ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరాయంటే

ABN, Publish Date - Jun 23 , 2025 | 06:55 AM

భారతదేశంలో బంగారం, వెండి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. కొన్ని రోజుల క్రితం లక్ష రూపాయలకు చేరుకున్న ఈ ధరలు స్వల్పంగా తగ్గిపోయాయి. అయితే నేడు (gold rates on june 23rd 2025) వీటి ధరలు ఏ మేరకు చేరుకున్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Gold Silver Prices Drop June 23rd 2025

దేశంలో ఇటీవల లక్ష రూపాయలకు చేరుకున్న 10 గ్రాముల పసిడి ధరలు (gold rates on june 23rd 2025) ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వీటి ధరలు భారీగా పుంజుకున్నాయి. కానీ నేడు (జూన్ 23, 2025న) గత ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల భారీగా పెరిగిన తర్వాత గోల్డ్ రేట్లు కొంత వరకు తగ్గడం ఒత్తిడిలో ఉన్న వినియోగదారులకు కొంత ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. డాలర్‎తో పోల్చుకుంటే రూపాయి విలువ పెరగడం, మార్కెట్‌లో స్థిరత్వం వంటి పలు అంశాల కారణంగా దేశీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గే ఛాన్స్ ఉంది.

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ నేపథ్యంలో జూన్ 23, 2025న గుడ్‎రిటర్న్స్ వెబ్‎సైట్ ప్రకారం ఉదయం 6.30 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100,740గా ఉంది. ఈ రేటు నిన్నటితో పోల్చుకుంటే రూ. 10 తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 92,340కి చేరింది. ఇదే సమయంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100,890కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 92,490గా ఉంది.

వెండి రేట్లు ఇలా..

మరోవైపు వెండి ధరలు కూడా తగ్గిపోయాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ.1,09,900 స్థాయికి చేరుకుంది. ఇక చెన్నై, హైదరాబాద్‎లో రూ. 1,19,900గా ఉంది. మరోవైపు పూణేలో రూ.109,900లో ఉండగా, బెంగళూరు, వడోదర, కేరళ, ఢిల్లీలో కూడా రూ.109,900 స్థాయిలో ఉంది. స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన తర్వాత బంగారం, వెండి రేట్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కొనుగోలు చేసే ముందు వీటి ధరలను తప్పక తెలుసుకోవాలి.

ఇవీ చదవండి:

గుడ్ న్యూస్.. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్ వడ్డీ రేట్ల తగ్గింపు

ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 23 , 2025 | 07:10 AM