.07 వద్ద ముగిసింది. దీంతోపాటు సూచీలు మొత్తం దిగువకు పడిపోయాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

భారత స్టాక్ మార్కెట్ (Indian Stock Market) సూచీలు మంగళవారం (మే 6, 2025న) భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం రెడ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 156 పాయింట్ల నష్టపోయి 80,641 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 82 పాయింట్లు తగ్గిపోయి 24,379 పరిధిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 648 పాయింట్లు దిగజారీ 54,271 వద్ద ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1240 పాయింట్లు దిగజారింది. ఈ నేపథ్యంలో మదుపర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.
టాప్ 5 లాసింగ్ స్టాక్స్
అన్ని రంగాల్లోనూ అమ్మకాలు పెరగడంతో సూచీలు ఒత్తిడిలో కనిపించాయి. ఈ నేపథ్యంలో Eternal (Zomato), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), టాటా మోటార్స్, NTPC, అదానీ పోర్ట్స్ కంపెనీల స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఇక లాభాల్లో నిలిచిన కంపెనీలలో భారతి ఎయిర్‌టెల్, టాటా స్టీల్, మహీంద్రా & మహీంద్రా (M&M), హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా ఉన్నాయి. ఇదే సమయంలో Nifty Midcap100 సూచీ 2.27% పడిపోగా, Nifty Smallcap100 సూచీ 2.50% నష్టపోయింది.
రంగాల వారీగా చూస్తే..
ఇక రంగాల వారీగా చూస్తే ఆటోమొబైల్ తప్ప, NSEలోని అన్ని ప్రధాన రంగాల సూచీలు నెగటివ్ ట్రెండ్‌ను కనిపించాయి. ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ PSU బ్యాంక్ ఇండెక్స్ 4.84% పడిపోయింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 10.91%, యూనియన్ బ్యాంక్ 6.33%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.19% నష్టపోయాయి. దీంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా అమ్మకాల ఒత్తిడికి లోనైందే. గోద్రేజ్ ప్రాపర్టీస్ 6.36%, శోభా 4.96% నష్టపోయాయి. ఇదే సమయంలో మార్కెట్‌లో ఉన్న అస్థిరతను సూచించే ఇండియా VIX సూచీ 3.58% పెరిగి 19 వద్ద స్థిరపడింది. ఇది సమీప భవిష్యత్తులో మరింత హెచ్చుతగ్గులకు లోనుకానుంది.
వీటి ఫలితాలు కూడా..
ఈరోజు మార్కెట్ పరిస్థితి చూస్తే పెట్టుబడిదారుల్లో అప్రమత్తత వృద్ధి ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సెంటిమెంట్ మెరుగుపడాలంటే మద్దతు స్థాయిల వద్ద కొనుగోళ్ల జోరు అవసరమని నిపుణులు చెబుతున్నారు. Q4 ఫలితాలు అంచనాలను మించిపోవడంతో మహీంద్రా & మహీంద్రా షేర్లు 4% పైగా పెరిగాయి. రక్షణ లాజిస్టిక్స్ డ్రోన్ల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ఇజ్రాయెల్‌కు చెందిన హెవెన్‌డ్రోన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పరాస్ డిఫెన్స్ షేర్లు 4% పుంజుకున్నాయి. జపాన్ SMBC ఒప్పందానికి దగ్గరగా ఉండటంతో యెస్ బ్యాంక్ షేర్లు 8% పైగా పెరిగాయి.
ఇవి కూడా చదవండి:
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read More Business News and Latest Telugu News