ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Israel-Iran conflict: ఇజ్రాయెల్-ఇరాన్ వార్‌తో మీ జేబుకు చిల్లు.. ఇండియాలో ఈ వస్తువులు ధరలు పెరుగుతాయ్!

ABN, Publish Date - Jun 16 , 2025 | 11:39 AM

ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్ల అస్థిరతకు దారితీయడంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇండియాలోని సామాన్య ప్రజలకు ఈ యుద్ధ సెగ తాకనుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

How Israel-Iran tensions impact India economy

Iran Israel War Effect On Indian Economy: పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ ప్రకంపనలు ప్రపంచ మార్కెట్లను ఊపేస్తున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైన వెంటనే ముడి చమురు ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయాయి. మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్టుబడులు ఆవిరవుతాయని ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచంలో చమురు ఉత్పత్తిదారులలో కీలకమైన ఇరాన్ నుంచి భారతదేశం చమురు దిగుమతి చేసుకోనప్పటికీ.. రానున్న రోజుల్లో ఈ కింది వస్తువుల ధరలు విపరీతంగా పెరగనున్నాయ్. ఈ వార్ సామాన్య ప్రజల జేబులకు చిల్లు వేయడం ఖాయమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రస్తుతం తారాస్థాయికి చేరాయి. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి క్షిపణులతో భీకర దాడులు చేసుకుంటున్నాయి. పరిస్థితి మరింత దిగజారి యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం మధ్యప్రాచ్యం మొత్తం ఇబ్బందుల్లో పడిపోవడం ఖాయమని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు దేశాలతో స్వేహపూర్వక వాణిజ్య సంబంధాల కారణంగా భారతదేశ ఆర్థికవ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే, ఇండియా ఇరాన్, ఇజ్రాయెల్‌కు వివిధ వస్తువులను ఎగుమతి చేస్తుంది. అనేక ముఖ్యమైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. పూర్తి స్థాయి యుద్ధం జరిగితే ఇండియాలో అనేక వస్తువుల ధరలు గణనీయంగా పెరగవచ్చు.

ముడి చమురు ధర పెరుగుదల

భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎక్కువగా విదేశాలపైనే ఆధారపడింది. దాదాపు 85 శాతం ఇతర దేశాల నుంచే చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురును నేరుగా దిగుమతి చేసుకోనప్పటికీ మన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రపంచ చమురు ఉత్పత్తిదారులలో ఇరాన్ కీలకంగా ఉండటమే కారణం. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పటికే చమురు మార్కెట్‌ను దెబ్బతీసింది. ముడి చమురు ధరలు 11 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 75.32 డాలర్లకు ఎగబాకింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) బ్యారెల్‌కు73.42 డాలర్లకు చేరుకుంది. యుద్ధం మరింత తీవ్రమైతే ముడి చమురు ధరలు మరింత పెరగవచ్చు. ఇది భారతదేశ దిగుమతి ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా, భారతదేశంలో పెట్రోల్, డీజిల్, LPG, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF)తో సహా ఇంధన ధరలు భారీగా పెరగవచ్చు.

భారతదేశం ఇజ్రాయెల్ నుంచి ఏమి దిగుమతి చేసుకుంటుంది?

భారతదేశం ఇజ్రాయెల్ కు ఆసియాలో రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదవ స్థానంలో ఉంది. ఇటీవలి సంవత్సరాలలో రెండు దేశాలు అనేక రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం నెరుపుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ యంత్రాలు, హై-టెక్ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు వంటి రంగాలలో.

ఇరాన్ నుండి భారతదేశం ఏమి దిగుమతి చేసుకుంటుంది?

మార్చి 2025లో భారతదేశం ఇరాన్‌కు130 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. 43 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇరాన్‌కు ఎగుమతులు 41.5 మిలియన్ డాలర్ల నుంచి 88.1 మిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే ఏకంగా (47.1% పెరుగుదల) నమోదైంది. ఇరాన్ నుంచి దిగుమతులు 56.2 మిలియన్ డాలర్ల నుంచి13.3 మిలియన్ డాలర్లకు (23.6% తగ్గుదల) తగ్గాయి.

ఇండియాలో భారీగా పెరగనున్న ఈ ఉత్పత్తుల ధరలు..

  • విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు

  • ఆయుధాలు, మందుగుండు సామగ్రి

  • ఆప్టికల్, ఫోటో, సాంకేతిక వైద్య పరికరాలు

  • ఎరువులు, సేంద్రీయ రసాయనాలు

  • యంత్రాలు, అణు రియాక్టర్లు, బాయిలర్లు

  • అల్యూమినియం, ఇతర రసాయన ఉత్పత్తులు

  • ముత్యాలు, విలువైన రాళ్ళు, లోహాలు, నాణేలు

  • సేంద్రీయ రసాయనాలు

  • మూల లోహాలతో తయారు చేయబడిన పనిముట్లు మొదలైనవి.

  • పండ్లు, గింజలు, కూరగాయల ఉత్పత్తులు

  • ఖనిజ ఇంధనాలు, నూనెలు

  • ఉప్పు, సల్ఫర్, బంకమట్టి, రాయి, ప్లాస్టర్, సున్నం, సిమెంట్

  • ప్లాస్టిక్స్, వాటి ఉత్పత్తులు

  • ఇనుము, ఉక్కు, గమ్స్, రెసిన్లు, లక్కలు

ఇవీ చదవండి:

Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Adani Ports: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు.. హైఫా పోర్టుకు ఎలాంటి నష్టమూ జరగలేదన్న అదానీ గ్రూప్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 01:07 PM